Prakasam

News May 18, 2024

తర్లుపాడు: బొలెరో – బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

తర్లపాడు మండలం సీతానాగులవరం గ్రామ సమీపంలో శనివారం బొలెరో వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో తర్లుపాడు ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 18, 2024

చీరాలలో 11 నెలల చిన్నారి మృతి

image

చీరాల మండలం విజయనగర కాలనీలో విషాదం చోటుచేసుకుంది. వినోద్, దివ్య దంపతుల కుమారుడు వియాన్ హన్స్(11 నెలలు) ఆడుకుంటూ.. నీటి మోటార్ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో నెలలో మొదటి పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఆ చిన్నారి.. విగత జీవుడై మృత్యుఒడికి చేరడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

News May 18, 2024

స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు: కలెక్టర్ దినేశ్

image

జిల్లాలోని స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలలో ఒంగోలు నుంచి కలెక్టర్ దినేశ్ కుమార్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యల గురించి కలెక్టర్ వివరించారు.

News May 17, 2024

బాపట్ల జిల్లాలో పర్యటించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఆయనకు కలెక్టర్ రంజిత్ బాష, ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. బాపట్లలో ఎన్నికలు జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎటువంటి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు.

News May 17, 2024

బాపట్ల: ఎన్నికల ఘర్షణలో 284 మందిపై కేసులు

image

బాపట్ల జిల్లాలో జరిగిన ఎన్నికల ఘర్షణలో 284 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 255 మందిని అదుపులోకి తీసుకొని నోటీసులు జారీ చేశామన్నారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

News May 17, 2024

కొరిశపాడులో పేలిన గ్యాస్ సిలిండర్

image

కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కుర్రవాని పాలెంరోడ్డులో ఉన్న మద్యం దుకాణం సమీపంలో వల్లపు నాగయ్యకు చెందిన బడ్డీ కొట్టులో సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశాడు. ఈ ప్రమాదంలో బడ్డీ కొట్టుతో పాటు అక్కడే ఉన్న ఓ ద్విచక్ర వాహనం తగలబడింది. అధికారులు ఆదుకోవాలని ఆయన వాపోయారు.

News May 17, 2024

త్రిపురాంతకం: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

త్రిపురాంతకం మండలంలో శుక్రవారం విషాదం నెలకొంది. గణపవరం గ్రామానికి చెందిన దళిత వ్యక్తి మాచర్ల కొండలు విద్యుత్‌ఘాతానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 17, 2024

ఒంగోలు: ఉచిత ఫొటోగ్రఫీపై శిక్షణ

image

ఒంగోలులోని రూడ్ సెట్ సంస్థలో ఈ నెల 22వ తేదీ నుంచి పురుషులకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 19 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు ఈ శిక్షణకు అర్హులు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆసక్తి కలవారు ఒంగోలులోని రూట్ సెట్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News May 17, 2024

ఓటు హక్కును వినియోగించుకోని ఎమ్మెల్యే బుర్రా

image

కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. మున్సిపాలిటీలోని మూడో వార్డు బూత్ నంబర్ 126లో నమోదైనా.. ఓటు వేయలేదు. నియోజకవర్గానికి ప్రథమ పౌరులైన తన ఓటు హక్కును వినియోగించుకోకపోవడంతో ప్రజాస్వామ్యవాదులు పలు విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎమ్మెల్యే వినియోగించుకోకపోవడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.

News May 17, 2024

కనిగిరి: రోడ్డు ప్రమాదం.. 8 మందికి గాయాలు

image

కనిగిరి మండలం ఎడవల్లి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రాలీ ఆటో ఢీకొనడంతో 8 మందికి గాయాలయ్యాయి. కనిగిరి నుంచి పొదిలి వైపు ప్రయాణికులతో వెళుతున్న ట్రాలీ ఆటో హైదరాబాదు నుంచి పామూరుకు వస్తున్న కారును ఎడవల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఢీకొట్టిన్నట్లు బాధితులు తెలిపారు. 108 ద్వారా క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.