Andhra Pradesh

News June 30, 2024

ఐటీ రంగం విస్తరణకు కృషి: ఎమ్మెల్యే లోకం మాధవి

image

ఉత్తరాంధ్రలో ఐటీ రంగం విస్తరించడానికి కృషి చేస్తానని, తద్వారా ఐటీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు అందే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. విశాఖపట్నంలో శనివారం రాత్రి జరిగిన ITAAP (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఐటీ రంగం విస్తరణకు అవసరమైన వనరులపై ఈ సందర్భంగా చర్చించారు.

News June 30, 2024

కడప: ITIలలో రెండో విడత అడ్మిషన్లు ప్రారంభం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2వ విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రభుత్వ మైనాటీల ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ ఎం.జ్ఞానకుమార్ తెలిపారు. విద్యార్థులు 10వ తరగతి పాస్/ఫెయిల్, ఇంటర్ పాస్/ఫెయిల్ ఆపై విద్యార్హతలు కలిగిన వారు కూడా అడ్మిషన్లను పొందవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమ అప్లికేషను ఆన్లైన్ ద్వారా iti.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.

News June 30, 2024

తొలిరోజే 100% పంపిణీ పూర్తి చేయాలి: నీరభ్ కుమార్

image

సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని రేపే 100% పూర్తిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఉదయం 6 నుంచే పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఇందులో నిర్లక్ష్యం జరిగితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్లను అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు.

News June 30, 2024

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం

image

దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాగులో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులు రాఘవ (9), సాయిచరణ్ (8)గా స్థానికులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 30, 2024

అనంత: చీనీకాయల గరిష్ఠ ధర రూ.19,000

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో శనివారం చీనీకాయలు టన్నుకు గరిష్ఠంగా రూ.19వేలు, కనిష్ఠంగా రూ.8వేలు, సరాసరి రూ.12వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. శనివారం అనంతపురం మార్కెట్‌కు మొత్తంగా 305 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి వెల్లడించారు. చీనీకాయలు ధరలు క్రమేణా తగ్గుతుండడంతో రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News June 30, 2024

శ్రీకాకుళం: ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు సెషన్‌కు సంబంధించి మొదటి కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్లలో ప్రవేశాలకు రెండో విడతలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.గోపాలకృష్ణ తెలిపారు. జులై 24 లోపు ITI.GOV.AP.IN వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జులై 25 లోపు సీతంపేట, ఇతర ఏ ప్రభుత్వ ఐటీఐలో అయినా పత్రాల పరిశీలనలో పాల్గొనాలన్నారు. జులై 27న సీతంపేటలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.

News June 30, 2024

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలు: సీపీ రామకృష్ణ

image

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు సీపీ రామకృష్ణ తెలిపారు. జులై 1 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు మొత్తం 92 రోజుల పాటు సెక్షన్ 30 అమలులో ఉంటుందన్నారు. 30 పోలీస్ యాక్ట్ అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసు కుంటామని సీపీ స్పష్టం చేశారు.

News June 30, 2024

అనంత: వ్యవసాయ సలహా బోర్డులు రద్దు

image

అనంతపురం జిల్లాలో గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా బోర్డులను రద్దు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఒక బోర్డులో ఛైర్మన్‌తో పాటు పదిమంది సభ్యులు ఉంటారు. జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 63, గ్రామ పంచాయతీ స్థాయిలో 864 వ్యవసాయ సలహా బోర్డులు ఉండేవని.. ప్రభుత్వం వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

News June 30, 2024

మాచర్ల: కాలువలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య

image

సాగర్ కాలువలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. మాచర్ల సమీపంలోని నాగార్జున సాగర్ చెక్‌పోస్ట్ నుంచి తెలంగాణకు వెళ్లే దారిలో, కొత్త బ్రిడ్జిపై నుంచి మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయసు సుమారు 60-65 ఏళ్ల మధ్య ఉంటుందని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 30, 2024

VZM: జిల్లాలో 295 మందికి చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను ఆదివారం వెల్లడించారు. ఎంవీ నిబంధనలు అతిక్రమించిన 295 మందిపై రూ.57,065 ఈ-చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 11 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 22 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయన్నారు.