Andhra Pradesh

News June 28, 2024

ముంపు గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యలు: హోం మంత్రి

image

ముంపు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. భారీవర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీసీ నిర్వహించారు. ప్రస్తుతం అల్లూరి జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. వరద ముంపు గ్రామాల్లో జిల్లా, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ప్రజలను వరదల పట్ల చైతన్యం చేస్తున్నామన్నారు.

News June 28, 2024

చంద్రబాబును కలిసిన పల్లా దంపతులు

image

టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు దంపతులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేస్తూ పని చేయాలన్నారు.

News June 28, 2024

శ్రీకాకుళం: రెండో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో 2020-21 నుంచి అడ్మిట్ అయిన MSc (కంప్యూటర్ సైన్స్) విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఆగస్టులో నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధరుసుం లేకుండా జూలై 1లోపు చెల్లించాలని పరీక్షల విభాగం తెలిపింది. ఫీజు వివరాలకై అధికారిక వెబ్‌సైట్ https://exams.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని కోరింది.

News June 28, 2024

శ్రీకాకుళం: మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో శుక్రవారం ఉదయం నుంచి నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. పలు ప్రముఖ కంపెనీల యాజమాన్యాలు జాబ్ మేళాలో భాగంగా ఇంటర్వ్యూలు నిర్వహించగా.. 554 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. విద్యార్హతలు, ఉద్యోగ సామర్థ్యం బట్టి వీరిలో 159 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధా తెలిపారు.

News June 28, 2024

కృష్ణా: అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి అనిత

image

రాష్ట్రంలో వర్షాలు, వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో 8 జిల్లాల కలెక్టర్లు, DROలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్‌ను అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా అలర్ట్ సెంటర్ విధులను అక్కడి అధికారులు ఆమెకు వివరించారు.

News June 28, 2024

కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజీనామా

image

కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి గొల్లా జ్ఞానమణి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మౌఖిక ఆదేశాల మేరకు వైస్ ఛాన్స్‌లర్ పదవిలో ఉన్న జ్ఞానమణి రాజీనామా చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా 2023 సంవత్సరం ద్వితీయార్థంలో కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా జ్ఞానమణి నియామకమయ్యారు.

News June 28, 2024

ఏయూకు పూర్వ వైభవం తీసుకువస్తాం: గంటా

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సీఎం చంద్రబాబు ఫోటోను వైస్ ఛాన్సలర్ ఛాంబర్‌లో ఏర్పాటు చేయకపోవడంపై గంటా ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి పనితీరు పట్ల ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూను భ్రష్టుపట్టించినట్లు విమర్శించారు.

News June 28, 2024

అంతర్జాతీయ స్థాయిలో హిందీకి గుర్తింపు: యార్లగడ్డ

image

అంతర్జాతీయ స్థాయిలో హిందీ భాషకు గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నామని విశ్వహిందూ పరిషత్ ఛైర్మన్, పద్మవిభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఏయూ హిందీ విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ హిందీ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేలా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు హిందీ నేర్చుకోవాలని కోరారు.

News June 28, 2024

పరిశ్రమల స్థాపనకు విస్తృత ప్రోత్సాహం: అనంత కలెక్టర్

image

జిల్లాలోని ఉపాధి అవకాశాలు సృష్టించే తయార, సేవారంగం పరిశ్రమలకు విస్తృత ప్రోత్సాహం కల్పించాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పరిశ్రమల అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 48వ జిల్లా పరిశ్రమలు & ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సాహించాలని ఆదేశించారు.

News June 28, 2024

పెండ్లిమర్రి : బత్తిన అశోక్‌కు వైవీయూ డాక్టరేట్

image

YVU కామర్స్ విభాగ పరిశోధకుడు బత్తిన అశోక్‌కు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రకటించింది. పర్ఫార్మెన్స్ అనాలసిస్ ఆఫ్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ELSS) అనే అంశం పైన పరిశోధన చేసి రూపొందించిన సిద్ధాంత గ్రంథాన్ని అశోక్ విశ్వవిద్యాలయ పరీక్షల విభాగానికి సమర్పించారు. అశోక్‌కు డాక్టర్ ప్రొసీడింగ్స్‌ను డాక్టర్ నల్లపురెడ్డి ఈశ్వర్ రెడ్డి జారీ చేశారు.