Andhra Pradesh

News July 2, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి పత్తికొండ ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకం ఏర్పాటు

image

పత్తికొండ: ప్రజా సమస్యల పరిష్కారానికై “ఎమ్మెల్యే హెల్ప్ లైన్”పుస్తకాన్ని ప్రవేశ పెట్టామని పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కే.ఈ. శ్యాం కుమార్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను నేరుగా టీడీపీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకంలో నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు.

News July 2, 2024

AU: బి-ఫార్మసీ, ఫార్మా-డి పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బి-ఫార్మసీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలతోపాటు ఫార్మా-డి 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షలు విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఫలితాలను వెబ్ సైట్ నుంచి నేరుగా పొందవచ్చని సూచించారు.

News July 2, 2024

కావలి ప్రమాదం నన్ను ఆందోళనకు గురి చేసింది: లోకేశ్

image

కావలి సమీపంలో పాఠశాల బస్సును లారీ ఢీకొనడంతో ఒకరు <<13549405>>చనిపోయిన<<>> విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. క్లీనర్ చనిపోవడం బాధాకరం. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించా. స్కూలు యాజమాన్యాలు బస్సులను కండీషన్‌లో ఉంచుకోవాలి. బస్సుల ఫిట్ నెస్ విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి’ అని విజ్ఞప్తి చేశారు.

News July 2, 2024

అల్లూరి జిల్లా కలెక్టరేట్‌లో ట్రైనీ కలెక్టర్లు

image

విశాఖపట్నం నుంచి ఆరుగురు ట్రైనీ కలెక్టర్లు ఫీల్డ్ విజిటింగ్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కలెక్టర్ వారి కార్యాలయానికి విచ్చేశారు. ఆరుగురు ట్రైనీ కలెక్టర్లకు కొద్దిరోజుల్లో పోస్టింగ్స్ కేటాయిస్తున్న సందర్భంగా ఫీల్డ్ విజిట్ చేస్తున్నట్లు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. ట్రైనీ కలెక్టర్లలో ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు.

News July 2, 2024

డిప్యూటీ CM ఆదేశాలతో మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విజయవాడ పోలీసులు యువతి <<13500067>>మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు.<<>> దాదాపు 9 నెలల తరువాత యువతి ఆచూకీ లభ్యమైంది. తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి భీమవరానికి చెందిన శివకుమారి ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకువస్తున్నారు.

News July 2, 2024

విజయవాడ: పోలీసులకు చేరిన బాలిక పోస్టుమార్టం రిపోర్ట్

image

అజిత్‌సింగ్‌నగర్ మదర్సాలో జూన్ 28న మరణించిన కరిష్మా(17) పోస్టుమార్టం రిపోర్ట్ తాజాగా పోలీసులకు చేరింది. మృతురాలు అనుమానాస్పద స్థితిలో మరణించిన నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. కాగా మృతురాలి శరీర భాగాలను పరీక్షల నిమిత్తం హిస్టో పాథాలజీ పరీక్షలకు పంపామని, కరిష్మా మరణించిన సమయంపై స్పష్టత వచ్చేందుకు నిపుణుల నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాలని పోలీసులు చెబుతున్నారు.

News July 2, 2024

పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనలో నిపుణుల బృందం

image

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం మూడవ రోజు పర్యటించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకొని ముందుగా ECRF (Gap-2)లో సేకరించిన మట్టి, రాతి నమూనాలను పరిశీలించారు. మ్యాప్ పాయింటింగ్ ద్వారా సంబంధిత ఇరిగేషన్ అధికారులు సేకరించిన నమూనాల నాణ్యతను బృందానికి అధికారులు వివరించారు.

News July 2, 2024

ఎమ్మిగనూరు మండలానికి చేరిన తుంగభద్ర డ్యాం నీరు

image

రెండు నెలల కిందట తాగు నీటి కోసం కర్నూలు వరకు పులికనుమ ప్రాజెక్ట్ నుంచి పది రోజుల పాటు ఎల్‌ఎల్‌సీ కాలువకు నీరు వదిలారు. తాజాగా తాగునీటి కోసం నేరుగా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయగా మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు మండలానికి చేరుకున్నాయి. దీంతో తాగునీటి సమస్యతో పాటు పొలాలకు నీరు పెట్టుకోవచ్చని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 2, 2024

హోం మంత్రిని కలిసిన విశాఖ సిటీ కమిషనర్

image

హోం మంత్రి వంగలపూడి అనితను ప్రభుత్వం అతిథి గృహంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రాత బాగ్చి మర్యాదపూర్వకంగా మంగళవారం భేటీ అయ్యారు. కమిషనర్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హోం మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ఆమెతో చర్చించారు. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని గతంలో మంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ దిశగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News July 2, 2024

కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రహదారి భద్రత కమిటీ సమీక్ష సమావేశం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రారంభమైన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డితో పాటు పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన భద్రత అంశాలపై చర్చించారు.