Andhra Pradesh

News July 1, 2024

కృష్ణా: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

image

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులకు ఇచ్చే అవార్డులకై దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. UG, PG విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు 2 కేటగిరీలలో ఇచ్చే ఈ అవార్డులకు https://www.awards.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రోజులోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఎంపికైన 35 మంది అధ్యాపకులకు మెడల్, సర్టిఫికెట్‌తో పాటు రూ.50వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

News July 1, 2024

2 వారాలకోసారి పిఠాపురంలోనే కలెక్టర్: పవన్ కళ్యాణ్

image

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. చేబ్రోలులో పింఛన్లు పంపిణీ చేసిన పవన్ మాట్లాడుతూ.. ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం ప్రతి 2 వారాలకొకసారి కలెక్టర్ షన్మోహన్ స్వయంగా పిఠాపురం వస్తానని తనతో చెప్పారన్నారు. సమస్యలను ఫిర్యాదుల రూపంలో తేలియజేస్తే పరిష్కారానికి చొరవ తీసుకుంటారని పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్‌లోనూ కలెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని పవన్ అభినందించారు.

News July 1, 2024

కర్నూల్: కొనసాగుతున్న పింఛన్ పంపిణీ

image

కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పింఛన్ పంపిణీ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు కర్నూల్ జిల్లాలో 83.82, నంద్యాల జిల్లాలో 88.76 శాతం పంపిణీ పూర్తైంది. కర్నూల్ జిల్లాలో 2,45,229 మందికి గానూ 2,05,545 మందికి అందజేశారు. నంద్యాల జిల్లాలో 2,21,240 మందికి గానూ 1,96,382 మందికి పింఛన్ నగదు పంపిణీ చేశారు.

News July 1, 2024

సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలి: ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రాధిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి వారితో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.

News July 1, 2024

హోంమంత్రి అనిత ఓ.ఎస్.డీ.గా అనిల్ కుమార్

image

హోం మంత్రి వంగలపూడి అనిత ఓ.ఎస్.డీ.గా అడిషనల్ ఎస్పీ అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అనిల్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్నారు. ఆయనకు ఇంటిలిజెన్స్‌లో పోస్టింగ్ ఇస్తూ హోంశాఖ మంత్రి ఓ.ఎస్.డీ.గా విధులు అప్పగించారు. గతంలో అనిల్ కుమార్ డీజీపీ గౌతమ్ సవాంగ్ వద్ద ఓ.ఎస్.డీగా పనిచేశారు.

News July 1, 2024

ప్రొద్దుటూరు: పెన్షన్ డబ్బులు ఎత్తుకెళ్లారు?

image

ప్రొద్దుటూరు 7వ వార్డు పరిధిలోని వార్డు సెక్రటరీ మురళీమోహన్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు అతణ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తాను పెన్షన్లు పంపిణీ చేసేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో స్పృహ కోల్పోయినట్లు తెలిపారు. పెన్షన్ సొమ్ము దాదాపు రూ.4 లక్షల ఎవరో తీసుకెళ్లారన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.

News July 1, 2024

ప.గో.: జడ్పీ కార్యాలయ పరిపాలనాధికారి మృతి

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పని చేస్తున్న చిర్రావూరి రత్న గిరి సోమవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన భౌతికకాయానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

News July 1, 2024

రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా టాప్-1

image

పింఛన్ లబ్ధిదారుల సంఖ్యలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే టాప్‌లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 3,19,147 లబ్ధిదారులున్నారు. ఈ నేపథ్యంలో వీరికి రూ.21.17 కోట్లను ఎన్టీఆర్ పింఛన్ల కానుకగా ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 82.63% లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దీని తర్వాత నెల్లూరు జిల్లా 3,13,757 మందితో 2వ స్థానంలో ఉండగా.. 1,26,813 మంది లబ్ధిదారులతో అల్లూరి జిల్లా 26వ స్థానంలో ఉంది.

News July 1, 2024

అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు: SP

image

తిరుపతి జిల్లాలో నేటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రకటించారు. తన కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది. ప్రతి సిటిజన్ ఎక్కడ నుంచైనా, ఆన్‌లైన్‌లోనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు. సంబంధిత కాపీని ప్రతి సిటిజన్‌కు ఇవ్వాలి. గతంలో 511 సెక్షన్లు ఉంటే ప్రస్తుతం 358 సెక్షన్లకు కుదించారు’ అని ఎస్పీ చెప్పారు.

News July 1, 2024

కర్నూలు జిల్లా ఆవిర్భవించింది ఈరోజే

image

పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవైన కర్నూలు జిల్లా ఇదే రోజున ఆవిర్భవించింది. 1858 జులై 1 నుంచి 166 సంవత్సరాలుగా కర్నూలు జిల్లా కేంద్రంగా సేవలందిస్తోంది. ఒకప్పుడు కందెనవోలుగా ప్రసిద్ధి చెంది కాలక్రమేణా కర్నూలుగా మారింది. 1953 OCT 1 నుంచి 1956 OCT 31 వరకు ఆంధ్రరాష్ట్ర రాజధానిగా కొనసాగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 6 నియోజకవర్గాలతో నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పాటైంది.