Andhra Pradesh

News July 2, 2024

విశాఖ: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AU పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈనెల 4,6తేదీలలో డా.వీఎస్ కృష్ణ కళాశాలలో స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఈనెల 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని.. 11 తేదీ నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 19న సీట్ల కేటాయించి.. 22 లోపు క్లాసులు ప్రారంభిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. AU పరిధిలో మొత్తం 163 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

News July 2, 2024

శ్రీకాకుళం: జులై 4న బంద్‌కు పిలుపు

image

ఈనెల 4వ తేదీన జరగబోయే దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. టెక్కలి మండల కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మంగళవారం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జడి చందు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జాతీయస్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందన్నారు. నీట్ స్కామ్ పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

News July 2, 2024

శ్రీవారి సేవలో స్మృతి మంధాన

image

ఇండియన్ వుమెన్ క్రికెటర్ స్మృతి శ్రీనివాస్ మంధాన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేదాశీర్వచనంతో తీర్థప్రసాదాలు అందజేశారు.

News July 2, 2024

తాటిపూడి సాగు నీటిని విడుదల చేసిన మంత్రి

image

రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సేర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాటిపూడి రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. మూడు మండలాల్లోని 11 కాలువల ద్వారా 15,365 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. రిజర్వాయర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసి, శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

News July 2, 2024

విజయనగరం సంగీత కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

image

విజయనగరం మహరాజా సంగీత, నృత్య కళాశాలలో నాలుగేళ్ల సర్టిఫికెట్ కోర్సు, రెండేళ్ల డిప్లమో కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ K.A.V.L.N శాస్త్రి తెలిపారు. 01.07.2023 నాటికి 10 సంవత్సరాల వయసు నిండిన వారు అర్హులని, 60 ఏళ్ల లోపు వారూ చేరవచ్చన్నారు. ఈ రెండు కోర్సులకు ప్రవేశ రుసుములుగా రూ.1600, రూ.2100 చొప్పున నిర్ణయించామన్నారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.

News July 2, 2024

బి.మఠం: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

బ్రహ్మంగారిమఠం మండలం ఈశ్వరమ్మ గృహ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, ముఖభాగం గుర్తు పట్టలేని విధంగా పాడైపోయిందని పోలీసులు తెలిపారు. శవం కాలిన ఆనవాళ్లు కనిపించడంతో ఎవరైనా నిప్పంటించి చంపారా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 2, 2024

కొత్త చట్టం ప్రకారం విశాఖలో మొదటి కేసు నమోదు

image

కొత్తగా అమల్లోకి వచ్చిన నేర న్యాయ చట్టం కింద సోమవారం కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో మొదటి కేసు నమోదయింది. ధర్మా నగర్‌లో నివాసం ఉంటున్న ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద పార్కింగ్ చేసిన నాలుగు ద్విచక్ర వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అక్కడ కామేశ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అతనిపై నూతన చట్టం భారతీయ న్యాయ సంహిత ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News July 2, 2024

గుంతకల్లు: అనుమానాస్పద స్థితిలో విద్యుత్ ఉద్యోగి మృతి

image

గుంతకల్లు పట్టణంలోని కాలువ గడ్డ ఏరియా రామిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న విద్యుత్ శాఖ ఉద్యోగి ఆంజనేయులు ఆదివారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News July 2, 2024

కర్నూలు: అప్పు విషయంలో తగదా.. అన్నదమ్ములపై హత్యాయత్నం కేసు

image

కర్నూలు సాయినగర్‌కు చెందిన రఘ, రవికుమార్‌ అనే అన్నదమ్ములపై నాలుగో పట్టణ పోలీసు‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. కర్నూలులోని చింతల మునినగర్‌కు చెందిన చలపతి నుంచి రూ.12లక్షలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించడంలో వివాదం నెలకొంది. దీంతో వారు కక్షతో బైక్‌పై వెళుతున్న చలపతిని ఢీకొట్టి హత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 2, 2024

ప.గో.: డ్యూటీకి రాని కార్యదర్శి.. ఆగిన పింఛన్

image

ప.గో. జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరులో పింఛన్ సొమ్ము రూ.2,50,500 డ్రా చేసిన పంచాయతీ సెకండ్ కార్యదర్శి రాము సోమవారం విధులకు గైర్హాజరయ్యాడు. దీంతో పింఛన్ పంపిణీ ఆగిపోయింది. ఈ మేరకు మరో పంచాయతీ కార్యదర్శి రాజేశ్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై హరికృష్ణ తెలిపారు.