Andhra Pradesh

News June 29, 2024

ఈవీఎం, వీవీప్యాట్లకు కట్టుదిట్టమైన భద్రత: కలెక్టర్ సృజన

image

ఈవీఎం, వీవీప్యాట్ గోదాము భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సృజన తెలిపారు. గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును సీఈవో ముకేశ్ కుమార్ మీనా, కలెక్టర్ సృజన, సమన్వయ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు.

News June 29, 2024

T-20 వరల్డ్ కప్ ఫైనల్స్.. రాజమండ్రిలో లైవ్ స్క్రీనింగ్

image

ఇండియా – సౌత్ ఆఫ్రికా ఆడుతున్న టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లైవ్ స్క్రీనింగ్ రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్య మైదానంలో లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశామన్నారు. నగర ప్రజలు మైదానానికి తరలివచ్చి టీమ్ ఇండియాకి మద్దతు తెలపాలని కోరారు.

News June 29, 2024

AI సృష్టించిన రాగి ముద్ద చిత్రం

image

నాటు కోడి, రాగి సంగటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీమ ప్రజలు ఆస్వాదిస్తూ తినే వంటకం ఇది. అయితే ఇటీవల ఏఐ సృష్టించిన వినూత్న ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే ఏఐ సృష్టించిన రాగి ముద్ద ఫొటోను ఓ నెటిజన్ నెట్టింట పోస్ట్ చేశారు. చట్ని, రాగి ముద్ద, నెయ్యితో ఉన్న ఆ చిత్రం అందరికీ నోరూరిస్తోంది. దీనికి ‘సీమరుచులను ఇంకా ప్రాచుర్యంలోకి తేవాలి’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

News June 29, 2024

నంద్యాల: జనసేన పార్టీలో చేరిన వైసీపీ కౌన్సిలర్ గురుమూర్తి

image

ఆళ్లగడ్డలోని ఎంవీ నగర్ 24వ వార్డు కౌన్సిలర్ గురుమూర్తి శనివారం జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తాలూకా ఇన్‌ఛార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి సమక్షంలో ఆయన తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇరిగెల మాట్లాడుతూ.. త్వరలోనే మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎన్డీఏ కూటమి వశం కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ జోన్ కమిటీ సభ్యుడు మహబూబ్ హుస్సేన్ పాల్గొన్నారు.

News June 29, 2024

ప.గో.: కొంపముంచిన మొబైల్ యాప్.. మీరు జాగ్రత్త

image

ఆన్‌లైన్‌లో మోసపోయిన పలువురు కోనసీమ జిల్లా ద్రాక్షారామం పోలీసులకు ఫిర్యాదుచేశారు. వివరాలు.. రామచంద్రపురం, అంబాజీపేట తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు బుక్కూరి ఆనంద్, మద్దాల వినయ్, మోటుపల్లి కిరణ్ GMR యాప్‌ పరిచయం చేశారు. యాప్‌లో డబ్బులు పెడితే రెట్టింపు వస్తాయని నమ్మించారు. చాలామందికి నగదు వచ్చాయి. కొద్దిరోజులుగా నగదు రాకపోగా మోసపోయినట్లు గుర్తించారు. బాధితుల్లో తణుకుకు చెందిన వారు సైతం ఉన్నారు.

News June 29, 2024

పింఛన్‌లకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ మనజీర్ జిలాని

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలోని అన్ని విభాగాలకు సంబంధించి 3,19,702 మంది లబ్ధిదారులకు రూ.212.07 కోట్ల మేర నిధులు మంజూరయినట్లు కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ తెలిపారు. ఈ నెల 29న బ్యాంక్‌ల నుంచి నగదును విత్‌డ్రా చేసేలా సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జులై 1వ తేదీనే ఇంటి వద్ద సచివాలయ ఉద్యోగులతో వంద శాతం పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.

News June 29, 2024

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జనసేనాని

image

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ 12PMకు కొండగట్టు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా కొండగట్టు వచ్చిన పవన్ కళ్యాణ్.. అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. రెండు రాష్ట్రాల నుంచి పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో కొండగట్టు చేరుకున్నారు. పోలీసులు కట్టుదిట్ట భద్రతా చర్యలు చేపట్టారు.

News June 29, 2024

ప.గో: అమ్మలకు తప్పని ‘కడుపు కోత’

image

ప.గో జిల్లా వ్యాప్తంగా కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గి.. సిజేరియన్లు 80శాతం పైనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2023-24లో ప్రవేట్‌లో మొత్తం 11,674 కాన్పులు కాగా.. 1,751 మాత్రమే సాధరణ కాన్పులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో 7,912 కాన్పులు కాగా, వాటిలో సాధారణ-3,568, సిజేరియన్లు-4,344 జరిగినట్లు గుణంకాలు చెబుతున్నాయి. ఆపరేషన్‌కు రూ.80వేలు- రూ.లక్ష వసూలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి.

News June 29, 2024

నరసరావుపేట: మాజీ మంత్రి పీఏ, మరిదిపై వ్యాపారుల ఫిర్యాదు

image

మాజీ మంత్రి విడదల రజని మరిది గోపి, పీఏ రామకృష్ణపై పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు ఫిర్యాదు చేశారు. 2020లో స్టోన్ క్రషర్ వ్యాపారులను రూ.5కోట్లు లంచం ఇవ్వాలని పీఏ రామకృష్ణ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరికి రామకృష్ణకి రూ.2కోట్లు, రజని మరిది గోపి, ఓ పోలీస్ అధికారికి చెరో రూ.10లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News June 29, 2024

స్పీకర్ పదవికి గౌరవం పెరిగేలా పనిచేస్తా: అయ్యన్న

image

స్పీకర్ పదవికి మరింత గౌరవం పెరిగేలా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అతి చిన్న వయసులో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి ద్వారా అత్యున్నత గౌరవం ఇచ్చి బాధ్యతలను అప్పగించారన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పరిమితులకు లోబడి హుందాగా పని చేస్తానని పేర్కొన్నారు.