Andhra Pradesh

News June 29, 2024

ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు

image

ఈవీఎం ట్యాంపరింగ్ గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించడం, రాష్ట్రంలో కూడా తమకు అనుమానాలున్నాయని వైసీపీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చారన్నారు. దాన్ని వైసీపీ హుందాగా స్వీకరించాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు తదితరులు పాల్గొన్నారు.

News June 29, 2024

సైకిల్‌పై.. అయోధ్య నుంచి మహానందికి

image

ఢిల్లీకి చెందిన రాజేంద్ర శర్మ సైకిల్‌పై మహానందికి చేరుకున్నారు. వస్త్ర దుకాణంలో పనిచేసే ఆయన చిన్నప్పటి నుంచే హిందూ ధర్మం పట్ల ఆకర్షితుడై సైకిల్‌పై సంపూర్ణ భారత్ యాత్ర చేయాలని సంకల్పించాడు. ఈ ఏడాది మార్చి 13న అయోధ్య నుంచి సైకిల్ యాత్ర మొదలు పెట్టాడు. 7 రాష్ట్రాలను దాటుకుంటూ ఏపీకి చేరాడు. అందులో భాగంగా మహానంది చేరుకున్నారు. మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని అహోబిలం, తిరుపతికి వెళ్తానని చెప్పారు.

News June 29, 2024

విజయవాడ: మదర్సాలో 100 కిలోల కుళ్లిన మాంసం!

image

విజయవాడలోని సింగ్‌నగర్‌లో ఉన్న మదర్సా విద్యార్థిని కరిష్మా శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఫుడ్ పాయిజన్ అని నిర్వహకులు చెబుతుండగా.. మదర్సాలో ఏదో జరిగిందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో మృతి మిస్టరీగా మారింది. మరోవైపు, మదర్సాలో 100కిలోలకు పైగా కుళ్లిన మాంసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో మాంసాన్ని ఎందుకు ఉంచారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

News June 29, 2024

తూ.గో రైతులకు సిరులు కురిపిస్తున్న పొగాకు

image

తూ.గో జిల్లాలో రైతాంగానికి పొగాకు సిరులు కురిపిస్తుంది. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంట అయిన వర్జీనియా పొగాకు గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ధర పలుకుతుంది. పొగాకు సాగు ప్రారంభం నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండేళ్ల కాలంలో కిలో పొగాకు రూ.368 పలికింది. దీంతో తమ కష్టానికి తగిన ఫలితం చూస్తున్నామనే భావనతో పొగాకు రైతుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

News June 29, 2024

విశాఖ: టోల్ ఛార్జీ వసూళ్లను నిలిపివేసిన ఆర్టీసీ

image

విశాఖ జిల్లా అగనంపూడి వద్ద టోల్ గేట్ ఎత్తివేయడంతో ఆ రూట్‌లో ప్రయాణించే ప్రయాణికుల నుంచి ఆర్టీసీ టోల్ ఛార్జీల వసూళ్లకు నిలిపివేసింది. విశాఖ ఆర్టీసీ రీజియన్ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి అనకాపల్లి, రాజమండ్రి, నర్సీపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు ప్రయాణికుల నుంచి ఆర్టీసీ రూ.5 నుంచి రూ.10 వరకు టోల్ ఛార్జీలు వసూలు చేసేది. ఈ మేరకు టికెట్ ఇష్యూ మెషీన్‌లో సాఫ్ట్‌వేర్‌ను సవరించారు.

News June 29, 2024

రూ.1,861 కోట్లను దోచేశారు: ఎంపీ బైరెడ్డి శబరి

image

ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులను శిక్షించాలని ఎంపీ బైరెడ్డి శబరి ప్రభుత్వాన్ని కోరారు. ‘వైసీపీ పాలనలో ప్రజాధనం ఎంతలా దుర్వినియోగం అయిందో చెప్పేందుకు ఇదొక నిదర్శనం. మాజీ సీఎం జగన్ ప్రచార పిచ్చి కోసం ప్రత్యేకంగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏకంగా రూ.1,861 కోట్లను దోచేశారు. ఈ అక్రమాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులకు శిక్షించాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.

News June 29, 2024

రామతీర్థంలో క్రీస్తు శకం మూడవ శతాబ్ది బౌద్ధ ఆనవాళ్లు

image

చీమకుర్తి మండలం రామతీర్థంలోని మోక్ష రామలింగేశ్వరాలయంలో క్రీస్తు శకం మూడవ శతాబ్దం నాటి బౌద్ధఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఇటీవల రామతీర్థం ఆలయ పరిసరాల్లో జరిపిన అన్వేషణలో ఆలయం వెనుక వైపు నిర్లక్ష్యంగా పడి ఉన్న శివలింగాల మధ్య పలనాటి సున్నపు రాతి బౌద్ధ స్తంభాన్ని దానిపైన అర్ధచంద్రాకార పద్మాన్ని గుర్తించినట్లు ఆయన చెప్పారు.

News June 29, 2024

రాయచోటి: నా ఇల్లు నాకు ఇప్పించండని మహిళ ఆవేదన

image

అన్నమయ్య జిల్లా సుండుపల్లికి చెందిన వికలాంగురాలు షాహిదా ఇంటిని ఓ వ్యక్తి అద్దెకి తీసుకొని రిజిస్టర్ చేయించుకొని తనని బయటకు గెంటేశాడని బాధితురాలు వాపోయింది. ఈ విషయంపై బాధితురాలు చాలా రోజుల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన ఉపయోగం లేకపోవడంతో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసింది. జాయింట్ కలెక్టర్ ఫర్ మాన్ అహ్మద్ విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News June 29, 2024

నేడు 15 కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి తూ.గో జిల్లాలోని 15 కోర్టులో శనివారం 10 గంటల నుంచి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు శుక్రవారం తెలిపారు. ☞ తూ.గో జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తి☞ కాకినాడ జిల్లాలో కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు☞ కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, ముమ్మిడివరం, కొత్తపేటలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు.

News June 29, 2024

VZM: పదేళ్లు 4వేల మందికి పాముకాటు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో పాముకాటుతో ఎక్కవ మంది మృతి చెందుతున్నారు. వర్షాలు పడుతుండడంతో రైతులు, వ్యవసాయ కూలీలంతా పొలం పనులకు వెళ్తూ అక్కడ పాముకాటుకు గురౌతున్నారు. 2014 నుంచి ఈ ఏడాది మే నెల వరకు 4,447 పాముకాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో సుమారు 30% మృతిచెందారు. ప్రథమ చికిత్సపై అవగాహన లేకపోవడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రధాన కారణాలు. జిల్లా ఆస్పత్రులలో వారానికి ఆరు పాముకాటు కేసులు నమోదౌతున్నాయి.