India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కందుకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన ఇనకల్లు నరసింహం అనే యువకుడు రెండు రోజుల క్రితం గ్రామంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు తెలియచేసే ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ విద్యుత్ షాక్తో మరణించాడు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం సాయంత్రం ఆ కుటుంబాన్ని పరామర్శించి, నరసింహం తల్లి అనురాధను ఓదార్చారు. రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆమెకు అందించారు.
యర్రగొండపాలెం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను దర్శి వ్యవసాయ సంచాలకులు కె. బాలాజీ నాయక్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాకును పరిశీలించారు. రైతులు ఎటువంటి విత్తనాలు కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనుమతులు లేని రూ.5లక్షల విలువగల ఎరువులు సీజ్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ శేషి రెడ్డి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురం మండలంలోని పిచ్చిగుంట్లపల్లి గ్రామ శివారులో పాడుబడిన బావిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వెంకటేశ్వర నాయక్ మృతి చెందిన మహిళను యాచకురాలిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంత్రి వర్గ జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ ఎన్నికైన విషయం తెలిసిందే. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గొట్టిపాటి, హ్యాట్రిక్ నమోదు చేసిన వీరాంజనేయకు మొదటిసారి మంత్రి పదవులు దక్కాయ. ఇప్పుడు వారికి సీఎం చంద్రబాబు ఏ శాఖలు కేటాయిస్తారన్నది జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. వారికి ఏ శాఖలు దక్కుతాయనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఒంగోలు నెహ్రు నగర్లో 15 ఏళ్ల బాలుడు బుధవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర్లకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు శ్రీకాంత్(15) ఉన్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర తెలిపారు. గురువారం నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవడంతో ఆమె ప్రైవేటు పాఠశాలలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను ప్రైవేటు పాఠశాలల తప్పకుండా పాటించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్చే ముందు ప్రభుత్వ గుర్తింపు, రిజిస్ట్రేషన్ వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు.
యర్రగొండపాలెంకు చెందిన రాష్ట్ర బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పోలెబోయిన రామారావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రాజీనామా లేఖను పంపినట్లు బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని, మాజీ సీఎం జగన్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ వెంట నడుస్తామని స్పష్టం చేశారు.
ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా విద్యార్థి సత్తా చాటాడు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో పుల్లల చెరువు మండలం అక్కపాలేనికి చెందిన కొమిరిశెట్టి ప్రభాస్ పదో ర్యాంక్ సాధించాడు. ఆయన తండ్రి పెద్ద పోలయ్య గుంటూరు మిర్చియార్డులో చిరు వ్యాపారిగా పని చేస్తూ జీవనం సాగించేవారు. కంప్యూటర్ సైన్స్ రంగంలో రాణించాలన్నదే తన లక్ష్యమని ప్రభాస్ తెలిపాడు. విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ బుధవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘ గొట్టిపాటి రవి కుమార్ అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.
కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి బుధవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘ డోలా బాల వీరాంజనేయస్వామి అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.
Sorry, no posts matched your criteria.