Andhra Pradesh

News June 29, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి చిన్నారి ముస్కాన్ ఎంపిక

image

తాడిపత్రికి చెందిన చిన్నారి ముస్కాన్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైంది. అనంతపురంలో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలలో అండర్-13 సింగిల్స్, డబుల్స్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ధ్రువీకరిస్తూ చిన్నారి ముస్కాన్‌కు సర్టిఫికెట్ జారీ చేశారు.

News June 29, 2024

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఇలా

image

జులై 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 1వ తేదీన గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశం కానున్నారు. 2వ తేదీ ఉదయం కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్ష, సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. 3వ తేదీన ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

News June 29, 2024

SKLM: పెన్షన్ పంపిణీకి ప్రత్యేక కార్యాచరణ అమలు

image

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌కు తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ఏపీ సచివాలయం నుంచి శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై ఆయన దిశానిర్దేశం చేశారు.

News June 29, 2024

VZM: పదవీ విరమణ పొందిన సిబ్బందికి ఎస్పీ సన్మానం

image

జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పని చేసి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ దీపిక పాటిల్ శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో వారు చేసిన సేవలను కొనియాడారు. విధిలో చేసిన సేవలే అందరికి గుర్తింపునిస్తాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సేవలందించారని, ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని అన్నారు.

News June 29, 2024

కృష్ణా: స్త్రీ శిశు సంక్షేమ శాఖపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమానికి తోడ్పాటునందించి వారి అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సమగ్ర శిశు అభివృద్ధి పథకం, సమగ్ర శిశు సంరక్షణ పథకం, గృహహింస, చైల్డ్ హెల్ప్ లైన్-1098, చిల్డ్రన్ హోమ్, శిశు గృహ, స్వధార్ గృహ తదితర అంశాలపై సమీక్షించారు.

News June 29, 2024

డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి దోర్నాల నీటి సమస్య

image

ప్రకాశం జిల్లా దోర్నాలలో నెలకొన్న నీటి సమస్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. నిన్న <<13526596>>మంచి నీటి కోసం మహిళలు రోడ్డెక్కిన<<>> విషయం తెలిసిందే. విషయాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి గౌతమ్ రాజ్ ద్వారా తెలుసుకుని సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి ట్యాంకర్లతోనైనా నీటి ఎద్దడిని తీర్చేందుకు RWS అధికారులు సన్నద్ధం అయ్యారు.

News June 29, 2024

పాడేరు: ప్రతి 2 గంటలకు పంపిణీ శాతాన్ని పర్యవేక్షించాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1వ తేదీన ఉదయం 6 గంటలకే తలుపు తట్టి లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఆదేశించారు. శనివారం పింఛన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి 2 గంటలకు పింఛన్ల పంపిణీ శాతాన్ని పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.

News June 29, 2024

VZM: పదవీ విరమణ పొందిన సిబ్బందికి ఎస్పీ సన్మానం

image

జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పని చేసి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ దీపిక పాటిల్ శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో వారు చేసిన సేవలను కొనియాడారు. విధిలో చేసిన సేవలే అందరికి గుర్తింపునిస్తాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సేవలందించారని, ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని అన్నారు.

News June 29, 2024

ఉండికి నటుడు రావు రమేశ్ రూ.3లక్షల విరాళం

image

ప్రముఖ సినీనటుడు రావు రమేష్ ఉండి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సాయంగా రూ.3 లక్షలు ఆర్థికసహాయం అందించారు. ఈ మేరకు ఉండి MLA కనుమూరి రఘురామ కృష్ణరాజుకు సంబంధిత చెక్కును అందించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించినందుకు ఎమ్మెల్యే RRR ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News June 29, 2024

టీటీడీ సేవలకు ఆధార్ అనుసంధానం..?

image

టీటీడీ ఆన్‌లైన్ సేవలకు ఆధార్‌ లింక్ చేసేలా అడుగులు పడుతున్నాయి. ఇదే విషయమై ఈవో శ్యామలరావు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో UIDAI అధికారులతో సమావేశమయ్యారు. ‘టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలను ఆన్‌లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ దళారుల బెడద తప్పడం లేదు. ఆధార్ లింక్ ద్వారా మోసాలను అరికట్టేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి’ అని టీటీడీ ఐటీ అధికారులకు ఈవో సూచించారు.