Andhra Pradesh

News July 2, 2024

పెండ్లిమర్రి: చెట్టుకు ఉరి వేసుకొని యువతి మృతి

image

జిల్లాలోని పెండ్లిమర్రి మండలం వెళ్లటూరు గ్రామానికి చెందిన బత్తల వెంకటలక్ష్మీ (24) అనే యువతి ఎగువచెరువు కాశినాయన గుడి దగ్గర ఉన్న అడవుల్లో ఉరి వేసుకొని మరణించినట్లుగా పెండ్లిమర్రి ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. కానీ మృతికి గల ఎటువంటి  కారణాలు తెలియకపోవడంతో ఇది హత్యనా?, లేక ఆత్మహత్యనా? అనే విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News July 2, 2024

శ్రీకాకుళం: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా హౌరా(HWH), యశ్వంత్‌పూర్(YPR) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొద్దిరోజులు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.02863 HWH- YPR ట్రైన్‌ను జులై 4 నుంచి 25 వరకు ప్రతి గురువారం, నం.02864 YPR- HWH ట్రైన్‌ను జులై 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం నడుపుతామని తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తెలిపింది.

News July 2, 2024

అనంతపురం జిల్లా జడ్పీ కో ఆప్షన్ సభ్యుడి కుమారుడు అదృశ్యం

image

ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ బాషా కుమారుడు అల్తాఫ్ అదృశ్యమైనట్లు తెలిపారు. సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయిన అతను ఇప్పటి వరకు రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. అతడి ఆచూకీ కోసం పలు చోట్ల గాలించినా ప్రయోజనం లేకపోవడంతో గోరంట్ల మండల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News July 2, 2024

టెక్కలిలో బోరుభధ్ర-విశాఖ ఎక్స్ ప్రెస్ సర్వీసు ప్రారంభం

image

టెక్కలి ఆర్టీసీ డిపో నుంచి బోరుభధ్ర-విశాఖ ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ సర్వీసును మంగళవారం నుంచి ప్రారంభించారు. టెక్కలి, బోరుభధ్ర, నిమ్మాడ మీదుగా శ్రీకాకుళం, విశాఖ చేరుకునేందుకు వీలుగా ప్రయాణికుల సౌకర్యం కోసం బస్సు సర్వీసును ప్రారంభించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టెక్కలి మండల టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరి జండా ఊపి బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

News July 2, 2024

కర్నూలు: పింఛన్ ఇప్పిస్తానని.. ఇల్లు రాయించుకున్న కొడుకు

image

కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన కె.శంకర్‌పై నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. తల్లి సాలమ్మకు పింఛన్ ఇప్పిస్తానని చెప్పి ఆమె పేరు మీద ఉన్న ఇల్లును శంకర్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయంపై నిలదీస్తే గొంతు నులిమి హత్యాయత్నం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

News July 2, 2024

ఒంగోలు: స్పాట్‌లో సమస్యను పరిష్కరించిన కలెక్టర్

image

ఒంగోలు స్థానిక పట్నంలోని గ్రీవెన్స్ హాలులో సోమవారం జరిగిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ఇద్దరు దివ్యాంగులు తమకు వీల్ ఛైర్, రెండు శ్రవణ యంత్రాలు కావాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాకు అర్జీ అందజేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ దివ్యాంగుల సంక్షేమ శాఖను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆ శాఖ సహాయ సంచాలకులు అర్చన వీల్ ఛైర్, వినికిడి పరికరాలు సమకూర్చి కలెక్టర్ వారికి అక్కడే అందజేశారు.

News July 2, 2024

కడప: ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని

image

సీకేదిన్నె మండలంలోని అంగడి వీధికి చెందిన దూదేకుల మహబూబ్ చాంద్(17)అనే విద్యార్థిని సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు సీకేదిన్నె సీఐ శివ శంకర్ నాయక్ తెలిపారు. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు ఆమెను మందలించడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగిగా.. ఏలూరులో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

News July 2, 2024

రూ.10 లక్షల చెక్కు అందించిన డిప్యూటీ సీఎం పవన్

image

గొల్లప్రోలులో సోమవారం పెన్షన్ల పంపిణీ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.10 లక్షల బీమా చెక్కును లబ్ధిదారు చెక్క చిట్టితల్లికి అందించారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రూప్ యాక్సిడెంట్ కార్డు పాలసీ ద్వారా బీమా పరిహారాన్ని అందజేశారు. పాలసీ తీసుకున్న వ్యక్తి కరెంటు స్తంభంపై పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా.. అతని భార్యకు బీమా చెక్కు అందించారు. తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News July 2, 2024

జైలులో పిన్నెల్లిని కలిసిన మాజీ మంత్రులు

image

నెల్లూరు సెంట్రల్ జైలులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. కేసు వివరాలను తెలుసుకున్నారు. మాజీ మంత్రులు మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.

News July 2, 2024

జైలులో పిన్నెల్లిని కలిసిన మాజీ మంత్రులు

image

నెల్లూరు సెంట్రల్ జైలులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. కేసు వివరాలను తెలుసుకున్నారు. మాజీ మంత్రులు మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.