Andhra Pradesh

News July 2, 2024

విజయనగరం జిల్లాలో 36 మందికి మెమోలు జారీ

image

సమయపాలన పాటించని అధికారులపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్క‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సంబంధిత అధికారులు ఉదయం 9:45 గం.కే రావాలని ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో చాలా మంది 10 గంటల తరువాత రావడంతో కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేస్తూ 10:05 గంటలకు ఆడిటోరియం తలుపులు మూయించారు. 36 మందికి మెమోలు జారీ చేసినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.

News July 2, 2024

కేకే రాజు, అదీప్ రాజ్‌లను అరెస్టు చేయాలి: విదసం

image

మాజీ సీఎం జగన్ కోడి కత్తి ఘటనలో వైసీపీకి చెందిన కేకే రాజు, అదీప్ రాజ్‌లను అరెస్ట్ చేయాలని విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు సోమవారం ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కోడి కత్తి ఘటనకు నిరసనగా విమానాశ్రయంలో అల్లర్లకు పాల్పడడంతో వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదయిందని అన్నారు. దానిని బయటికి తీసి చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 2, 2024

DSC అభ్యర్థులకు.. గుంటూరులో ఫ్రీ కోచింగ్

image

ప్రభుత్వం నిర్వహించనున్న డీఎస్సీ- 2024 పరీక్షలకు హాజరయ్యే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) అభ్యర్థులు 200 మందికి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ గుంటూరు సంచాలకుడు మధుసూదనరావు సోమవారం తెలిపారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన జిల్లాలోని SC,ST,BC అభ్యర్థులు ఈనెల 7వ తేదీ లోపు గుంటూరులోని బీసీ స్టడీ సర్కిల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.

News July 2, 2024

విజయవాడ: ఇంజినీరింగ్ కళాశాలలో రూ.82 లక్షల చోరీ

image

విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో రూ.82 లక్షలు చోరికి గురయ్యాయని కళాశాల ప్రతినిధులు తెలిపారు. శనివారం సాయంత్రం కళాశాలలో భద్రపరిచిన నగదు చోరికి గురైన విషయాన్ని సోమవారం కళాశాలకు వచ్చిన సిబ్బంది ఆలస్యంగా గుర్తించి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ చోరీ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

News July 2, 2024

శ్రీకాకుళం: మొదటి రోజు 96.81 శాతం పింఛన్లు పంపిణీ

image

శ్రీకాకుళం జిల్లాలో జూలై నెల 1వ తేదీన 96.81 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పింఛన్లు పంపిణీ ప్రక్రియ రాత్రి 8.45 గంటల వరకు కొనసాగింది అన్నారు. జిల్లాలో 3,19,147 మంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులు ఉండగా మొదటి రోజు 3,08,215 మందికి పంపిణీ చేశామన్నారు.

News July 2, 2024

చీరాల లాడ్జిలో యువకుడి సూసైడ్

image

చీరాల సాయికృష్ణ లాడ్జిలో సోమవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను బ్లేడుతో ముంజేయి కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడిని తాడేపల్లి వాసి అయ్యప్ప(32)గా గుర్తించారు. అయ్యప్ప చీరాలలోని ఓ ప్రైవేట్ హౌసింగ్ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడని సమాచారం. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News July 2, 2024

పోలవరంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

image

పోలవరం ప్రాజెక్టులో గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. సోమవారం ఉదయానికి స్పిల్‌వే ఎగువన 25.700 మీటర్లు, దిగువన 15.700 మీటర్లు, కాపర్‌ డ్యాంనకు ఎగువన 25.750 మీటర్లు, దిగువన 14.400 మీటర్ల నీటి మట్టం నమోదైంది. అదనంగా వచ్చిన 29,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఈఈ వెంకటరమణ తెలిపారు.

News July 2, 2024

కడప: చదరంగంలో చిన్మయ ప్రతిభ

image

కడప నగరం ఎన్టీఓ కాలనీకి చెందిన పి. ఉమామహేశ్వర్, శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె అయిన పసుపులేటి చిన్మయ చదరంగం క్రీడలో రాణిస్తోంది. విద్యామందిర్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి అండర్-10 విభాగం నుంచి చదరంగం ర్యాంకింగ్ టోర్నమెంట్లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో 1523 రేటింగ్ సాధించింది. తాజాగా సోమవారం జారీ చేసిన రేటింగ్స్ ఈ చిన్నారికి 1523 రేటింగ్‌ దక్కింది.

News July 2, 2024

శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్గో సేవలు జులై 1న పునఃప్రారంభం అయ్యాయని శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన Xలో ట్వీట్ చేశారు. కార్గో రవాణా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, స్థానిక ఉత్పత్తులకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

News July 2, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలకు రూ.299.91కోట్ల పింఛన్ పంపిణీ

image

కర్నూలు జిల్లాలో 2,45,229మంది లబ్ధిదారుల్లో సోమవారం 2,29,189 మందికి రూ.156.44 కోట్లు అందజేశారు. నంద్యాల జిల్లాలో2,21240మంది లబ్ధిదారుల్లో 2,11272 మందికి రూ.143.47కోట్లు అందజేశారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 93.46శాతం మందికి పంపిణీ చేసి రాష్రంలో 24వస్థానం, నంద్యాలలో 95.49శాతం మందికి పంపిణీ చేసి 13వస్థానంలో నిలిచాయి.