Andhra Pradesh

News July 1, 2024

సింహాచలం: 3న వైకుంఠ వాసునికి వరద పాయసం

image

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థిస్తూ ఈ నెల మూడవ తేదీన సింహాచలం వైకుంఠ వాసుని మెట్ట మీద వైకుంఠవాసునికి వరద పాయసం పోయనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ మేరకు వైదిక వర్గాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు వారి నిర్ణయం మేరకు 3న ఉదయం 8 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, విరాటపర్వం పారాయణం నిర్వహిస్తామన్నారు. అనంతరం వరుణ మంత్ర జపం చేసి పాయసం నివేదన సమర్పిస్తామన్నారు.

News July 1, 2024

పింఛన్ల పంపిణీలో కుప్పం లాస్ట్

image

చిత్తూరు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు 40.51 శాతం పింఛన్లు పంపిణీ చేశారు. అత్యధికంగా యాదమరిలో 74.3 శాతం మందికి నగదు అందించారు. అత్యల్పంగా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో 18.29 శాతం మందికి మాత్రమే నగదు పంపిణీ చేశారు. ఇదే నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో సైతం 24.94 శాతం మందికే ఇప్పటికి పెన్షన్ అందింది.

News July 1, 2024

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుకు మాతృవియోగం

image

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాతృమూర్తి చెల్లుబోయిన శుభద్రమ్మ సోమవారం మృతిచెందారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి నగరంలోని కోటిలింగాల ఘాట్ నందు ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.

News July 1, 2024

స్టూడెంట్ కిట్లు అందేదెప్పుడు?

image

విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల్లో పాఠశాలలు తెరిచి 18 రోజులు గడిచినా కూడా నేటికీ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు బ్యాగ్ లు, షూలు బయట కొనుక్కోవడం జరుగుతుంది. దీని వలన ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కిట్లు పంపిణీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు.

News July 1, 2024

కడప – చెన్నై ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం

image

కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పరిధిలోని కడప – చెన్నై ప్రధాన రహదారిపై మండపం పల్లి కనము వద్ద కారు, బస్సు ఢీకొన్న ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్థులు వెల్లడించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 1, 2024

శ్రీకాకుళం: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

image

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులకు ఇచ్చే అవార్డులకై దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. UG, PG విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు 2 కేటగిరీలలో ఇచ్చే ఈ అవార్డులకు https://www.awards.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రోజులోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఎంపికైన 35 మంది అధ్యాపకులకు మెడల్, సర్టిఫికెట్‌తో పాటు రూ.50,000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

News July 1, 2024

రోడ్డు ప్రమాదంలో కంతేరు సర్పంచ్ మృతి

image

మంగళగిరి- తెనాలి ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన సర్పంచ్ బెజ్జం మహేశ్‌కు చెందిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో సర్పంచ్ మహేశ్ మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 1, 2024

ప్రకాశం: జిల్లాలో 3.6 మి.మీ వర్షపాతం నమోదు

image

ప్రకాశం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 3.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు మండలాలలో ఓ మోస్తరు జల్లులు పడ్డాయి. తాళ్లూరు మండలంలో 24.2 మి.మీ., జరుగుమల్లిలో 27.4 మి.మీ., నాగులుప్పలపాడులో 16.0మి.మీ., మద్దిపాడులో 12.4 మి.మీ., ఒంగోలులో 11.2 మి.మీ., తర్లుపాడులో 11.1మి.మీ వర్షం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో ఎనిమిది మండలాలలో చిరుజల్లులు పడ్డాయి.

News July 1, 2024

శ్రీకాకుళం: 25,760 మంది ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు

image

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ 1, 2 సంవత్సరం చదువుతున్న 25,760 మంది విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేయనున్నామని డివైఈవో శివ్వాల తవిటినాయుడు ఆదివారం తెలిపారు. జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 13 మోడల్ స్కూల్ కాలేజీలు, 25 కేజీబీవీలు, 9 సోషల్ వెల్ఫేర్, 12 హైస్కూల్ ప్లస్, ఒక్కొక్క ఎస్టి, మహాత్మ జ్యోతిబాయి పూలే రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి.

News July 1, 2024

పెద్దిరెడ్డి అరాచకాలపై క్యాసెట్ పంపిస్తా: బాబు

image

పుంగనూరులో అధికార పార్టీ దాడులు ఎక్కువైనట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలపై TDP ఇన్‌ఛార్జ్ చల్లా బాబు స్పందించారు. ‘గత రెండేళ్లలో పుంగనూరులో ప్రతిపక్షాలపై మీ నాన్న పెద్దిరెడ్డి చేసిన దాడులు ఏంటో తెలుసుకోవాలి. మా కార్యకర్తలపై 307 కేసులు పెట్టారు. పుంగనూరులో మీ అరాచకాలను క్యాసెట్ రూపంలో పంపమంటే పంపిస్తా. మీ దాడులకు టీడీపీ నేతలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు’ అని బాబు అన్నారు.