Andhra Pradesh

News July 2, 2024

కృష్ణా: కార్గో సేవలపై మంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్గో ఆపరేషన్స్ జులై 1 నుంచి పునఃప్రారంభం అయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కార్గో రవాణా ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కార్గో కార్యకలాపాల ద్వారా విజయవాడ విమానాశ్రయ ఆదాయం పెరగనుందని రామ్మోహన్ Xలో పోస్ట్ చేశారు.

News July 2, 2024

ప్రజలు ఛీ కొట్టినా జ్ఞానోదయం కలగలేదు: గంటా

image

వైసీపీ ప్రభుత్వ పాలన వద్దని ప్రజలు ఛీకొట్టినా ఆ పార్టీ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగకపోవడం విచారకరమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై గంటా స్పందించారు. వైసీపీకి చెందిన వారిని వీసీలుగా నియమించుకుని జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే ఆరోపించారు.

News July 2, 2024

కాకినాడ: కరెంట్ షాక్.. డిగ్రీ స్టూడెంట్ మృతి

image

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఓ యువకుడు కరెంట్ షాక్‌తో చనిపోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చొల్లంగి ఇందిరమ్మ కాలనీకి చెందిన పిల్లి వినయ్ (20) చిన్నాన్న నిర్మిస్తున్న ఇంటి వద్ద మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తెగిపడిన విద్యుత్ తీగను చేత్తో పట్టుకోగా షాక్‌కు గురయ్యాడు. కాకినాడ GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వినయ్ డిగ్రీ ఫైనల్ ఈయర్ చదువుతున్నాడు. కేసు నమోదైంది.

News July 2, 2024

గుంటూరు: తాత్కాలికంగా కొన్ని రైళ్లు రద్దు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లను, గుంటూరు-విజయవాడ మార్గంలో తాత్కాలికంగా రద్దు చేసినట్లు సీనియర్ డీసీ ప్రదీప్ కుమార్ సోమవారం వెల్లడించారు. రైలు నంబర్ 17329 (హుబ్లి-విజయవాడ) ఈ నెల 15 నుంచి 31వరకు, 17330 (విజయవాడ-హుబ్లి) ఈ నెల 16 నుంచి ఆగస్టు 1వరకు, 17282 (నరసాపూర్-గుంటూరు), 17281 (గుంటూరు- నరసాపూర్) ఈ నెల 1 నుంచి 31 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News July 2, 2024

ప్రొద్దుటూరు: బెట్టింగ్ వ్యసనం.. పింఛన్ డబ్బు స్వాహా

image

ప్రొద్దుటూరు ఏడో వార్డులో పింఛన్ డబ్బు పంచలేదని తెలిసిందే. దీనికి కారణం ఏంటా అని అధికారులు విచారించారు. ఆ వార్డు సచివాలయ కార్యదర్శి మురళీమోహన్ పింఛన్ డబ్బు బ్యాంకు నుంచి డ్రా చేసి దొంగతనానికి గురైనట్లు పథకం పన్నాడు. పోలీసుల తమదైన శైలిలో విచారించగా.. బెట్టింగ్‌కు బానిసై సొంత ఖర్చులకు పింఛన్‌ డబ్బులు కాజేసినట్లు తేలడంతో డీఎస్పీ మురళీధర్ క్రిమినల్ కేసు నమోదు చేశారు.

News July 2, 2024

జగన్‌ ఫొటోపై ఉదయగిరి MLA ఆగ్రహం

image

ఓ ప్రభుత్వ భవనంపై మాజీ CM జగన్ ఫొటో ఇంకా ఉంచడంపై టీడీపీ MLA ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ విజమూరు మండలం గుండెమడకల గ్రామంలో పింఛన్ల పంపిణీకి వెళ్లారు. స్థానికంగా ఉన్న హెల్త్ కేర్ సెంటర్ భవనం వద్ద జగన్ ఫొటో కనపడింది. దీంతో ఆయన మెడికల్ ఆఫీసర్‌‌కు కాల్ చేశారు. ‘ఏంటి సార్ ఇంకా ప్రభుత్వం మారలేదా? మీకు తెలియదా?’ అని అసహనం వ్యక్తం చేశారు.

News July 2, 2024

ప్రజలు ఛీ కొట్టినా జ్ఞానోదయం కలగలేదు: గంటా

image

వైసీపీ ప్రభుత్వ పాలన వద్దని ప్రజలు ఛీకొట్టినా ఆ పార్టీ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగకపోవడం విచారకరమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై గంటా స్పందించారు. వైసీపీకి చెందిన వారిని వీసీలుగా నియమించుకుని జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే ఆరోపించారు.

News July 2, 2024

చంద్రబాబు ఇంటికి లంచం.. సస్పెండ్

image

చిత్తూరు జిల్లా శాంతిపురం(M) శివపురం వద్ద ఇంటి నిర్మాణానికి CM చంద్రబాబు స్థలాన్ని కొనుగోలు చేశారు. అది వ్యవసాయ భూమి కావడంతో భూవినియోగ మార్పిడి, సబ్ డివిజన్ కోసం TDP నాయకులు దరఖాస్తు చేశారు. దీనికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ.1.80 లక్షలు లంచం డిమాండ్ చేశారు. గత నెల కుప్పానికి చంద్రబాబు వచ్చినప్పుడు విషయం వెలుగు చూసింది. లంచం తీసుకోవడం నిజమేనని తేలడంతో సద్దాం హుస్సేన్‌ను సస్పెండ్ చేశారు.

News July 2, 2024

నేడు భీమవరంలో ‘ కల్కి’ మూవీ బుజ్జి కారు

image

‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో హీరో ప్రభాస్ నడిపిన బుజ్జి కారును భీమవరం మల్టీప్లెక్స్ ఆవరణలో మంగళవారం ప్రదర్శించనున్నట్లు థియేటర్ యాజమాన్యం సోమవారం రాత్రి తెలిపింది. ఈ సందర్భంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు మల్టీప్లెక్స్ ప్రాంగణంలో ఈ బుజ్జి కారు ఉంటుందని తెలిపారు.

News July 2, 2024

విజయనగరం డీసీసీబీ సీఈఓగా బాధ్యతలు

image

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన సీఈఓగా సీ.హెచ్. ఉమా మహేశ్వరరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఆయన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ప్రజలకు సెంట్రల్‌ బ్యాంక్‌ ద్వారా మెరుగైన సేవలు అందించాలని జెడ్పీ ఛైర్మన్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.