Andhra Pradesh

News June 30, 2024

మంత్రి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ వినతి 

image

గిరిజన ఆశ్రమ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ ఆదివారం వినతి పత్రం అందజేశారు. జీవోనం-3 ప్రకారం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని, గి.సం.శాఖకు మంజూరైన డీఈవో, డివైఈవో పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 420 పండిట్ పోస్టులు అప్‌గ్రేడ్ జరిగేలా చూడాలని కోరారు. వారి వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. 

News June 30, 2024

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్టు కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలలో, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News June 30, 2024

విశాఖ: Pic Of The Day

image

చింతపల్లి మండలంలోని కొత్తబంద గ్రామానికి సరైన రహదారి లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలోని బడి ఈడు పిల్లలు పక్క గ్రామమైన పొట్టిబంద ఎంపీపీ పాఠశాలలో చదువుతున్నారు. అయితే రహదారి సౌకర్యం లేకపోవడం, రెండు గ్రామాల మధ్యలో కొండవాగు ఉండడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్థులు కలిసి వాగుపై కర్రలతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు.

News June 30, 2024

చంద్రబాబు రేపు పెన్షన్ పంపిణీ చేసేది వీరికే.!

image

సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే. కాగా తాడేపల్లి మండలం పెనుమాకలో బాణావతి పాములు నాయక్‌ ఇంటికి వెళ్లి, అతనికి వృద్ధాప్య పెన్షన్ అతని కుమార్తె సాయికి వితంతు పెన్షన్ అందజేయనున్నారు. దేశ చరిత్రలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారని టీడీపీ నేతలు అన్నారు. సీఎం వస్తుండడంతో పెనుమాకలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.

News June 30, 2024

బతికున్నంత కాలం నిజాయితీగానే బతుకుతా: MLA వరద

image

తాను బతికున్నంత కాలం నిజాయితీగా బతికి చనిపోతానని MLA నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు గీతాశ్రమంలో విశ్వహిందూ పరిషత్, ABVP, RSS, శివ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు అభినందన సభ నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను పునర్నిర్మిస్తామన్నారు. దేవాలయాల ఆస్తులను కాపాడుతానని, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పట్టణంలో రోడ్ల వెడల్పుకు రాజీ పడకుండా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

News June 30, 2024

ధాన్యం బకాయిలపై మంత్రి దుర్గేశ్ హామీ

image

గత ప్రభుత్వంలో రైతులకు బకాయిపడిన ధాన్యం విక్రయాల డబ్బులను త్వరలో చెల్లిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఆదివారం ఆయన నిడదవోలులో మీడియాతో మాట్లాడుతూ..గతంలో రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం విక్రయాల నగదును చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుందని అన్నారు. జూలై 1న లబ్ధిదారులకు ఇంటివద్దే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లుచేశామన్నారు.

News June 30, 2024

అనంత: రూ.11 లక్షలతో ఉడాయించిన ఆర్బీకే అధికారి

image

కుందుర్పి మండలం జంబుగుంపుల రైతు భరోసా కేంద్రం విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ (వీహెచ్ఏ) ప్రవీణ్ రూ.11 లక్షల నగదుతో 10 రోజుల క్రితం ఉడాయించాడు. ఈ ఘటనపై మండల వ్యవసాయ అధికారి మహేశ్ ఆదివారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయితీ విత్తనాలు విక్రయించగా రూ.17 లక్షలు వచ్చాయని, అందులో ప్రవీణ్ రూ.11 లక్షలు తీసుకొని పరారయ్యాడని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News June 30, 2024

జులైలో తిరుమలలో జరిగే ఉత్సవాలు

image

తిరుమల శ్రీవారి ఆలయంలో జులై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. 2న మతత్రయ ఏకాదశి. 11న మరీచి మహర్షి వర్ష తిరునక్షత్రం. 15న పెరియాళ్వార్ శాత్తుమొర. 16న శ్రీవారి ఆణివార ఆస్థానం. 17న తొలి ఏకాదశి. 21న గురు పూర్ణిమ, వ్యాస పూజ. 22న శ్రీ విఖానస మహాముని శాత్తుమొర. జూలై 31న సర్వ ఏకాదశి నిర్వహించనున్నారు.

News June 30, 2024

కాకినాడ: కరెంట్ షాక్‌తో బీటెక్ విద్యార్థి మృతి

image

కరెంట్ షాక్‌తో ఓ యువకుడు మృతిచెందిన ఘటన కాకినాడలో జరిగింది. స్థానికుల వివరాలు.. కాకినాడ జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ చక్రధర్ స్థానిక శ్రీరామ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో ఉంటున్నారు. ఆయన కుమారుడు విజయ్ ఉదయం ఇంట్లో ఇంటర్‌నెట్ వైర్ కట్ చేస్తుండగా సడెన్‌గా కరెంట్ రావడంతో షాక్‌తో చనిపోయాడు. కాగా అతను ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫస్ట్‌ఈయర్ చదువుతున్నాడు.

News June 30, 2024

చిత్తూరు జిల్లాలో పెన్షన్ల ద్వారా 2,71,696 మందికి లబ్ధి

image

చిత్తూరు జిల్లాలో మొత్తం 2,71,696 మందికి రూ.181కోట్లు పెన్షన్ల కింద జూలై 1న పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వృద్ధాప్య పెన్షన్ కింద 1,45,035 మందికి రూ.101.52 కోట్లు, నేతన్న పెన్షన్ 2,572 మందికి రూ.1.80 కోట్లు, వితంతు పెన్షన్ 59,993 మందికి రూ.42 కోట్లు, వికలాంగుల పెన్షన్ కింద 35,803 మందికి రూ.21.48 కోట్లు ఇవ్వనునట్లు తెలిపారు.