Andhra Pradesh

News July 2, 2024

పుట్లూరు మండలంలో పోక్సో కేసు నమోదు

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో మైనర్ బాలికపై అత్యాచారం ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బలవంతంగా ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఓ యువకుడు బాలికపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై హేమాద్రి తెలిపారు.

News July 2, 2024

కారంపూడి: విద్యార్థులకు లైంగిక వేధింపులు.?

image

కారంపూడి మండలం పెదకోదమగుండ్ల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో సోషల్ టీచర్‌ ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు హెచ్ఎంకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామస్థులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్‌పై దాడికి యత్నించారు. దీంతో తల్లిదండ్రులను అడ్డుకుని శాంతింపజేశామని ఉపాధ్యాయులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 2, 2024

అనంత: వాటర్ ట్యాంక్‌లో విషప్రయోగం.. నలుగురి అరెస్ట్

image

కణేకల్లు మండలం తుంబిగనూరులో గత నెల 14న సంచలనం రేపిన వాటర్ ట్యాంక్‌లో విషప్రయోగం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు. సీఐ ప్రసాద్ బాబు వివరాల మేరకు.. సర్పంచ్ ఫణీంద్ర ఆధీనంలోని పంచాయతీ వాటర్ ఫిల్టర్ ప్లాంట్ తమకు అప్పగించాలని టీడీపీ నేతలు కోరారు. అందుకు సమ్మతించని ఫణీంద్ర టీడీపీ నేతలపై కేసు బనాయించాలనే కుట్రతో మరో నలుగురు వ్యక్తులతో ట్యాంకులో విషయం కలిపించినట్లు తెలిపారు.

News July 2, 2024

నాడు గూడూరు సబ్ కలెక్టర్.. నేడు నెల్లూరు కలెక్టర్

image

ఇవాళ నెల్లూరు కలెక్టర్ గా నియమితులైన ఓ.ఆనంద్ గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ గా పనిచేశారు. 2018 వ సంవత్సరం నుంచి సుమారు ఒకటిన్నర సంవత్సరం గూడూరు సబ్ కలెక్టర్ గా పనిచేశారు. ఈయన పనిచేసిన కాలంలో గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నో భూ సమస్యలకు పరిష్కారం చూపినట్లు గూడూరు ప్రజలు గుర్తు చేసుకున్నారు. గూడూరు సబ్ కలెక్టర్.. నెల్లూరు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందని ప్రజలు అంటున్నారు.

News July 2, 2024

శ్రీకాకుళం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

* నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణకు చర్యలు: కలెక్టర్ * శ్రీకాకుళం కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్ నియామకం * జూలై 4న దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్: ఎస్‌ఎఫ్‌ఐ * కౌలు రైతులకు గుర్తింపు కార్డు: వ్యవసాయ అధికారి * ప్రతిభ చూపిన ITI విద్యార్థి* రైతు బజార్లకు పూర్వ వైభవం: మంత్రి అచ్చెన్న* మహిళను హత్య చేసి.. లొంగిపోయాడు 

News July 2, 2024

శ్రీకాకుళం: కరెంటు బిల్లు చెల్లిస్తున్నారా?

image

ఏపీఈపీడీసీఎల్ వినియోగదారులు విద్యుత్ బిల్లులను ఏపీఈపీడీసీఎల్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో చెల్లించాలని సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ మంగళవారం వెల్లడించారు. ఆర్బీఐ మార్గదర్శకాలతో ఫోన్ పే, గూగుల్‌ పే, పేటీఎంలో విద్యుత్ బిల్లు ఇకనుంచి చెల్లించలేరని తెలిపారు. సంస్థకు చెందిన APEPDCL Eastern Power యాప్‌ ప్లేస్టోర్‌ డౌన్‌లోడ్ చేసుకుని లేదా వెబ్‌సైట్‌లో బిల్లు చెల్లించాలని కోరారు.

News July 2, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.రామచంద్రయ్య నామినేషన్

image

ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత సి. రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో ఆయన రాష్ట్ర మంత్రులతో కలిసి తన నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆయనపై వైసీపీ నేతలు ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శాసనమండలి ఛైర్మన్ ఆయనను అనర్హుడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ అయిన ఆ స్థానానికి నామినేషన్ వేశారు.

News July 2, 2024

రాష్ట్రపతిని కలిసిన అరకు ఎంపీ తనూజారాణి

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మంగళవారం అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతంలో నెలకొన్న సమస్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జీవో నంబర్-3ని అమలు చేయాలని కోరారు. గిరిజన కాఫీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, గిరిజన కాఫీ సొసైటీ స్థాపించాలని రాష్ట్రపతిని కోరినట్లు ఎంపీ తెలిపారు.

News July 2, 2024

కడప: ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు

image

కడపలోని సాయిబాబా స్కూల్‌లో పైకప్పు పెచ్చుుల ఊడిపడి ఆరుగురు విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల ఛైర్మన్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం వల్లే పాఠశాల గది పైకప్పు కూలిందని పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.

News July 2, 2024

విమర్శలకు తావులేకుండా పకడ్బందీగా మెగా డీఎస్సీ: మంత్రి లోకేశ్

image

మెగా డీఎస్సీని ఎటువంటి విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సచివాలయంలోమంగళవారం సమీక్ష నిర్వహించారు. సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆరా తీశారు. సిలబస్‌లో ఎటువంటి మార్పులు చేయలేదని అధికారులు మంత్రికి వివరించారు.