India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొదిలిలోని పి.హెచ్.సిలో పనిచేస్తున్న ANM విజయ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటిసిబ్బంది గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న ఓ ఆశ కార్యకర్తకు ANM విజయకు గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శనివారం ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ నిద్రమాత్రలు మింగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
కన్న తండ్రికి కుమారులు ఏకంగా గుడి కట్టిన ఘటన సీఎస్‌పురం మండలం కొండ్రాజుపల్లిలో జరిగింది. మట్లే బోడెయ్య, కొండమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. బోడెయ్య వ్యవసాయం చేసి కుమారులను చదివించారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు మాలకొండలరావు రైల్వేలో, చిన్న కుమారుడు సచివాలయంలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో 2021లో బోడెయ్య మృతి చెందగా.. కుమారులిద్దరు తమ పొలంలో బోడెయ్యకు గుర్తుగా గుడి కట్టి ఆయన విగ్రహాన్ని అందులో ఉంచారు.
గుడ్లూరు మండలం నరసాపురం- కొత్తపల్లి గ్రామాల రహదారిలోని అటవీ ప్రాంతంలో నరసాపురానికి చెందిన గిరిజన వృద్ధుడు తలపల రమణయ్య (60) దారుణ హత్యకు గురైన విషయం ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కాళ్లు చేతులు కట్టివేసి రమణయ్యను దారుణంగా దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న గుడ్లూరు పోలీసులు ఆ ప్రాంతాన్ని చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
చీరాల రామ్ నగర్ సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొనగా ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాంనగర్ వద్ద ఒక వేడుక జరుగుతుండడంతో ఒకవైపు రోడ్డుకు తాళ్లు కట్టగా రేపల్లె వెళుతున్న ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొంది. దీంతో బైకు నడుపుతున్న ఐటీసీ ఉద్యోగి బుచ్చిబాబు కిందపడగా .. తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన బుచ్చిబాబును గుంటూరుకు తరలించారు.
జంతు సంరక్షణ చట్టాలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జూన్ 17న బక్రీద్ పండగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. జంతువులను చట్టవిరుద్ధంగా వధించడాన్ని అరికట్టడానికి, జంతు సంరక్షణ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మద్యం మత్తులో ఓ వ్యక్తి గూడ్స్ రైలు కింద పడిన ఘటన గిద్దలూరు మండలం దిగువమెట్ట రైల్వే స్టేషన్‌కి సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. నంద్యాలకు చెందిన బాష అనే వ్యక్తి, మద్యం మత్తులో గుంటూరు వైపుగా వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రుడిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పదవికి పానుగంటి మురళి శనివారం రాజీనామా చేశారు.
ఆయన తన రాజీనామా లేఖను యార్డ్ సెక్రెటరీ కోటేశ్వరరావుకు అందజేశారు. పానుగంటి మురళితో పాటు మరో ఐదుగురు డైరెక్టర్లు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే యార్డు ఛైర్మన్‌తో పాటు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులకు డాక్టర్ మీర్జా షంషీర్ ఆలీబేగ్ ఇటీవలే రాజీనామా చేశారు.
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ మంత్రిగా కేబినెట్‌లో స్థానం లభించడంతో మండలంలోని మక్కెన వారి పాలెం ఎస్సీ కాలనీలో అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 1998 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీచేసి 3 సార్లు గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఎంపీగా ఓటమి చెందారు. 2019లో వైసీపీ తరఫున గెలిచారు. మళ్లీ 2024లో టీడీపీలో చేరి పోటీ చేసి గెలిచి మూడు పార్టీల తరఫున గెలిచిన ఏకైక ఎంపీగా ఆయన రికార్డ్ సాధించారు.
బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలోని పూల మార్కెట్ వద్ద గల రైల్వే గేట్ ఈనెల 21 వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల నిమిత్తం నేటి నుంచి 21వ తేదీ వరకు రైల్వే గేట్ నుంచి రాకపోకలు నిలిపివేయడం జరుగుతుందన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి స్టువర్టుపురం గేటు నుంచి రాకపోకలు సాగించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.