Andhra Pradesh

News July 2, 2024

డయేరియా ప్రబలకుండా ముందస్తూ చర్యలు చేపట్టాలి

image

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో డయేరియా ప్రబలకుండా అన్ని ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో డయేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన పోస్టర్లను వైద్యాధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.

News July 2, 2024

ప.గో జిల్లాలో 95.42% పెన్షన్ల పంపిణీ

image

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. మొత్తం జిల్లాలో పెన్షన్‌దారులు 2,32,885 మందికి గాను 2,22,221 మందికి అందజేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 9 గంటల వరకు 95.42% పెన్షన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

News July 2, 2024

తూ.గో జిల్లాలో 95.87% పెన్షన్ పంపిణీ పూర్తి: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉ. 5 గంటల నుంచి ప్రారంభమైంది. 4,092 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ నగదు పంపిణీ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. సాయంత్రం 7.30 గంటల వరకు 95.87 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యిందన్నారు.

News July 2, 2024

కొత్త చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్పీ కృష్ణకాంత్

image

నిత్యం కొత్తగా వస్తున్న చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. కర్నూల్ రూరల్ సర్కిల్, ఉలిందకొండ పోలీస్టేషన్ ఆవరణంలో నూతన చట్టాలపై ఎస్పీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొత్త చట్టాలతో కేసుల దర్యాప్తు, విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందని పేర్కొన్నారు.

News July 2, 2024

SKLM:రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ

image

రైతు భరోసాపై రైతుల అభిప్రాయ సేకరణ జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డి తెలిపారు. సోమవారం కమాన్‌పూర్ మండలం గుండారం రాజేంద్రనగర్ రైతు వేదికలో పీఏసీఎస్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా రైతు భరోసాపై అభిప్రాయాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, ఆడిటర్ ముపాసిర్, పిఏసిఎస్ ఛైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.

News July 2, 2024

కృష్ణా: బీ-ఫార్మసీ అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీ-ఫార్మసీ కోర్సుల అకాడమిక్ క్యాలెండర్ విడుదలైంది. నిర్ణీత పని దినాలు ఉండేలా క్యాలెండర్ తయారు చేసినట్లు వర్శిటీ పేర్కొంది. 2025 జనవరి, జూన్ నెలల్లో ఫస్టియర్ విద్యార్థులకు ఒకటి, రెండవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. క్యాలెండర్ పూర్తి వివరాలకు కృష్ణా వర్సిటీ https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News July 2, 2024

వ్య‌వ‌సాయ‌, అనుబంధ శాఖ‌ల అధికారుల‌తో కలెక్టర్ సమీక్ష

image

ఎన్టీఆర్ జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు నిర్దిష్ట కార్యాచ‌రణ ప్రణాళికతో ప్ర‌త్యేకంగా దృష్టిసారించి సీజ‌న్‌ను విజ‌య‌వంతం చేసేలా కృషిచేయాల‌ని జిల్లా కలెక్టర్ సృజ‌న ఆదేశించారు.సోమవారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ సృజ‌న‌ వ్య‌వ‌సాయం, ఉద్యాన‌, ప‌ట్టు, ప‌శుసంవ‌ర్థ‌క‌, మ‌త్స్య శాఖ‌ల‌తో పాటు మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

News July 2, 2024

డీజీపీని కలిసిన మాజీ ఎంపీ మార్గాని భరత్

image

వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడులు పెరిగాయని, వాటిని అరికట్టి‌ దోషులను శిక్షించి శాంతిభద్రతలను కాపాడాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ రాష్ట్ర డీజీపీని కోరారు. రాజమండ్రిలో ఎప్పుడూ లేని విష సంస్కృతిని టీడీపీ ప్రేరేపిస్తోందని ఆరోపిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో ఆయననను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికల అనంతరం జరిగిన ఘటనలపై విచారణ జరిపించాలన్నారు.

News July 2, 2024

ఏలూరు జిల్లాలో 95.42% పెన్షన్ల పంపిణీ

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. జిల్లాలోని మొత్తం పెన్షన్‌దారులు 2,68,353 మందికి గానూ 2,56,331 మందికి అందజేసినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల వరకు 95.42% పెన్షన్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

News July 2, 2024

విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిష్కార వేదికకు 50 ఫిర్యాదులు

image

విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిష్కార వేదికకు 50 ఫిర్యాదులు అందినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కమిషనర్ ఫకీరప్ప పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం పోలీస్ కమిషనర్ సంబంధిత సీఐలు, ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు.