Andhra Pradesh

News June 30, 2024

ప‌టిష్ఠ ప్ర‌ణాళిక‌తో పెన్ష‌న్ల పంపిణీపై దృష్టిపెట్టండి: కలెక్టర్ సృజన

image

రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద పెరిగిన పెన్షన్ మొత్తాన్ని ల‌బ్ధిదారుల‌కు అందించేందుకు ప‌టిష్ఠ ప్ర‌ణాళిక‌తో, స‌మ‌న్వ‌యంతో కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న అధికారుల‌ను శనివారం ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. 1వ తేదీ ఉద‌యం 6గంట‌ల‌కు పెన్ష‌న్ పంపిణీని ప్రారంభించి ల‌బ్ధిదారులంద‌రికీ పెన్ష‌న్ మొత్తం అందించేందుకు కృషిచేయాల‌న్నారు.

News June 30, 2024

మౌలిక వసతుల కల్పన కు ప్రతిపాదనలివ్వండి: నిశాంత్ కుమార్

image

ప్రజలకు అత్యంత ప్రాధాన్యతైలైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన సమగ్ర ప్రతిపాదనలను అందజేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వానికి సామాజిక బాధ్యతగా సహకారం అందించేందుకు ఎన్‌పీసీఐఎల్ భాగస్వామ్యంతో ప్రజలకు అత్యంత మేలు జరిగే మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ముందుకు వచ్చిందన్నారు. జిల్లా పరిధిలోని ఆయా ప్రాధాన్యతలను గుర్తించి వెంటనే ప్రతిపాదనలను పంపించాలన్నారు.

News June 29, 2024

కృష్ణా: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్

image

కల్కి 2898 AD చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వాహనం అయిన బుజ్జి రేపు విజయవాడ రానుంది. ఈ మేరకు చిత్ర బృందం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విజయవాడ ట్రెండ్‌సెట్ మాల్ వద్ద బుజ్జి అందుబాటులో ఉంటుందని తెలిపింది.

News June 29, 2024

జూలై 1న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం: కలెక్టర్

image

జూలై 1న కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్, డివిజన్ కార్యాలయాల్లో సంబంధింత అధికారులు ప్రజా ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

News June 29, 2024

AI సృష్టించిన రాగి ముద్ద చిత్రం

image

నాటుకోడి, రాగి సంగటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీమ ప్రజలు ఆస్వాదిస్తూ తినే వంటకం ఇది. ఇటీవల AI సృష్టించిన వినూత్న ఫొటోలు నెట్టింట వైరలవుతున్న విషయం తెలిసిందే. అలాగే చట్ని, రాగి ముద్ద, నెయ్యితోనూ AI ఓ ఫొటో తయారు చేసింది. దీన్ని ఓ నెటిజన్ నెట్టింట పోస్ట్ చేయడంతో ‘సీమరుచులను ఇంకా ప్రాచుర్యంలోకి తేవాలి’ అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

News June 29, 2024

జాతీయ లోక్ అదాలత్‌లో 4,254 కేసులు పరిష్కారం

image

అనంతపురంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 4,254 కేసులకు న్యాయమూర్తులు పరిష్కారం చూపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 27 బెంచ్‌లు నిర్వహించారు. రాజీ పడదగిన 707 క్రిమినల్ కేసులు, 69 సివిల్ కేసులు, 26 మోటారు వాహనాల పరిహారం కేసులు, 3,254 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయి. లోక్ అదాలత్ నిర్వహణను జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు సత్యవాణి పర్యవేక్షించారు.

News June 29, 2024

కాటంరాజు ఏలిన మా కనిగిరి చరిత్ర తెలుసా?

image

కనిగిరిని 13వ శతాబ్దంలో కాటంరాజు ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కనిగిరి దుర్గాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించాడు. నాడు ఈ ప్రాంతాన్ని బంగారుకొండ అని కూడా పిలిచేవారు. ఆయన ఏలుబడిలో కడప, కర్నూల్ ప్రాంతాలు కూడా ఉన్నట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆయన పాలనలో కనిగిరి ప్రాంతంలో కరవు ఏర్పడటంతో నెల్లూరు పాలకుడైన మనుమసిద్ధి రాజుతో ఓప్పందం కుదుర్చుకున్నారని చరిత్ర.

News June 29, 2024

కలెక్టర్, SP, MLAలతో మంత్రుల సమీక్ష

image

నంద్యాలలోని ఆర్&బీ అతిథి గృహంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూక్ శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి, JC టీ.రాహుల్ కుమార్ రెడ్డి, MLAలతో సమీక్షించారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు బీసీ, ఫరూక్ దిశా నిర్దేశం చేశారు. MLAలు కోట్ల, గౌరు, బుడ్డా, భూమా, జయసూర్య పాల్గొన్నారు.

News June 29, 2024

దర్శి: కేవీకే కోఆర్డినేటర్‌గా సీనియర్ శాస్త్రవేత్త

image

దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బాధ్యతలను సీనియర్ శాస్త్రవేత్త డా.జీ.రమేష్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కేవీకే బోధన బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రకాశం జిల్లా రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందిస్తానని భరోసా కల్పించారు. ఈయన గతంలో పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రంలో సమన్వయకర్తగా విధులను నిర్వహించారు.

News June 29, 2024

అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తులకు ఇక్కట్లు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయంలోని ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. కొండ దిగువన ప్రసాదం విక్రయకేంద్రం వద్ద రాత్రివేళ ఏర్పాటుచేసిన లైట్ల వద్దకు పురుగులు రావడంతో ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. కనీసం లైట్లు కూడా ఆపట్లేదని వాపోతున్నారు. కౌంటర్ నుంచి ప్రసాదం ప్యాకెట్లు తీసుకునే సమయంలో పురుగుల కారణంగా అసౌకర్యానికి గురవతున్నామని చెబుతున్నారు.