Andhra Pradesh

News June 30, 2024

నా మొదటి నెల జీతం దానికే: విజయనగరం ఎంపీ

image

అన్ని అలవెన్సులతో తనకు వచ్చే మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు అందజేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ఆయన.. స్వామి సన్నిధిలో ప్రకటించారు. ఆంధ్రుడిగా బాధ్యతతో రాష్ట్ర రాజధాని అభివృద్ధికి తన వంతుగా మొదటి జీతాన్ని అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

News June 30, 2024

కర్నూలు: ‘అధికారులు మారినా.. సూచిక బోర్డులు మారలేదు’

image

జిల్లా ఉన్నతాధికారులు మారినప్పటికీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం వారి పేర్లతో పాటు ఫొటోలతో సూచిక బోర్డులు దర్శనమిస్తున్నాయి. నూతన కలెక్టర్‌గా రంజిత్ బాషా బాధ్యతలు తీసుకున్నా.. అప్పటి కలెక్టర్ డాక్టర్ సృజన ఫొటోతో పాటు అప్పటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ వెంకట రంగారెడ్డి ఫొటో ఉన్న సూచిక బోర్డు అలాగే ఉన్నాయి. అధికారులు మారినా బోర్డులు మార్చకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు.

News June 30, 2024

సిద్దవటం: ‘కొన్ని మీడియా గ్రూపుల్లో వస్తున్న వార్త అవాస్తవం’

image

సిద్దవటం మండలం వెలుగు పల్లి పరిసర ప్రాంతాల్లో చిరుత పులి తిరుగుతున్నట్లు కొన్ని మీడియా గ్రూపుల్లో వస్తున్న వార్త కథలు అవాస్తవమని సిద్దవటం ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి అన్నారు. ప్రతిరోజు మా సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా అన్నీ గమనిస్తున్నారని, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. చిరుత తిరుగుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కళావతి అన్నారు.

News June 30, 2024

గుంటూరు- సికింద్రాబాద్ రైలు ఔరంగాబాద్ వరకు పొడిగింపు

image

గుంటూరు-సికింద్రాబాద్ రైలును ఆదివారం నుంచి ఔరంగాబాద్ వరకు పొడిగించినట్లు, దక్షిణ మధ్య జోనల్ రైల్వే మెంబర్ జుబేర్ బాషా ఆదివారం పేర్కొన్నారు. ఇక నుంచి గుంటూరు- ఔరంగాబాద్‌కు రైలు నెం.17253 మధ్యాహ్నం 12.15 గంటలకు నంద్యాల రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఔరంగాబాద్-గుంటూరు రైలు నెం. 17254 మధ్యాహ్నం 3.05 నిముషాలకు నంద్యాల రైల్వే స్టేషన్‌కు వస్తుందన్నారు.

News June 30, 2024

కోటంక సుబ్రమణ్యేశ్వర స్వామికి వెండి ఆభరణాల వితరణ

image

గార్లదిన్నె మండలంలోని కోటంక సుబ్రమణ్య స్వామికి ఆదివారం భక్తులు వెండి ఆభరణాలు వితరణ చేశారు. ఆకులేడుకు చెందిన కాశిరెడ్డి మదనమోహన్ రెడ్డి, సావిత్రమ్మ దంపతులు రూ.1,33,000 విలువ చేసే వెండి అర్ఘ్య పాత్ర ఉద్ధరిణి సమర్పించారు. కలుగూరు దేవా, వరలక్ష్మి దంపతులు రూ.23 వేలు విలువ గల వెండి అర్ఘ్య పాత్ర ఉద్దరిణి ఆలయ ప్రధాన అర్చకులు రామాచారులకు అందజేశారు.

News June 30, 2024

కాకినాడ: యువకుడు గల్లంతు.. డెడ్‌బాడీ లభ్యం

image

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప శివారు చెరువులో గల్లంతైన కాకినాడ రూరల్ మండలం వలసపాకలకు చెందిన తంగెళ్ల అప్పన్న(25) మృతదేహం లభ్యమైంది. కూలీ పనికి వచ్చిన అప్పన్న శనివారం భోజనం అనంతరం మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి చెరువుగట్టు పైకి వెళ్లాడు. ముగ్గురులో ఇద్దరు ప్రమాదవశాత్తూ జారి చెరువులో పడిపోయారు. ఒకరిని స్థానికులు రక్షించగా.. అప్పన్న గల్లంతయ్యాడు. అతడి కోసం గాలించగా.. మృతదేహం లభ్యమైంది.

News June 30, 2024

శ్రీకాకుళం: ఆర్టీసీ ప్రయాణికులకు అలెర్ట్

image

శ్రీకాకుళం నుంచి నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్లవలసిన బస్సులు అన్ని ఆదివారం నుంచి శ్రీకాకుళం వయా రామలక్ష్మణ్ జంక్షన్ మీదగా పెద్దపాడు చేరుకుంటాయని శ్రీకాకుళం రవాణా శాఖ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సులు పెద్దపాడు, రాగోలు జంక్షన్ మీదగా శ్రీకాకుళం చేరుకుంటాయని వెల్లడించారు. ప్రయాణికులు దీనిని గమనించాలని కోరారు.

News June 30, 2024

జగ్గయ్యపేటలో విద్యుత్ షాక్‌కి గురై వ్యక్తి మృతి

image

మండలంలోని గౌరవరం గ్రామంలో ఆదివారం యాకోబు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కి గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో యాకోబు మృతదేహాన్ని పరిశీలించి నివాళులర్పించారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వర్షాకాలం సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

News June 30, 2024

మంగళగిరిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

మంగళగిరి పరిధి చినకాకాని హాయ్ ల్యాండ్ సమీపంలో గోడౌను పక్కన ఓ నివాసగృహం పైన గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు. రూరల్ SI క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. మృతుని వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటుందని, టీ షర్టు ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉన్నందున గుర్తుపట్టడానికి వీలులేదని మృతిని వివరాలు తెలిసిన వారు స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు.

News June 30, 2024

కర్నూలు: తుంగభద్ర డ్యాంలో 5 టీఎంసీల నీటి నిల్వ

image

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా వచ్చి చేరుతోందని తుంగభద్ర డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో డ్యాముకు ఆదివారం 6,308 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 5.79 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు.