Andhra Pradesh

News June 30, 2024

ప్రకాశం: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ ‌న్యూస్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అర్హులైన SC, ST, BC అభ్యర్థుల నుంచి ఉచిత డీఎస్సీ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఒంగోలు సంచాలకులు యం.అంజల తెలిపారు. జులై 8లోగా దరఖాస్తులు చేసుకున్నవారికి 10వ తేదీ నుంచి 60 రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో ఒంగోలులోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో 672 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

News June 30, 2024

వీసీ సుందరవల్లి రాజీనామా

image

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ సుందరవల్లి ఎట్టకేలకు రాజీనామా చేశారు. ప్రభుత్వం మారడంతో పలు యూనివర్సిటీల వీసీలు తప్పుకున్నా.. రాజీనామాకు ఆమె ససేమిరా అన్నారు. ఆమె రిజైన్ కోసం విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబట్టారు. ఈక్రమంలో శనివారం రాజీనామా చేశారు. మాజీ సీఎం జగన్‌కు సుందరవల్లి సమీప బంధువు. యూనివర్సిటీ పరిపాలన భవనానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.

News June 30, 2024

కర్నూలు రాయలసీమ వర్సిటీ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా వెంకటేశ్వర్లు

image

రాయలసీమ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా డాక్టర్ సముద్రాల వెంకటేశ్వర్లును నియమిస్తూ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య బీ.సుధీర్ ప్రేమకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం డాక్టర్ వెంకటేశ్వర్లు వర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌గా వ్యవహరించిన డాక్టర్ నాగుల అంకన్న బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

News June 30, 2024

కృష్ణా: పీజీ విద్యార్థులకు అలర్ట్..రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి-మార్చి 2024లో నిర్వహించిన పీజీ- ఆర్ట్స్ గ్రూపులు(సెమిస్టర్ ఎండ్)పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూలై 4వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకు http://anucde.info/ వెబ్‌సైట్ చూడాలంది.

News June 30, 2024

మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండో విడత కౌన్సెలింగ్

image

గుంటూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ చిన్న వెంకటేశ్వరరావు తెలిపారు. జులై 24లోపు వెబ్ సైట్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. అలాగే అదే రోజు తెనాలి, గుంటూరులలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లోని నమోదు కేంద్రాల్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.

News June 30, 2024

మాతృ మరణాలపై డీఎంహెచ్‌ఓ సమీక్ష

image

నంద్యాల జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్.వెంకటరమణ ఆదేశించారు. స్థానిక వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మాతృ మరణాలపై నందికొట్కూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎర్రమఠం, టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాలపై సంబంధిత వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

News June 30, 2024

కృష్ణా: నేడు రాష్ట్ర చెస్ జట్టు ఎంపిక పోటీలు

image

విజయవాడలోని స్ప్రింగ్ బోర్డు ప్లే స్కూల్‌లో రేపు ఆదివారం రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ జట్టు ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు టోర్నీ డైరెక్టర్ తాళ్ల నరేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర చెస్ సంఘ అనుమతితో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. టోర్నీలో తొలి 10 స్థానాల్లో నిలిచిన వారిని, అండర్- 7, 9, 11, 13, 15 కేటగిరీల్లో తొలి స్థానం పొందిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు.

News June 30, 2024

టీటీడీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు

image

టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాల, పద్మావతి జూనియర్ కళాశాలలో మిగిలిన సీట్లకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు జూలై 1, 2వ తేదీల్లో ఆయా కాలేజీల వద్దకు రావాలని ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ కోరారు. మెరిట్ ప్రాతిపదికన స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు.

News June 30, 2024

కృష్ణా: B.A. LL.B కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని B.A.LL.B కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన ఎనిమిదవ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 24, 26, 29, 31, ఆగస్టు 2వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News June 30, 2024

ఫించన్ల పంపిణీపై కలెక్టర్లతో వీసీ నిర్వహించిన నీరభ్ కుమార్

image

రాష్ట్రంలో జులై 1వ తేదీన ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఫించన్ల పంపిణీపై శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జులై 1వ తేదీన 65,18,496 మందికి వివిధ ఫించన్ దారులకు పెన్షన్ అందిస్తామన్నారు.