Andhra Pradesh

News June 29, 2024

అనంత: లైంగిక వేధింపులకు పాల్పడ్డ వైద్యుడిపై కేసు

image

లైంగిక వేధింపులకు పాల్పడ్డ చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేట్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ముష్టికోవెల ఆరోగ్య ఉప కేంద్రంలో పని చేస్తున్న ఏఎన్ఎం కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఏఎన్‌ఎంలు సుభాషిణి, అశ్విని, కృష్ణమ్మలు తమను కూడా లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశాడని పేర్కొన్నారు.

News June 29, 2024

నెల్లూరు: చిన్నారిపై లైంగిక దాడి..ఏడేళ్లు జైలు

image

బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనలో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా పడింది. ప్రత్యేక పోక్సో జిల్లా రోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. గూడూరులోని చవటపాలేనికి చెందిన వీరయ్య 2015లో బాలికకు మిఠాయి ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప అమ్మమ్మ ఫిర్యాదుతో పోలీసులు వ్యక్తిని అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు.

News June 29, 2024

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి బాధాకరం: మంత్రి లోకేశ్

image

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి బాధాకరమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శ్రీనివాస్ చెరగని ముద్రవేశారని మంత్రి గుర్తు చేసుకున్నారు. ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు లోకేశ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News June 29, 2024

చిత్తూరు: ఆందోళనలో మామిడి రైతులు

image

చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పంటకు సరైన ధర అందకపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం టన్ను రూ.28వేలు పలికిన తోతాపురి మామిడి రకం తాజాగా రూ.24వేలకు పడిపోయింది. ర్యాంపు వ్యాపారులు, పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు సిండికేట్‌గా ధరలు తగ్గిస్తున్నారని వారు వాపోయారు. కలెక్టర్ తమకు న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News June 29, 2024

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చేవారికి ముఖ్య సూచన

image

వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, అన్ని శాఖల అధికారులు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30లోపు రావొద్దని EO కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు. ఉదయం 11.45- మధ్యాహ్నం 12.45 వరకు మహా నైవేద్యం జరుగుతుందని, అందువలన ఈ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30లోపు, మినహా మిగతా సమయాల్లో దర్శనానికి రావాలన్నారు.

News June 29, 2024

ఎల్.ఎన్.పేట: అనారోగ్యంతో సీఐఎస్ఎఫ్ జవాన్ మృతి

image

ఎల్.ఎన్.పేట మండలం ముంగెన్నపాడు గ్రామానికి చెందిన సీఐఎస్ఎఫ్ జవాను యారబాటి ప్రసాదు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ప్రసాద్ చెన్నైలో సీఐఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. ఈయనకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేడు ప్రసాద్ మృతదేహం చెన్నై నుంచి గ్రామానికి చేరుకుంటుందని మాజీ సర్పంచ్ యరబాటి రాంబాబు తెలిపారు.

News June 29, 2024

బొబ్బిలి: టీచర్‌కు మూడేళ్ల జైలు శిక్ష

image

భార్యపై హత్యాయత్నం చేసిన కేసులో టీచర్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానాను బొబ్బిలి కోర్టు విధించినట్లు కోర్టు సమన్వయ అధికారి ఏఎస్సై కొండలరావు తెలిపారు. మండలంలోని గజరాయునివలసకు చెందిన గుండెల సూరిబాబు టీచర్‌గా పని చేస్తున్నాడు. తన భార్యపై కత్తితో దాడి చేసిన ఘటనలో 2016లో కేసు నమోదయ్యింది. నేరం రుజువు కావడంతో సబ్ జడ్జి ఎస్.అరుణశ్రీ మూడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

News June 29, 2024

మున్సిపల్ అధికారులతో కలెక్టర్ బాలాజీ సమీక్ష

image

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలిసి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూలై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఒకటో తేదీన 90 శాతం పైగా పింఛన్లు పంపిణీ పూర్తయ్యే విధంగా ప్రణాళికలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మున్సిపల్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

News June 29, 2024

కర్నూల్ TO తిరుపతి, విజయవాడకు సర్వీసులు ఎప్పుడో?

image

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (ఓర్వకల్లు) విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకల సంఖ్య పెరుగుతోంది. మూడేళ్ల కాలంలో 1,20,732 మంది ప్రయాణం చేశారు. వైజాగ్, చెన్నై నగరాలకు తక్కువ సమయంలోనే చేరుకోగలుగుతున్నారు. అయితే ఈ ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ, తిరుపతి నగరాలకూ విమానాలు తిప్పాలని ప్రయాణికులు కోరుతున్నారు. మన రాష్ట్ర ఎంపీ రామ్మోహన్ నాయుడే కేంద్ర విమానయానశాఖ మంత్రి కావడంతో దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

News June 29, 2024

శ్రీకాకుళం: ధర పెరిగినా రైతుకు దక్కని లాభం

image

జిల్లాలో జీడి పంట, పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. స్థానిక జీడి పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు విదేశాల నుంచి సరిపడనంతగా రాకపోవడతో డిమాండ్ పెరిగి జీడి ధరలు అమాంతం పెరిగాయి. 80 కేజీల జీడి పిక్కల బస్తా ధర గతంలో రూ. 8 వేల వరకూ ఉండగా, ప్రస్తుతం రూ. 13,500 వరకూ ధర పలుకుతోంది. అయితే ఈ ఏడాది పంట దిగుబడులు తగ్గటంతో ఆశించిన స్థాయిలో ఆదాయం చేకూరలేదని రైతులు వాపోతున్నారు.