Andhra Pradesh

News June 29, 2024

అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం: కడప ఎంపీ

image

‘అధైర్యపడవద్దు, అందరికీ అండగా ఉంటాం’ అని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. శనివారం వేములలోని మండలంలోని కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొందర్లోనే మళ్లీ అధికారంలోకి వస్తామని, ఈ ఐదేళ్లు ఐదు రోజుల్లా గడిచిపోతాయని ఆయన వారికి ధైర్యం చెప్పారు. ప్రజా తీర్పును మనం గౌరవించాలని ఆయన కోరారు. అలాగే మండలంలోని పలు సమస్యలపై వారితో మాట్లాడారు.

News June 29, 2024

తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి: ఆనం

image

నెల్లూరు జిల్లాలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్‌పర్సన్ఆ నం అరుణమ్మ అధికారులను ఆదేశించారు. నెల్లూరు జడ్పీ ఆఫీసులో స్థాయీ సంఘ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ.. తాగునీటి పథకాలకు సంబంధించి గుత్తేదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు.

News June 29, 2024

కర్నూలు: ఉరివేసుకొని మహిళ మృతి

image

ఉరివేసుకొని మహిళ సంగీత(23) మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన సంగీతను పెద్దకడబూరు మండలానికి చెందిన రవికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే రవి ఫిబ్రవరి నెలలో గుండెపోటుతో మృతిచెందగా.. అప్పటి నుంచి సంగీత తల్లితండ్రులతో ఉంటోంది. కుటుంబసభ్యులు ఉదయం కూలీ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లగా ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 29, 2024

VZM: జులై 1న ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ చేయాలి

image

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పెంచిన పింఛన్లను ప్రభుత్వం జులై నుంచి పంపిణీ చేస్తున్నందున పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టర్ వెబెక్స్ ద్వారా పింఛన్ పంపిణీ ఏర్పాట్లపై ఆయన ఎంపీడీఓలతో సమీక్షించారు. 1వ తేది ఉదయం 6 గంటలకే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు. మొదటిరోజు 90 శాతం పంపిణీ పూర్తి కావాలన్నారు.

News June 29, 2024

తూ.గో.: కొంపముంచిన మొబైల్ యాప్.. మీరు జాగ్రత్త

image

ఆన్‌లైన్‌లో మోసపోయిన పలువురు ద్రాక్షారామం పోలీసులకు ఫిర్యాదుచేశారు. వివరాలు..కోనసీమ జిల్లా రామచంద్రపురం, అంబాజీపేట, అమలాపురం తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు బుక్కూరి ఆనంద్, మద్దాల వినయ్, మోటుపల్లి కిరణ్ GMR యాప్‌ను పరిచయం చేశారు. యాప్‌లో డబ్బులు పెడితే రెట్టింపు వస్తాయని నమ్మించారు. చాలామందికి నగదు వచ్చాయి. కొద్దిరోజులుగా నగదు రాకపోగా పోలీసులకు ఫిర్యాదుచేశారు. 1000 మంది వరకు లక్షల్లో మోసపోయారు.

News June 29, 2024

సిక్కోలు సిత్రాలు‌.. నటీనటులకు ఆహ్వానం

image

వర్థమాన దర్శకుడు ప్రేమ్ సుప్రీమ్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘సిక్కోలు సిత్రాలు’కు మంచి ఆదరణ వస్తోంది. తాజా ఎపిసోడ్‌‌లో నటించడానికి కొత్త నటీనటుల కోసం అరసవల్లి ఆఫీసులో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ శనివారం తెలిపారు. 6 నుంచి 60 ఏళ్లలోపువారు నటనపై ఆసక్తి, అంకితభావం ఉన్న ఎవ్వరైనా ఈ ఆడిషన్లలో పాల్గొనవచ్చన్నారు.

News June 29, 2024

SKLM: సమస్యల పరిష్కారానికి జిల్లాకు మంత్రి

image

దిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయానికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ విమానాశ్రయం నుంచి‌ మంత్రి రామ్మోహన్ నాయుడు రోడ్డు మార్గంలో శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలను కలవడానికి, వారి సమస్యలు తెలుసుకోవడానికి జిల్లాకు వస్తున్నట్లు సమాచారం.

News June 29, 2024

నెల్లూరులో ఆయన విగ్రహం పెట్టకండి: బీజేపీ

image

నెల్లూరులో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని నెల్లూరులో పెట్టనివ్వబోమన్నారు. ఈ మేరకు నాయకులు కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో లవన్నను కలిశారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. హిందువుల మాన ప్రాణాలు తీసిన దుర్మార్గుడు టిప్పు సుల్తాన్ అన్నారు. నమామి గంగే నేత మిడతల రమేశ్ తదితరులు ఉన్నారు.

News June 29, 2024

పార్వతీపురం: ఎస్‌వీడీ కళాశాలలో గెస్ట్ ప్రాతిపదికన దరఖాస్తులు

image

వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ప్రాతిపదికన నియామకాలు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చలపతిరావు తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, లైబ్రేరియన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తామన్నారు. అభ్యర్థులు జులై మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు కళాశాల ప్రిన్సిపల్‌కు అందజేయాలని ఆయన తెలిపారు.

News June 29, 2024

ప్రకాశం: TDP ఎంపీ, YCP ఎమ్మెల్యే ఒకే వేదికపై

image

జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పక్కపక్కనే కూర్చుని, ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందినవారైనప్పటికీ పక్కపక్కనే కూర్చుని ఆత్మీయంగా పలకరించుకోవడంతో సమావేశం సజావుగా సాగిందని అధికారులు తెలిపారు.