India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
USలో లక్షల డాలర్ల జీతం వద్దనుకుని IPS బాట పట్టారు నెల్లూరు కొత్త SP అజిత వాజెండ్ల. గుంటూరు(D)కు చెందిన ఆమె ప్రైమరీ విద్యను AP, మెకానికల్ ఇంజినిరింగ్‌ను మద్రాస్ ITలో పూర్తి చేశారు. అనంతరం USలో భారీ ప్యాకేజీతో ఉద్యోగంలో చేరారు.అది నచ్చక సివిల్ సర్వీస్‌లోకి రావాలని HYD వర్సిటీలో పబ్లిక్ సర్వీస్‌లో పీహెచ్డీ చదువుతూ సివిల్స్‌కు ఎంపికయ్యారు. నగరంలో పెరుగుతున్న క్రైంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
మధురవాడ శిల్పారామంలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు విజయవంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. ముగింపు వేడుకల్లో సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం మహిళలకు ఆత్మరక్షణలో తైక్వాండో ప్రాధాన్యాన్ని వివరించారు.
కడప జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 39 మందికి స్థాన చలనం కలిగించారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు బదిలీ చేశారు. మరో 7మందికి అటాచ్మెంట్ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా శనివారం కడప ఎస్పీతోపాటు పలు జిల్లాల ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఒంగోలులోని జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ దామోదర్‌కు వీడ్కోలు సభను జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎస్పీ దామోదర్ జిల్లాకు అందించిన సేవలను పలువురు పోలీస్ అధికారులు కొనియాడారు. అనంతరం ఎస్పీ దామోదర్‌ను పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు పేర్కొన్నారు.
కులాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజలు వీటిని గమనించాలని తెనాలిలో జరిగిన మీడియా సమావేశంలో కోరారు. సోషల్ మీడియాను ఉపయోగించి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఓట్ల కోసం రాజకీయాలు చేసే పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు.
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం జిల్లా, మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను సమీపంలోని కార్యాలయాల్లో లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సమర్పించుకోవచ్చని ఆమె సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.
రాజమండ్రి కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని కూడా సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
గుత్తిలో ఈ నెల 25 నుంచి 27 వరకు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. గౌతమీపురి ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుత్తి ఆర్ఎస్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ క్రీడా మైదానంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల జట్లు కూడా పాల్గొననున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 18 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.