Andhra Pradesh

News July 2, 2024

ప్రజా సమస్యలపై 114 ఫిర్యాదులు: అనంత ఎస్పీ గౌతమిశాలి

image

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ గౌతమిశాలి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజలు అందజేసే ఫిర్యాదులను అలసత్వం లేకుండా చట్టపరిధిలో పరిష్కారం చూపాలని ఆమె పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజలు వివిధ సమస్యలపై వినతుల రూపంలో 114 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.

News July 2, 2024

తూ.గో: ఈ నెల 4న లాటరీ ద్వారా సీట్ల భర్తీ

image

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో మిగిలిన సీట్లను ఈ నెల 4న భర్తీ చేస్తామని జిల్లా సమన్వయకర్త వెంకట్రావు తెలిపారు. ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్ లాటరీ పద్ధతి ద్వారా ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో మిగిలిన సీట్లు భర్తీ చేస్తారని, ఆసక్తి కలిగిన విద్యార్థులు వారికి అనువుగా ఉండే పాఠశాలకు వెళ్లి దరఖాస్తు చేయాలన్నారు. ➠ SHARE IT..

News July 2, 2024

పార్వతీపురం: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు దరఖాస్తులు

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి.పగడాలమ్మ అన్నారు. జిల్లాలో ఆసక్తిగల ఉపాధ్యాయులు http://nationalawardstoteacher.education.gov.in లింకులో నామినేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 15వరకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత గల ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News July 2, 2024

చిత్తూరు: జిల్లాలో 88.6% పింఛన్ల పంపిణీ

image

జిల్లాలో సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు 88.6% పింఛన్లను లబ్ధిదారులకు అందజేసినట్లు అధికారులు తెలిపారు. నగిరి 96.97%, యాదమరి 96.13%తో తొలి రెండు స్థానాల్లో నిలిచాయన్నారు. కుప్పం 71.83 శాతం, రొంపిచర్ల 71.16% శాతంతో ఆఖరి రెండు స్థానాల్లో నిలిచాయని వెల్లడించారు. వంద శాతం పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు.

News July 2, 2024

కోవూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ‌గా రమేష్ చౌదరి

image

కోవూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కే.రమేష్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ ఆఫీస్ నుంచి కోవూరు డివిజన్‌కు బదిలీ అయ్యారు. కోవూరు డివిజన్లో పనిచేస్తున్న కే.విజయ్ కుమార్ ఆదివారం పదవి విరమణ చేశారు.

News July 2, 2024

అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి’: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ హాలు నందు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీలను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని అధికారులకు సూచించారు.

News July 2, 2024

శ్రీకాకుళం: మీకోసంలో 204 అర్జీలు: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(మీకోసం)లో అందిన అర్జీలకు సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలనీ సమూన్ ఆదేశించారు. సోమవారం జడ్పీ హాల్లో మీకోసం కార్యక్రమంలో 204 మంది నుంచి అర్జీలు వివిధ శాఖల అధికారుల స్వీకరించారు.

News July 2, 2024

డ‌యేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవ‌గాహ‌న: క‌లెక్ట‌ర్ సృజ‌న

image

రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జులై 1 సోమ‌వారం నుంచి ఆగ‌స్టు 31 వ‌ర‌కు స్టాప్ డ‌యేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని కలెక్టర్ సృజన ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లో డీఎమ్‌హెచ్‌ఓ సుహాసినితో కలిసి కలెక్టర్ స్టాప్ డ‌యేరియా పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

News July 2, 2024

అతిసార వ్యాధి పోస్టర్ల ఆవిష్కరణ: కలెక్టర్ నాగలక్ష్మీ

image

గుంటూరు జిల్లాలో అతిసార వ్యాధిని అదుపు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వైద్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అతిసార వ్యాధిని అరికట్టేందుకు రూపొందించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ రాజకుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీ కుమారి, తదితరులు పాల్గొన్నారు.

News July 1, 2024

కోడి గుడ్డుపై సీఎం చంద్రబాబు చిత్రం

image

నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డా.దేశెట్టి శ్రీనివాసులు సీఎం చంద్రబాబుపై అభిమానాన్ని వినూత్నరీతిలో చాటుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడి చిత్రాన్ని కోడి గుడ్డుపై చిత్రించారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా చిత్రీకరించినట్లు శ్రీనివాసులు చెప్పుకొచ్చారు. ఈ వినూత్నమైన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలోనూ కూటమి నేతల చిత్రాలను పచ్చి టెంకాయపై చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.