Andhra Pradesh

News July 1, 2024

పింఛన్ల పంపిణీకి పంపిణీకి అంతా సిద్ధం: ప్రకాశం కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో పింఛన్ల పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తమీమ్‌ అన్సారియా తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారన్నారు. సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేని చోట ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. 1వ తేదీనే దాదాపు పూర్తి చేయాలని పేర్కొన్నారు.

News July 1, 2024

చిత్తూరు: మామిడి కిలో రూ. 24 చెల్లించాలి

image

జూలై 1 నుంచి 3 వరకు తోతాపూరి మామిడికి కిలో ధర రూ. 24 కు తగ్గించకుండా చెల్లించాలని గుజ్జు పరిశ్రమల యజమానులకు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఆదివారం సాయంత్రం పరిశ్రమల యజమానులు, రైతులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. రైతులు వారి పంటను నేరుగా ఫ్యాక్టరీలకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఒకేసారి కోతలు కోయకుండా విడతల వారీగా చేయాలని సూచించారు. 3న సాయంత్రం మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.

News July 1, 2024

పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం: పల్నాడు కలెక్టర్

image

పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పల్నాడు కలెక్టర్ శ్రీకేశ్ బి లత్కర్ తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు నేటి ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారన్నారు. అవసరమైన సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేనిచోట, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. నేడే దాదాపు పింఛన్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు.

News July 1, 2024

నేటినుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కృష్ణా జిల్లా కలెక్టర్

image

జూలై 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వయంగా స్వీకరిస్తామని అన్నారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News July 1, 2024

YCP కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు: జక్కంపూడి

image

హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువులోని MFకన్వెన్షన్ హాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఓటమి చెందిన నేపథ్యంలో కార్యకర్తలు అధైర్య పడకూడదన్నారు. కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదన్నారు.- జక్కంపూడి వ్యాఖ్యలపై మీ కామెంట్..?

News June 30, 2024

తాడిపత్రిలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

తాడిపత్రి మండలంలో ఆదివారం రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని ఎల్లనూరు రోడ్డు రైల్వే గేటు సమీపంలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి రైల్వే పోలీసులు చేరుకుని పరిశీలించారు. చెడు వ్యసనాలకు బానిసై జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

News June 30, 2024

తూ.గో.: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికరేవుల ఏటిగట్టుపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న తాత, మనవడు మృతిచెందారు. మృతులు మాసా వీర్రాజు (55), పాముల ధనుష్ (12)గా చెబుతున్నారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 30, 2024

ప.గో.: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

కొవ్వూరు మండలం ఆరికరేవుల ఏటిగట్టుపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న తాత, మనవడు మృతిచెందారు. మృతులు మాసా వీర్రాజు (55), పాముల ధనుష్ (12)గా చెబుతున్నారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 30, 2024

పెడన: దేశ సరిహద్దుల్లో జవాన్ నాగరాజు మృతి

image

మండలంలోని చేవేండ్ర గ్రామానికి చెందిన జవాన్ సాదరబోయిన నాగరాజు దేశ సరిహద్దుల్లో మృతి చెందారు. 2 రోజుల క్రితం దేశ సరిహద్దుల్లో వరద ముంపులో ట్యాంకర్ కొట్టుకుపోగా అందులో ఉన్న నాగరాజు మృతి చెందాడు. నాగరాజు మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఎనిమిదేళ్ల క్రితం నాగరాజు సైన్యంలో చేరారు. నాగరాజుకు భార్య, యేడాది పాప ఉంది. సోమవారం నాగరాజు మృతదేహం స్వగ్రామానికి రానుందని కలెక్టర్ తెలిపారు.

News June 30, 2024

జూలై 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్ బాలాజీ

image

జూలై 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వయంగా స్వీకరిస్తానని అన్నారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.