Andhra Pradesh

News June 28, 2024

దేవుడి పేరుతో దందాలు చేశారు: ఎమ్మెల్యే బొండా

image

గత ప్రభుత్వ పాలనలో దేవుడి పేరుతో దందాలు చేశారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ ట్వీట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఒకేసారి 54 మందిని తిరుమల శ్రీవారి దర్శనానికి పంపించాలని రాసిన సిఫారసు లేఖతో ఈ దందా బైటపడిందన్నారు. భక్తుల సౌకర్యాల గురించి ఏనాడూ పట్టించుకోని వైసీపీ నాయకులు దేవుడి పేరు చెప్పి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఉమ Xలో పోస్ట్ చేశారు.

News June 28, 2024

తూ.గో.: మంత్రి లోకేశ్‌ను కలిసిన జడ్పీ మాజీ ఛైర్మన్

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీఛైర్మన్ నామన రాంబాబు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు డొక్కా నాగబాబు ఉన్నారు.

News June 28, 2024

అనంత: బ్యాంక్ అధికారుల ఒత్తిడి.. రైతు ఆత్మహత్య

image

నార్పలలోని చైతన్య కాలనీకి చెందిన నాగప్ప శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంక్ అధికారుల ఒత్తిడిని తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఓ ప్రైవేట్ బ్యాంకులో నాగప్ప తీసుకున్న లోన్‌కు సంబంధించి ప్రతినెలా వడ్డీ కట్టినప్పటికీ నోటీసులు రావడంతో భయంతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

News June 28, 2024

నెల్లూరు జిల్లాకు రూ.219 కోట్లు అవసరం..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3.19 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. గత నెలలో రూ.96 కోట్లు మంజూరయ్యాయి. పింఛన్ రూ.4 వేలకు పెంచడంతో మరో రూ.30 కోట్లు అదనంగా పంచాలి. అలాగే ఏప్రిల్, మే, జూన్‌కు సంబంధించి పెరిగిన రూ.3 వేలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన జులై ఒకటో తేదీన జిల్లాలో ఒక్కొక్కరికీ రూ.7 వేలు చొప్పున డబ్బులు పంచడానికి రూ.219 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు.

News June 28, 2024

ఆంధ్ర యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా

image

ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌‌ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్‌లు రాజీనామా చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఉండేవారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే AU వీసీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా.. ఆయన రాజీనామా చేశారు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌‌‌గా కిషోర్ బాబు బాధ్యతలు స్వీకరించారు.

News June 28, 2024

హిందూపురం ఎంపీని కలిసిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే

image

హిందూపురం ఎంపీ బి.కే పార్థసారథిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం గుంటూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఆమె ఎంపీతో చర్చించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంపీ గల్లా మాధవికి సూచించారు. ఈ కార్యక్రమంలో గల్లా రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

News June 28, 2024

ఆంధ్ర యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా

image

ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌‌ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్‌లు రాజీనామా చేశారు. ఇప్పటికే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఉండేవారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే AU వీసీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా.. ఆయన రాజీనామా చేశారు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌‌‌గా కిషోర్ బాబు బాధ్యతలు స్వీకరించారు.

News June 28, 2024

ఎచ్చెర్ల: B.Tech 7వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం B.Tech 7వ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కార్యాలయం నుంచి ఈ ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఫలితాల కోసం https://drbrau.in ను సందర్శించాలని ఎగ్జామినేషన్ డీన్ కోరారు.

News June 28, 2024

మార్కాపురంపై చిగురిస్తున్న ఆశలు

image

మార్కాపురం జిల్లా ప్రకటనపై ఊహాగానాలు వస్తున్న సందర్భంగా మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కాపురంను ప్రత్యేక జిల్లాను చేస్తామని ప్రకటించారు. కాగా ఇటీవల సోషల్ మీడియాలో మార్కాపురంను జిల్లాగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.

News June 28, 2024

38,744 ఎకరాల ఆయకట్టుకు తోటపల్లి సాగునీరు

image

తోటపల్లి జలాశయం కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రాజెక్టు క్రింద మొత్తం 38,744 ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. కుడి ప్రధాన కాలువ క్రింద పార్వతీపురం మన్యం జిల్లాలో సీతానగరం, బలిజిపేట మండలాలలో 27 గ్రామాలకు చెందిన 13,684 ఎకరాలకు, విజయనగరం జిల్లాలో బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాం నియోజకవర్గాలలోని 13 మండలాలలో 66 గ్రామాలకు చెందిన 25,060 ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు.