Prakasam

News May 14, 2024

ప్రకాశం జిల్లా పోలింగ్ శాతం 82.63

image

జిల్లాలో పోలింగ్ చెదురుమదురు సంఘటనలు తప్ప, ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారి, కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. వై.పాలెం 81.58% దర్శి 83.59, సంతనూతలపాడు 86.17, ఒంగోలు 82.15, కొండపి 79.93, మార్కాపురం 84.08, గిద్దలూరు 81.43, కనిగిరి 81.87, అద్దంకి 86.75, చీరాల 83.32, పర్చూరు 80.50, కందుకూరు 82.19శాతం ఉంది. కాగా 82.63 జిల్లాలో నమోదయిందని తెలిపారు. ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.

News May 13, 2024

కారంచేడు: బాధను దిగమింగి ఓటు వేసిన మహిళ

image

కారంచేడు మండల పరిధిలో ఆదివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో వీవోఏగా పనిచేస్తున్న గర్నెపూడి చిట్టెమ్మ భర్త సింగయ్య సోమవారం అనారోగ్యంతో చనిపోయాడు. అయినప్పటికీ ఆమె ఆ బాధను దిగమింగుకుని ఓటు వేసేందుకు కారంచేడు గ్రామంలోని 178వ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఘటన తెలిసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

News May 13, 2024

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 11 గంటలకు పోలింగ్ శాతం

image

☛ దర్శి: 26.52%
☛ గిద్దలూరు: 25.97% ☛ కనిగిరి: 26.45%
☛ కొండపి: 12.00%
☛ మార్కాపురం : 25.09%
☛ ఒంగోలు: 25.06%
☛ సంతనూతలపాడు: 27.89%
☛ యర్రగొండపాలెం: 22.63%
☛ అద్దంకి: 27.80%
☛ చీరాల: 23.50% ☛ పర్చూరు: 29.33%
☛ కందుకూరు: 23.62%

News May 13, 2024

ప్రకాశం జిల్లాలో ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ శాతం

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. పోలింగ్ శాతం ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతాన్ని నియోజకవర్గాల వారిగా పరిశీలిస్తే.. ✒ దర్శి: 9.50% ✒ గిద్దలూరు: 9.57% ✒ కనిగిరి: 8.78% ✒ కొండపి: 12.00% ✒ మార్కాపురం : 5.69% ✒ ఒంగోలు: 12.53% ✒ సంతనూతలపాడు: 11.00% ✒ యర్రగొండపాలెం: 3.07% ✒ అద్దంకి: 11.20% ✒ చీరాల: 11.08% ✒ పర్చూరు 12.01%

News May 13, 2024

చినగంజాం: రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి

image

చినగంజాం పరిధిలోని రొంపేరు కాలువ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెంకటేశ్వర్లు, అతని భార్య భారతి, ముగ్గురు కుమార్తెలు దేవీసంద్య (12), జశ్విత (10), అశ్వని (7)లు ఉప్పుగుండూరు నుంచి బాపట్ల బయలుదేరారు. వీరి ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో దేవీసంధ్య అశ్వినీలకు అక్కడికక్కడే మృతిచెందారు.

News May 13, 2024

ప్రకాశం జిల్లాలో మొదలైన మాక్ పోలింగ్

image

ప్రకాశం జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో మాక్ పోలింగ్‌ ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News May 12, 2024

ప్రకాశం జిల్లాలో 18,22,470 మంది ఓటర్లు

image

రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా పరిధిలోని ఒంగోలు లోక్ సభ పరిధిలోని 8 నియోజకవర్గాల్లో 18,22,470 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం జిల్లాలో 2,183 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండటంతో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే ఎన్నికల నిర్వహణకు 14,768 మంది ఉద్యోగులను నియమించారు.

News May 12, 2024

కంభం రైల్వే స్టేషన్ లో వృద్ధురాలు మృతి

image

కంభం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం అరుగుపై ఆదివారం నిద్రిస్తున్న గుర్తు తెలియని ఓ వృద్ధ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ‌మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 12, 2024

ఒంగోలు నగరంలో బియ్యం రాజకీయం షురూ

image

ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే డబ్బు పంపిణీలో ప్రధాన పార్టీలు పోటీపడ్డాయి. ఓ ప్రధాన పార్టీ మూడు రోజుల నుంచి బియ్యం బస్తాలు పంచుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆదివారం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ నుంచి 5వేల బియ్యం బస్తాలను ఒంగోలు తరలిస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకోవడం సంచలనమైంది.

News May 12, 2024

ప్రకాశం జిల్లాలో 28 బార్లు, 178 మద్యం దుకాణాలు బంద్

image

జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేయించినట్లు ఈఎస్ టి.శౌరి తెలిపారు. జిల్లాలో మొత్తం 28 బార్లు, 178 మద్యం దుకాణాలను సీజ్ చేశామన్నారు. ఎన్నికలు అయ్యే వరకు మద్యం విక్రయాలు చేయకూడదని ఎన్నికల సంఘం నిబంధనలు విధించడంతో చర్యలు తీసుకున్నారు.