Andhra Pradesh

News July 1, 2024

సత్వరమే సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్ నాగలక్ష్మీ

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందించిన ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి ఇచ్చిన 142 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఫిర్యాదులు స్వీకరించడానికి ముందు పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు.

News July 1, 2024

జవాన్ల మృతిపట్ల మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

image

ఏపీకి చెందిన ముగ్గురు జవాన్ల మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లద్దాక్ ప్రమాదంలో నాగరాజు, సుభానా ఖాన్, ఎం ఆర్కే రెడ్డి మృతిచెందటం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.

News July 1, 2024

ఒడిశా బీచ్‌లో ఇచ్ఛాపురం యువకుడి మర్డర్

image

ఒడిశాలోని సున్నాపురం బీచ్‌లో ఇచ్ఛాపురం మండలం కేదారిపురానికి చెందిన ఆశి బాలును పట్టణంలోని బెల్లుపడకు చెందిన కొందరు యువకులు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాలు.. ఆదివారం బాలు తన స్నేహితులతో బీచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారితో బాలుకు ఘర్షణ జరిగింది. అది కాస్తా వివాదంగా మారడంతో నిందితులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 1, 2024

ఇన్‌స్టంట్ ఎగ్జామ్ అర్హుల జాబితా

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ తక్షణ పరీక్ష (INSTANT EXAM)కు సంబంధించి అర్హుల జాబితా సోమవారం విడుదలయ్యాయని ఎగ్జామినేషన్స్ డీన్ తెలిపారు. అలాగే కాలేజీలకు పరీక్షలో అర్హులైన విద్యార్థుల జాబితాను పంపనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

News July 1, 2024

కలెక్టర్ చదలవాడ నాగరాణికి కలిసిన RRR

image

పశ్చిమ గోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు సోమవారం మర్యాదపూర్వంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజవర్గ సమస్యలను కలెక్టర్ నాగరాణికి వివరించారు.

News July 1, 2024

పిఠాపురానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొస్తా: పవన్

image

పిఠాపురం నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని స్థానిక MLA, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం అభివృద్ధి కోసం ఏం చేయగలనా..? అంటూ నిత్యం ఆలోచిస్తానని, ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చాకే తనను ఊరేగించండని అక్కడి ప్రజలతో అన్నారు. ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పని చేస్తానన్నారు. డొక్కా సీతమ్మ పేరుతోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్నారు.

News July 1, 2024

విశాఖ: జోరుగా పింఛన్ల పంపిణీ

image

పింఛన్ పంపిణీ కొనసాగుతోంది. సా.5 గంటలకు విశాఖ జిల్లాలో 93.28, పార్వతీపురం-92.74, అనకాపల్లి-88.5, అల్లూరి జిల్లాలో 86.87% పంపిణీ పూర్తైంది. విశాఖ జిల్లాలో 1,64,150 మందికి గానూ 1,53,116 మందికి, అనకాపల్లి జిల్లాలో 2,64,033 మందికి గానూ 2,33,662 మందికి పంపిణీ చేశారు. పార్వతీపురం జిల్లాలో 1,44,518 మందికి గానూ 1,34,019 మందికి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,26,813 మందికి గానూ 1,10,168 మందికి అందజేశారు.

News July 1, 2024

టెక్కలి: కుటుంబంలో అందరూ వైద్యులే: డాక్టర్స్ డే స్పెషల్

image

టెక్కలి మండలం పోలవరానికి చెందిన ఓ కుటుంబంలోని తర్వాతి తరం అంతా వైద్యులే. రాజశేఖర్, విజయ్ కుమార్, దయ సోదరులు ముగ్గురు వైద్యులు. ఇంటికొచ్చిన కోడళ్లు కూడా వైద్యులు కావడం విశేషం. రాజశేఖర్ (పీడియాట్రిక్స్), భార్య స్రవంతి (గైనకాలజిస్ట్), విజయ్(జనరల్ మెడిసిన్) భార్య రోజా(MBBS), దయ(MBBS) పూర్తి చేసి ఎండీ జనరల్ మెడిసిన్ చదువుతున్నారు. దయ, రోజా మినహా మిగిలినవారు టెక్కలి జిల్లాసుపత్రిలో సేవలు అందిస్తున్నారు.

News July 1, 2024

ఖాజీపేటలో విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత

image

ఖాజీపేట బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. స్థానికుల వివరాల మేరకు.. విద్యార్థుల అస్వస్థదకు కలుషిత నీరే కారణమని, సుమారు 30 మంది విద్యార్థులు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య చికిత్స అందిస్తున్నారన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 1, 2024

నెల్లూరు GGH లో డాక్టర్ సూసైడ్ !

image

నెల్లూరు నగరంలోని GGH హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ నాలుగో అంతస్తు నుంచి దూకి జ్యోతి అనే డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. చేజర్ల మండలం చిత్తలూరు PHCలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జ్యోతి మెడికల్ కాలేజీలో జరుగుతున్న క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు వచ్చారు. ఏం జరిగిందో ఏమో బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.