Andhra Pradesh

News June 30, 2024

TPT : పరీక్ష ఫీజు చెల్లించండి

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) పరిధిలో జూలై 31వ తేదీ నుంచి పీజీ ఫస్ట్ స్పెల్ పరీక్షలు ప్రారంభమవుతాయని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. పీజీ కోర్సులలో ప్రవేశం పొందిన అభ్యర్థులు జూలై 7వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు https://www.braouonline.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News June 30, 2024

పర్యాటకులతో విశాఖ బీచ్‌లు కిటకిట

image

పర్యాటకులతో విశాఖ బీచ్‌‌లు ఆదివారం కిటకిటలాడాయి. వీకెండ్ కావడంతో పర్యాటకులతో పాటు నగరవాసులు బీచ్‌లోని ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించారు. పిల్లలతో పాటు బీచ్‌కు చేరుకుని స్నానం చేస్తూ గడిపారు. దీంతో ఆర్కే బీచ్‌తో పాటు పరివాహక ప్రాంతమంతా చిన్నారులు, యువతీ యువకులతో కిక్కిరిసిపోయింది. పర్యాటకుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

News June 30, 2024

సీఎం తాడేపల్లి పర్యటన వివరాలు ఇవే.!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తాడేపల్లి పరిధి పెనుమాకలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారులు CM పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 5.45కు ఉండవల్లి నివాసం నుంచి పెనుమాక చేరుకుని, ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు. అనంతరం పెనుమాక మసీదు సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటిస్తారు. అనంతరం ఉండవల్లి చేరుకుంటారు.

News June 30, 2024

మాజీ మంత్రి అంబటిపై అచ్చెన్నాయుడు ఫైర్ 

image

పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే విషయంలో నీకు సీఎం చంద్రబాబుకు పోలికా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబును ప్రశ్నిస్తూ మంత్రి అచ్చెన్న ట్వీట్ చేశారు. ’పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే విషయంలో నీకు, సీఎం చంద్రబాబుకు పోలికా? నీకు తెలిసిన విద్యలు వేరే ఉన్నాయి. ఇది నీ సబ్జెక్ట్ కాదు. అన్నిట్లో దూరి అభాసుపాలు కావద్దు‘ అని హితవు పలికారు.

News June 30, 2024

రేపటి నుంచి నూతన నేర చట్టాలు అమలు: నెల్లూరు ఎస్పీ

image

జూలై ఒకటో తేదీ నుంచి దేశంలో నూతన నేర చట్టాలు అమలులోకి వస్తున్నాయని జిల్లా ఎస్పీ కే.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష అధినియమ్ చట్టాలుగా మారయన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చట్టాలపై అవగాహన ఉండాలన్నారు.

News June 30, 2024

సింగరాయకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలకుంట్లపాడులో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో రాజమండ్రికి చెందిన షేక్ జానీ(40) మృతి చెందాడని ఎస్సై శ్రీరామ్ ఆదివారం తెలిపారు. 5 సం. క్రితం వలస వచ్చి అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ రొయ్యల పరిశ్రమంలో కూలీగా పని చేస్తున్నాడన్నారు. రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢీకొట్టడంతో అదే వాహనం ముందు చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

News June 30, 2024

చింతలపూడి MLA కొత్త నిర్ణయం

image

చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సోమ, మంగళవారాల్లో చింతలపూడిలో బుధవారం జంగారెడ్డిగూడెంలో, గురువారం కామవరపుకోటలో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. శుక్రవారం అధికారులతో నియోజకవర్గంపై సమీక్ష చేస్తానని చెప్పారు. ఇక శనివారం 4 మండలాల్లోని ప్రభుత్వకార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు.

News June 30, 2024

కడప: YSRTUC జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన రసూల్ బాషా

image

YSRTUC ట్రేడ్ యూనియన్ విభాగానికి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని కడప రసూల్ బాషా తెలిపారు. వైసీపీలో తాను గత 13 సంవత్సరాలుగా ఉన్నానని, సొంత కారణాలవల్ల YSRCP నుంచి వైదొలుగుతున్నట్లు ఇందులో ఎవరి బలవంతం, ప్రోద్బలం, మరో పార్టీ నుంచి ఒత్తిడి గాని లేదని ఆయన ప్రకటించారు. ఇక పార్టీ కార్యక్రమాలు తాను చేయదలచుకోలేదని తెలిపారు.

News June 30, 2024

అల్లూరి జిల్లా: భర్తకు మూడో పెళ్లి చేసిన భార్యలు

image

భర్తకు ఇద్దరు భార్యలు దగ్గరుండి ఈనెల 25న మూడో పెళ్లి చేశారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో ఈ తంతు జరిగింది. గ్రామానికి చెందిన పండన్న మొదటి భార్యకు పిల్లలు లేరని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2007లో బాబు పుట్టాడు. మరో సంతానం కావాలంటూ భర్త ఇద్దరికీ చెప్పాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లికి కార్డులు కొట్టించి, బ్యానర్లు కట్టించారు. ఈ నెల 25న అందరి సమక్షంలో అక్షింతలు వేసి పెళ్లి చేశారు.

News June 30, 2024

శ్రీకాకుళం: 341 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు..!

image

పెద్దమడి గురుకుల పాఠశాలలో 341 మంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులు ఆదివారం ఆందోళన చేశారు. గతంలో ఉన్న 17 మంది గెస్ట్ టీచర్లు మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో క్లాసులకు అంతరాయం ఏర్పడింది. డీఎస్సీలో తమ పోస్టులు కలపడంతో తమకు న్యాయం చేయాలని గెస్ట్ టీచర్లు మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో సమస్య ఏర్పడిందని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రిన్సిపల్ అజిత్ తెలిపారు.