Andhra Pradesh

News July 1, 2024

నేటి నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు

image

ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. జూలై 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. అనంతరం 8 నుంచి 12 వరకు ఆప్షన్ల ఎంపిక పూర్తిచేయాలి. 13న మార్పులకు అవకాశం ఉంటుంది. 16న అభ్యర్థులకు సీట్లను అధికారులు కేటాయించనున్నారు. 17వ తేదీన క్లాస్ వర్క్ ప్రారంభమవుతుంది.

News July 1, 2024

అక్రమాల్లో జగన్ తర్వాత పెద్దిరెడ్డే: మంత్రి

image

వైసీపీ పాలనలో జగన్ తర్వాత ఎక్కువగా అక్రమాలకు పాల్పడి దోచుకుంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డేనని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ‘రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీదే పెద్ద మాఫియా. ల్యాండ్, వైన్, మైన్ అన్ని కుంభకోణాలు చేశారు. వాటిని ఆధారాలతో సహా త్వరలో బయటపెడతా. శాంతిభద్రతల సమస్య నేపథ్యంలోనే పుంగనూరుకు వెళ్లడానికి మిథున్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు’ అని మంత్రి చెప్పారు.

News July 1, 2024

ఎచ్చెర్ల : నేటి నుంచి ఈఏపీసెట్ కౌన్సిలింగ్

image

ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈఏపీసెట్ ఆన్‌లైన్ కౌన్సిలింగ్ సోమవారం ప్రారంభమవుతుందని సహాయ కేంద్ర జిల్లా సమన్వయకర్త జి.దామోదర్‌రావు ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ స్ట్రీమ్‌కు జులై 1నుంచి 7తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు కౌన్సిలింగ్ రుసుం చెల్లించాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1200 ఎస్సీ, ఎస్టీలు 600 చెల్లించాలని పేర్కొన్నారు.

News July 1, 2024

శ్రీకాకుళం: పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

image

శ్రీకాకుళం మండలం పెద్దపాడు గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సమూన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన చేతుల మీదగా లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. కలెక్టర్ స్వయంగా పెన్షన్ అందజేయడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య, పింఛన్ల పంపిణీ సిబ్బంది పాల్గొన్నారు.

News July 1, 2024

నేడే పెన్షన్ పంపిణీ.. ఎంత ఇస్తారంటే !

image

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 3,19,702 మంది లబ్ధిదారుల ఉన్నారు. వీరికి రూ.213 కోట్ల మీద నిధులు మంజూరయ్యాయి. సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ముందుగా ప్రకటించిన అదనపు మొత్తం రూ.1,000 చొప్పున రూ.3,000, జూలై నెల రూ.4,000 కలిపి మొత్తం రూ.7,000 బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ పంపిణీ చేయనున్నారు.

News July 1, 2024

ఆదోని: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుడ్లూరులో శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న బసవరాజు(22)అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్ర లేచి పక్క గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న భర్తను చూసిన భార్య కవిత వెంటనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపింది. 2 నెలల క్రితమే హత్రి బెలగల్ గ్రామానికి చెందిన కవితకు బసవరాజుకు వివాహమైంది. వివాహమైన రెండు నెలలకే ఇలా జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

News July 1, 2024

గుంటూరు-ఔరంగాబాద్ రైలు ప్రారంభం

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు- ఔరంగాబాద్-గుంటూరు మధ్య నూతనంగా ప్రారంభించిన రైలు ఆదివారం అధికారులు ప్రారంభించారు. ఈ రైలు (17253) ప్రతిరోజు గుంటూరులో 07.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఔరంగాబాద్ 13. 20 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(17254) ఔరంగాబాద్ లో 16.15 గంటలకు ప్రారంభమై గుంటూరు మరుసటిరోజు 21.30 గంటలకు చేరుతుంది.

News July 1, 2024

తూ.గో.: పిల్లలు పుట్టడం లేదని సూసైడ్

image

తూ.గో. జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోట రాశి (24) నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దుర్గారావును ప్రేమవివాహం చేసుకుంది. కాగా పిల్లలు పుట్టకపోవడంతో మనస్తాపంతో ఆదివారం కాలువలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి తల్లి మంగ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు. 

News July 1, 2024

ముండ్లమూరు: చేపలు పట్టేందుకు వెళ్లి.. 

image

బావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ముండ్లమూరు మండలంలోని వేములలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వినుకొండ నాగరాజు (48) చెరువు వద్ద బావిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఆసమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. నీరు పూర్తిగా బయటకు వెళ్తేనే మృతదేహం లభ్యమవుతుందని తెలిపారు.

News July 1, 2024

తగ్గుముఖం పట్టిన పర్యాటకుల తాకిడి

image

ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు పర్యాటకుల తాకిడి తగ్గింది. గతవారం రోజులుగా బొర్రాను సందర్శించేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ ఆదివారం 1,700 మంది సందర్శించగా రూ.1.57 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. తాటిగూడ, కటికి, డముకు వ్యూపాయింట్ తదితర సందర్శిత ప్రాంతాలన్నీ ఈవారం వెలవెలబోయాయి. వేసవిసెలవులు ముగియడంతో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. దీంతో పర్యాటకుల సంఖ్య తగ్గుతుంది.