Prakasam

News May 23, 2024

ప్రకాశం: ‘హాల్ టికెట్లు సిద్ధం డౌన్‌లోడ్ చసుకోండి’

image

పదవ తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల హాల్ టికెట్లు వెబ్సైట్లో సిద్ధంగా ఉన్నట్లు ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఈ నెల 24వ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. హాల్ టికెట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ వెబ్సైట్ నుంచి పాఠశాలల హెచ్ఎంల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.

News May 22, 2024

మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొనకనమెట్ల మండలం చిన్నారికట్ల గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బైకుపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడు రాచకొండ వెంకటేశ్వర్లు (32)గా గుర్తించారు. చిన్నారికట్ల నుంచి పెద్దరికట్ల గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News May 22, 2024

ప్రకాశం: ఓట్ల లెక్కింపు కోసం అబ్జర్వర్ల నియామకం

image

ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం అబ్జర్వర్లను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో పలు రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులను నియమించారు. బాపు గోపీనాథ్(సంతనూతలపాడు), మయూర్ కె మహత(వైపాలెం), గుంజం సోనీ(దర్శి), అరవింద కుమార్ (OGL), అనిమేష్(MRKP), ఆనంద్ కుమార్ (కొండపి), ఆల్టినోలిన్(గిద్దలూరు), బి.నరేంద్ర(కనిగిరి)లను నియమించారు.

News May 22, 2024

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఘాటెక్కిన పచ్చి మిర్చి

image

నిత్యావసరంగా వాడుకునే పచ్చి మిర్చి ధర ఘాటెక్కింది. ఎన్నడూ లేని విధంగా యర్రగొండపాలెంలో కిలో పచ్చి మిర్చి రూ.100కి చేరింది. పశ్చిమ ప్రాంతంలో ఎక్కడా వేసవిలో మిర్చి సాగు చేయలేదు. పుల్లలచెరువు, మల్లపాలెం, నాయుడుపాలెం, చాపలమడుగు ప్రాంతాల్లో అరకొరగా సాగు చేశారు. దీంతో పచ్చిమిర్చిని మైదుకూరు నుంచి రోజుకు 50 క్వింటాళ్ల దిగుమతి చేయాల్సి పరిస్థితి ఏర్పడింది.

News May 22, 2024

పర్చూరు: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

image

యద్దనపూడి -పోలూరు గ్రామాల మధ్య బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తాళ్ళూరి వినోద్ కుమార్ అనే ఉపాధ్యాయుడు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. దర్శిలో ఈయన MPP స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. బుధవారం బైకుపై పోలూరు వెళ్తుండగా గుంతలు తప్పించే క్రమంలో అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

News May 22, 2024

కనిగిరిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కనిగిరి మున్సిపల్ పరిధిలోని స్థానిక మాచవరం జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మాచవరం గ్రామానికి చెందిన రమాదేవి (45)మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మాచవరం నుంచి కనిగిరికి వస్తున్న వ్యానును మరో వ్యాను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అన్నారు. క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News May 22, 2024

ఒంగోలుకు ఎంపీ మాగుంట రాక

image

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి హైదరాబాదు నుంచి ఈనెల 23వ తేదీన ఒంగోలుకు రానున్నట్లు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. 23న ఉదయం జరిగే పలు కార్యక్రమాల్లో మాగుంట శ్రీనివాస రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాంనగర్ లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

News May 22, 2024

కొరిసపాడు: రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సజీవ దహనం

image

కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణపట్నం పోర్ట్ నుంచి పేరేచర్ల వెళుతున్న లారీ.. మేదరమెట్ల పైలాన్ రహదారి పక్కన ఆగి ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ శ్రీధర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. ఈ లోగా మంటలు చెలరేగి నెల్లూరు జిల్లా ఇనమనమడుగు గ్రామానికి చెందిన శ్రీధర్ ఆ మంటల్లో కాలిపోయారని స్థానికులు తెలిపారు.

News May 22, 2024

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 26 వేల మంది బైండోవర్

image

ఎన్నికల సందర్భంగా జిల్లాలో 26 వేల మందిని ముందస్తు బైండోవర్ చేశామని ఎస్పీ సునీల్ తెలిపారు. గొడవలు సృష్టించిన 35 మంది వివరాలను జిల్లా కలెక్టర్ కు నివేదించామన్నారు. వారిపై చర్యలకు అధికారులు సమాయత్తమవుతున్నారని చెప్పారు. మారణాయుధాలతో పాటు.. విడిగా పెట్రోలు కలిగివున్నా రౌడీ షీట్ తెరుస్తామని హెచ్చరించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ కార్యక్రమాలకు అనుమతులు తీసుకొని నిర్వహించుకోవాలన్నారు.

News May 22, 2024

కొత్తపట్నం: వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

image

వృద్ధురాలి హత్య కేసుకులో ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. కొత్తపట్నంలోని రెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుడిపల్లి నాగేశ్వరమ్మ(75) కల్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 18న అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రెడ్డిపాలేనికి చెందిన నాగరాజు, నాంచార్లు నిద్రిస్తున్న ఆమెను గొంతు నులిమి, ఊపిరాడకుండా చేసి హత్యకు పాల్పడ్డారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.