Andhra Pradesh

News July 1, 2024

విశాఖ: రేప్ కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

image

రేప్ కేసులో గిరీశ్ అనే వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ.9వేల జరిమానా విధిస్తూ విశాఖ కోర్టు తీర్పు చెప్పినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. కొయ్యూరు మండలానికి చెందిన ఓ గిరిజన యువతి అతడిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021లో రేప్ కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జరిగిన వాదోపవాదాల్లో నేరం నిర్ధారణ కావడంతో నిందితుడికి జైలు శిక్ష పడిందని చెప్పారు.

News July 1, 2024

ప.గో: యువకుడి మిస్సింగ్.. గోదావరిలో గాలింపు

image

ఫంక్షన్‌కని చెప్పి వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, పోలీసులు గాలింపు చేపట్టారు. ప.గో జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లికి చెందిన వై.త్రిమూర్తులు పంక్షన్‌కు వెళ్తున్నానన చెప్పి ఆదివారం ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడం.. బైక్ నరసాపురంలోని స్మశానవాటిక దగ్గరలో ఉండటంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జాలర్లతో పడవ సాయంతో గోదావరిలో వెతికించారు.

News July 1, 2024

ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% సీట్లు ఇవ్వాలని డిమాండ్

image

పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్‌లో ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అమలు చేయాలని ఉచిత విద్య విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్తిబాబు, సెక్రటరీ సుధీర్ బాబు, ట్రెజరీ దేవి డిమాండ్ చేశారు. రాజమండ్రిలోని కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.

News July 1, 2024

శ్రీకాకుళం:‘ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్‌ను ప్రభుత్వం గుర్తించాలి’

image

శ్రీకాకుళం ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ రవాణా మంత్రిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను ఆయన వద్ద ప్రస్తావించారు. జిల్లా నుంచి దాదాపుగా ఆర్టీసీలో 7,500 మంది పని చేస్తున్నామని. వారి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆర్టీసీలో భాగం చేయాలని కోరారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించమని వినతిపత్రం అంజేశారు. ముత్యాలు, కిరణ్, నవీన్, అనిల్, కేశవ, ప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు.

News July 1, 2024

శ్రీకాకుళం జిల్లా నేటి ముఖ్యంశాలు

image

* శివారు భూములకు నీరు అందించడమే లక్ష్యం: కలెక్టర్ * జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ ఆసరా పెన్షన్లు 96.8 % పంపిణీ పూర్తి* పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కుమార్తెకు ఉత్తమ కలెక్టర్ అవార్డు* డెంగ్యూ వ్యాధి నివారణకు చర్యలు: కలెక్టర్* ప్రజా సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలి: ఎస్పీ* గొట్టా బ్యారేజీ నుంచి 700 క్యూసెక్కుల నీటి విడుదల* నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్: ఎచ్చెర్ల* ఒడిశాలో ఎచ్ఛర్ల యువకుడి మర్డర్

News July 1, 2024

పెన్షన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు: కమిషనర్

image

పెన్షన్ పంపిణీలో సచివాలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ మల్లయ్య నాయుడు హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పెన్షన్ల మొత్తంలో కమీషన్ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు గుర్తిస్తే తన దృష్టికి తేవాలని సూచించారు. 9849906486 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే పరిశీలించి సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News July 1, 2024

ప.గో: కాపు కాసి యువకుడిపై దాడి.. రంగంలోకి DSP

image

తణుకు మండలం కొమరవరంలో ఇటీవల యువకుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచిన ఘటనపై తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి సోమవారం విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన మేడే రాంమూర్తి బైక్‌పై వెళుతుండగా.. అదే గ్రామానికి చెందిన ముత్యాల సుబ్బారావు, సాయిలు గత నెల 26న దారి కాచి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తణుకు రూరల్‌ ఎస్సై కె.చంద్రశేఖర్‌ నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

News July 1, 2024

బద్వేలు: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

image

బ్రహ్మంగారిమఠం మండలం పెద్దిరాజుపల్లి ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా పనిచేస్తున్న బాలకృష్ణ బద్వేలులో టాటా ఏస్ ఢీకొనడంతో మృతి చెందాడు. బద్వేలులోని ఇంటినుంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంటే టాటా ఏస్ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధ్యాయుడి మృతి పట్ల మండల ఉపాధ్యాయుల విద్యాశాఖ అధికారి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

News July 1, 2024

మానవత్వం చాటుకున్న మంత్రి వాసంశెట్టి సుభాశ్

image

మంత్రి వాసంశెట్టి సుభాశ్ మానవత్వం చాటుకున్నారు. రామచంద్రపురంలోని సూర్యనగర్‌లో ఉంటున్న సుహాస్ అనే బాలుడు బ్రెయిన్ ఫిట్స్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకొని బాలుడి తండ్రి శివ (ఆర్టీసీ కండక్టర్), తల్లి ఉమాదేవితో మాట్లాడారు. తక్షణ సాయం కింద తన క్యాంపు కార్యాలయంలోనే రూ.10 వేలు అందజేశారు. ప్రతి నెలా తనవంతు సాయంగా రూ.6 వేలు ఇస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో ఆ దంపతులు వాసంశెట్టికి కృతజ్ఞతలు తెలిపారు.

News July 1, 2024

కృష్ణా: జిల్లాలో 95.58% మేర పెన్షన్ల పంపిణీ పూర్తి

image

NTR భరోసా పథకం కింద 95.58% మేర పెన్షన్ల పంపిణీతో రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా 6వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 2,42,321 మంది పెన్షనర్లకు రూ.162.49కోట్లకు గాను రాత్రి 7.30ని.ల సమయానికి 2,31,598 మందికి రూ.155.31 కోట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి అందజేశారు. అత్యధికంగా గుడ్లవల్లేరు మండలంలో 97.2% మందికి, అత్యల్పంగా తాడేపల్లి మున్సిపాల్టీలో 91.52% మందికి పెన్షన్ల పంపిణీ చేశారు.