Andhra Pradesh

News July 2, 2024

అనంతపురం జిల్లా మహిళలకు గుడ్‌న్యూస్

image

జిల్లాలోని మహిళా నిరుద్యోగులకు రూడ్ సెట్ సంస్థ శుభవార్త చెప్పింది. ఆకుతోటపల్లిలోని ఎస్కే యూనివర్సిటీ పక్కనున్న రూడ్ సెట్ కార్యాలయంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్, బ్యూటీ పార్లర్, జర్దోసి మగ్గంలపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 26 నుంచి నెల రోజులపాటు ఉచిత శిక్షణతో పాటు వసతి భోజనం సౌకర్యం కల్పిస్తామన్నారు. 9618876060కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News July 2, 2024

రైతు బజార్లను బలోపేతం చేయాలి: మంత్రి అచ్చెన్న

image

కూరగాయల ధరల పెరుగుదల నియంత్రణతో పాటు రైతులకు గిట్టుబాటు ధర దక్కే విధంగా రైతు బజార్లలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్వ వైభవం ఉట్టిపడేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. ధరల పెరుగుదల, దిగుబడులపై ఆయన చర్చించారు.

News July 2, 2024

ప్రకాశం: ఆగస్టు 31 వరకు చేపల వేట నిషేధం

image

ప్రకాశం జిల్లాలోని కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్లో సోమవారం నుంచి ఆగస్టు 31 వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తూ మత్స్య శాఖ అధికారి ఎం రవీంద్ర మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జులై 1 నుంచి ఆగస్టు వరకు చేపలు సంతానోత్పత్తి జరుపుతాయి కాబట్టి చేపల వేట చేయకూడదన్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన యెడల లైసెన్సులను రద్దుచేసే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 2, 2024

కలెక్టర్‌గా ‘హిమాన్షు శుక్లా’ మార్క్.. 2 వంతెనలకు ఆయన పేరు

image

అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా తనముద్ర వేసుకున్నారు. ఎంతలా అంటే.. జిల్లాలోని 2 వంతెనలకు ఆయన పేరు పెట్టుకునేంత. మామిడికుదురు-అప్పనపల్లిని కలిపే వంతెనకు ‘శుక్లా వారధి’ అని.. లుటుకుర్రు-పాశర్లపూడిని కలిపే వంతెనకు ‘హిమాన్షు శుక్లా రామసేతు’ అని ఆయా గ్రామ పంచాయతీలలో తీర్మానం చేసి నామకరణం చేసుకున్నారు. ఈ వంతెన నిర్మాణంలో హిమాన్షు శుక్లా ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

News July 2, 2024

తిరుమల నడక మార్గం భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత: TTD ఈవో

image

అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని TTD ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ అటవీ,TTDఅటవీ,ఇంజనీరింగ్,భద్రత విభాగాలతో ఈవో సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకొనేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.

News July 2, 2024

శ్రీకాకుళం: మహిళను హత్య చేసి.. PSలో లొంగిపోయాడు

image

పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లికి చెందిన రాజేశ్వరి అనే మహిళ మంగళవారం దారుణహత్యకు గురైంది. పోలీసుల వివరాలు.. నర్సన్నపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ గోపాలరావు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం డెడ్‌బాడీని ఆటోలో పొందూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయాడు. 3ఏళ్లుగా అతడితో చనువుగా ఉండి.. ఇప్పుడు దూరం పెడుతోందని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 2, 2024

వైజాగ్ వారియర్స్‌కు మరో విజయం

image

APLలో వైజాగ్ వారియర్స్ ఘన విజయం సాధించింది. విశాఖ వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో రాయలసీమ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటి బ్యాటింగ్ చేసిన రాయలసీమ కింగ్స్ 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వైజాగ్ వారియర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

News July 2, 2024

BREAKING: పార్వతీపురం జిల్లాకు కొత్త కలెక్టర్ నియామకం

image

పార్వతీపురం మన్యం జిల్లాకు నూతన కలెక్టర్‌గా ఏ.శ్యామ్ ప్రసాద్‌ను నియమించారు. ఈయన పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. రాష్ట్రంలో పలువురు కలెక్టర్ల బదిలీల్లో భాగంగా మన్యం జిల్లాకు ఈయన రానున్నారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న నిశాంత్ కుమార్ బదిలీపై వెళ్లారు.

News July 2, 2024

కడప: ఆరోజు స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపు

image

నీట్, నెట్ పరీక్ష పేపర్ల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. కడపలో వారు మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, దీనిపై పార్లమెంట్‌లో మోదీ చర్చించి న్యాయం చేయాలని కోరారు. లీకేజీలతో విద్యార్థులు నష్టపోయారన్నారు.

News July 2, 2024

ముండ్లమూరు: ASI వెంకటేశ్వరరావు సస్పెండ్

image

విధి నిర్వహణలో ఉన్న ఏఎస్సై వెంకటేశ్వరరావు ముండ్లమూరు మండలంలోని శంకరాపురంలో <<13549923>>మందుబాబులతో కలిసి డాన్సు<<>> చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ASI పై ఎస్పీ సుమిత్ సునీల్ విచారణ జరిపారు. విచారణ నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపగా, గుంటూరు రేంజ్ ఐజి త్రిపాఠి ఈరోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.