India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని మంగళవారం జమ చేసినట్లు ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 17 వ విడతగా విడుదల చేసిన సాయం జిల్లాలో 2.42 లక్షల మంది రైతులకు రూ. 48.43 కోట్లు విడుదల అయినట్లు ఆయన పేర్కొన్నారు. డీబీటీ పద్ధతిలో ఒక్కో రైతుకు బ్యాంకు ఖాతాలోకి రూ.2వేలు జమ చేశారని, ఇది పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టరేట్ లో బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ కార్యాలయం తెలిపింది. వివిధ శాఖలకు చెందిన అధికారులు, నూతనంగా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామికి కలెక్టర్ పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు విషయాల గురించి చర్చించారు.
గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మంగళవారం కారు, లారీ ఢీకొని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు గిద్దలూరు నుంచి నంద్యాల వెళ్తున్న కారు, నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వస్తున్న లారీ మూల మలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు.
వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం సముద్రతీరానికి 27 కి.మీ దూరంలో బోటు బోల్తా పడిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రాములు, చిట్టిబాబు, గోవిందు, శ్రీను వేటకు వెళ్ళగా.. సముద్రంలో గాలులకు ఒక్కసారిగా బోటు బోల్తా పడింది. ఐస్ బాక్సులు సహాయంతో సముద్రంలోనే 8 గంటలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఓమత్స్యకారుడు అటు వెళ్తు వారిని గమనించి తనబోటులో ఒడ్డుకు తెచ్చినట్లు తెలిపారు.
దర్శిలో ‘MLC గారి తాలూకా’ అంటూ బైక్లు, కార్లపై స్టిక్కర్లు వెలిశాయి. దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి MLC కేటాయించాలంటూ నియోజకవర్గ TDP శ్రేణులు గట్టిగానే పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇటీవల మీడియా సమావేశంలో కొందరు గొట్టిపాటి అభిమానులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జిల్లాలో గొట్టిపాటి ఫ్యామిలీకి చంద్రబాబు మంచి విధేయుడని, కచ్చితంగా లక్ష్మికి MLC పదవి దక్కుతుందని ఆమె వర్గీయులు ఆశిస్తున్నారు.
కాసేపటి క్రితం ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ప్రకాశం జిల్లాలో 5,487 మంది పరీక్షలు రాయగా… 3330 మంది పాసయ్యారు. మొత్తం 61 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా .. జిల్లా 12వ స్థానంలో నిలిచింది. దాంతో పాటు ఒకేషనల్‌కు ప్రకాశం జిల్లాలో 862 మంది పరీక్ష రాయగా 534 మంది పాసయ్యారు. ఇందులో జిల్లా 62 శాతం ఉత్తీర్ణత సాధించింది.
ఒంగోలులో డీఈఐఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24 నుంచి 27 వరకు జరుగుతాయని విద్యాశాఖ పరీక్షల విభాగం అధికారి కె. శివకుమార్ తెలిపారు. డైట్ మైనంపాడు కేంద్రంలో జరిగే పరీక్షకు 2022-24 బ్యాచ్ విద్యార్థులు హాజరవుతారన్నారు. ఉదయం 9-11.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలో సంరక్షణ కేంద్రమైన నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఉంది. ఇది దేశంలోనే 53 టైగర్ రిజర్వాయర్లలో పెద్దది. అయితే పులులకు ఆహారం తగ్గడంతో మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావు ఆధ్వర్యంలో నెక్కంటి అటవీ క్షేత్రాధికారి ఆరీఫ్ ఖాన్ 28 సాంబార్లు, 15 చుక్కల దుప్పులను కాకినాడ నుంచి తీసుకొచ్చారు. వాటిని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలినట్లు తెలిపారు.
మాజీ సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 22న శనివారం ఉదయం 10.30కి తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు , ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ హాజరుకానున్నారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Sorry, no posts matched your criteria.