Andhra Pradesh

News June 28, 2024

పిన్నెల్లిని కలిసిన మాజీ మంత్రి కాకాణి

image

మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కలిశారు. పిన్నెల్లిపై అనేక కేసులు బనాయించి జైలులో పెట్టడం హేయమైన చర్యని కాకాణి అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, అండగా నిలిచి సంఘటితంగా పోరాడుతామని ఆయన చెప్పారు.

News June 28, 2024

విశాఖ వైఎస్సార్ స్టేడియంలో ఆటగాళ్ల సందడి

image

విశాఖ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్‌లో క్రికెటర్లు శుక్రవారం సందడి చేశారు. ఏసీఏ ఆధ్వర్యంలో ఏపీఎల్ మూడో సీజన్ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ జట్లు తలబడనున్నాయి. ఆయా జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు.

News June 28, 2024

ముంపు గ్రామాల్లో అప్రమత్తం: మంత్రి అనిత

image

వరదల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి ముంపు గ్రామాల్లో ముందస్తు నివారణ చర్యలు చేపట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్‌తో వరద నివారణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంలో వరద నివారణ చర్యలపై ప్రత్యేకంగా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.

News June 28, 2024

బాలికపై అత్యాచారం.. 24 ఏళ్ల జైలుశిక్ష

image

చిత్తూరు: బాలికపై అత్యాచారం కేసులో ఓ యువకుడికి జైలుశిక్ష పడింది. గుడిపల్లె మండలానికి చెందిన 9వ తరగతి బాలికకు దేవరాజ్(26) మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. 2014 జూలై 5న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో దేవరాజ్‌కు 24 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని 9వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి శాంతి తీర్పు చెప్పారు.

News June 28, 2024

కళ్యాణదుర్గంలో వ్యక్తి దారుణ హత్య

image

కళ్యాణదుర్గం సమీపంలోని కూరాకులతోట వద్ద వన్నూరు స్వామి(30) అనే వ్యక్తిని శుక్రవారం దుండగులు దారుణంగా హత్య చేశారు. కురాకులతోట గ్రామానికి చెందిన వన్నూరు స్వామిని దుండగులు గొంతు కోసి అతి దారుణంగా చంపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News June 28, 2024

పిన్నెల్లి అరెస్టుతో పల్నాడు ప్రశాంతంగా ఉంది: MLA భాష్యం

image

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో పల్నాడులో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని పెదకూరపాడు శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ చెప్పారు. శుక్రవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో దాడులు, దౌర్జన్యాలకు పల్నాడు జిల్లా కేరాఫ్‌గా మారిందన్నారు. చట్టం నుంచి నేరస్తులు తప్పించుకోలేరని పిన్నెల్లి విషయంలో రుజువైందన్నారు. 14 కేసులలో పిన్నెల్లి దోషిగా ఉన్నారన్నారు.

News June 28, 2024

కడప: BSNL సేవల్లో అంతరాయం

image

కడప జిల్లాలో శుక్రవారం BSNL సేవల్లో అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు ఇక్కట్లు పడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి ఏడు గంటల వరకు BSNL నెట్ పనిచేయకపోవడంతో వినియోగదారులు BSNL కార్యాలయాల వద్దకు పరుగులు తీశారు. మెయిన్ లైన్‌లో సాంకేతిక లోపం ఏర్పడిందని వారు వివరించారు. రాజంపేట మండలం కొత్త బోయినపల్లి వద్ద ఉన్న టవర్ గత మూడు రోజులగా పని చేయడం లేదని కూడా వారు ఫిర్యాదు చేశారు.

News June 28, 2024

ఉత్తమ ఫలితాలు సాధించాలి: నారా భువనేశ్వరి

image

సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం చల్లపల్లి మండలం పాగోలులో పర్యటించారు. తమ ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏపీ క్యాంపస్ పరిశీలించారు. ఆమెకు సిబ్బంది, టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులతో సమావేశమైన భువనేశ్వరి వారితో మాట్లాడి స్ఫూర్తిదాయక ప్రసంగం చేసి వారితో కలిసి భోజనం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించాలని నారా భువనేశ్వరి కోరారు.

News June 28, 2024

పెన్షన్ల పంపిణీకి పక్కా ఏర్పాట్లు: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో 2,44,302 మంది లబ్ధిదారులకు జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ పీ.ప్రశాంతి వెల్లడించారు. పెన్షన్లకు సంబంధించి జిల్లాలో 9,552 క్లస్టర్లను ఉద్యోగులతో మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. పెన్షనర్లకు మంజూరైన రూ.165.13 కోట్ల నగదును ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

News June 28, 2024

పింఛన్ల పంపిణీకి పటిష్ట చర్యలు: కలెక్టర్

image

పింఛన్ల పంపిణీకి జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. పింఛన్లకు కేటాయించిన సొమ్మును శనివారం బ్యాంకుల నుంచి డ్రా చేస్తామని తెలిపారు. సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ పింఛన్ల పంపిణీపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ పాల్గొన్నారు. లబ్ధిదారుల హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను చేపట్టామని, శుక్రవారానికి పూర్తవుతుందని తెలిపారు.