Prakasam

News June 18, 2024

దర్శి: మాజీ ఎంపీటీసీ కోటిరెడ్డి మృతి

image

దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డిపాలెం కోటిరెడ్డి సోమవారం ఆనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు యలమందారెడ్డి వైసీపీ క్రీయాశీలక కార్యకర్తగా, జిల్లా వైసీపీ సేవాదళ్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ గ్రామానికి చేరుకుని కోటిరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి పలికారు.

News June 18, 2024

నేడు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

image

ప్రకాశం జిల్లాలో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే ఆస్కారం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. మరోవైపు, పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలోనూ వర్షాలు పడతాయని APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News June 17, 2024

కారంచేడు: స్వర్ణమ్మ తల్లికి వెయ్యి సంవత్సరాల చరిత్ర

image

వెయ్యి ఏళ్ల చరిత్ర కల్గిన స్వర్ణమ్మ తల్లికి స్వర్ణ గ్రామంతో అనుబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. పూర్వం వరదలు వచ్చినప్పుడు చీరాల నుంచి వరద నీరు స్వర్ణ గ్రామాన్ని ముంచెత్తితే స్వర్ణమ్మ తన కొంగును అడ్డు పెట్టి గ్రామాన్ని కాపాడిందని భక్తులు చెబుతూఉంటారు. స్వర్ణమ్మ తల్లి కోర్కెలు తీరుస్తుందని..ఏ శుభకార్యం జరిగినా తొలి అహ్వాన పత్రికను అమ్మవారికే సమర్పిస్తారని స్థానికులు డెబుతున్నారు.

News June 17, 2024

ప్రకాశం: వ్యవసాయ డిప్లమో కోర్సులకు నోటిఫికేషన్ 

image

వ్యవసాయ డిప్లమో కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆచార్య రంగా వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.సంధ్యారాణి తెలిపారు. కోర్సుల్లో చేరేవారు ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు 2023 ఆగస్టు 31 నాటికి 15 సంవత్సరాల నుంచి 22 వయస్సు కలిగి ఉండాలన్నారు.

News June 17, 2024

ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న రాజీనామాలు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. ఈక్రమంలో ఆ పార్టీకి చెందిన పలువురు తమ నామినేటెడ్ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా దర్శి మండలంలో 9 మంది ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు రాజీనామా చేశారు. తుమ్మెదలపాడు, తూర్పువీరాయపాలెం, బొట్లపాలెం, రాజంపల్లి, సామంతపూడి, తానంచింతల, బండి వెలిగండ్ల, చందలూరు, త్రిపురసుందరీపురం గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల నుంచి తప్పుకొన్నారు.

News June 17, 2024

ప్రకాశం జిల్లాలో నాలుగు రోజులు కరవు బృందం పర్యటన

image

రబీలో కరవు పరిస్థితిని పరిశీలించేందుకు రితేశ్ చౌహాన్ నేతృత్వంలోని కేంద్ర బృందం కరవు ప్రభావిత జిల్లాల్లో 18వతేది నుంచి 21 వరకు పర్యటించనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. 10 మంది సభ్యులు మూడు బృందాలుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడతారు. ఇందులోని ఒక బృందం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించి పరిస్థితి తెలుసుకుంటారని ఆయన తెలిపారు.

News June 16, 2024

ఏల్చూరులో తప్పిన పెను ప్రమాదం

image

మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఏల్చూరులోని పంట పొలాలకు మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ పక్కకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బోల్తా పడిన ట్రాక్టర్‌ను స్థానికులు పైకి లేపారు.

News June 16, 2024

ఒంగోలు: బక్రీదు పండుగపై అడిషనల్ SP కీలక సూచనలు

image

త్యాగానికి, సత్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినాన్ని సుఖ శాంతులతో జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ కె.నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. గోవుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు జిల్లాలో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.

News June 16, 2024

ఒంగోలు: గ్రామీణ ప్రాంత మహిళలకు మగ్గం వర్క్‌పై ఉచిత శిక్షణ

image

మహిళలకు మగ్గం వర్క్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ మహిళలకు ఈనెల 24 నుంచి నుంచి ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని తెలిపారు.

News June 16, 2024

చీరాల: సముద్ర తీరంలో విద్యార్థి గల్లంతు

image

చీరాల మండలం వాడరేవు సముద్ర తీర ప్రాంతంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. నూజివీడులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న 11 మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ కోసూరి కార్తీక్ (19), మైలవరపు కేదారేశ్వరరావు (19) అలల ధాటికి గల్లంతయ్యారు. మెరైన్ పోలీసుల సాయంతో కేదారేశ్వరరావును కాపాడగలిగారు. కార్తీక్ కోసం గాలిస్తున్నారు.