Prakasam

News October 12, 2024

ప్రకాశం జిల్లాలో 28 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మద్యం తాగి వాహనాలను నడిపే వారిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. జిల్లాలో బ్రీత్ ఎనలైజర్ ద్వారా తనిఖీలు నిర్వహించి, 28 కేసులను నమోదు చేశారు. అలాగే సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 468 మంది వాహనదారులకు జరిమానా విధించామన్నారు. మొత్తం రూ.1,00,365ల జరిమానా వసూలైనట్లు, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలన్నారు.

News October 12, 2024

ప్రకాశం: పతనమైన టమాటా ధర.!

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో టమాటా ఉత్పత్తి తగ్గడం వలన సెంచరీకి చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గిద్దలూరు పట్టణంలో పండుగ సమయంలో టమాటా ధర ఒక్కసారిగా 1kg రూ.80 నుంచి రూ.30కి పడిపోయింది. దీంతో సామాన్య ప్రజలకు ఊరట లభించింది. స్థానికంగా ఉత్పత్తి పెరగడంతో టమాటా ఉత్పత్తి కూడా పెరిగిందని, దీని ద్వారా టమాటా ధరలు తగ్గాయని వ్యాపారస్థులు తెలియజేశారు.

News October 12, 2024

ప్రకాశం జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తుల వివరాలు.!

image

➤ఒంగోలులో 34 దుకాణాలకు 590 దరఖాస్తులు
➤చీమకుర్తిలో 16 దుకాణాలకు 351
➤సింగరాయకొండలో 14 దుకాణాలకు 385
➤పొదిలిలో 16 దుకాణాలకు 291
➤దర్శిలో 23 దుకాణాలకు 375
➤మార్కాపురంలో 13 దుకాణాలకు 320
➤కనిగిరిలో 19 దుకాణాలకు 387
➤గిద్దలూరులో 13 దుకాణాలకు 231
➤కంభంలో 10 దుకాణాలకు 239
➤యర్రగొండపాలెంలో 13దుకాణాలకు 247 దరఖాస్తులు
మొత్తం 171 దుకాణాలకు 3,416 దరఖాస్తులు అందాయి.

News October 12, 2024

ప్రకాశం జిల్లాలో 171 దుకాణాలకు 3,416 దరఖాస్తులు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 171 నూతన ప్రైవేటు మద్యం దుకాణాలకు 3,416 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ఒంగోలులో 34 దుకాణాలకు 590 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా గిద్దలూరులో 13 దుకాణాలకు 231 దరఖాస్తు మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.68.32 కోట్ల ఆదాయం వచ్చింది.

News October 12, 2024

లోక్ సభ స్పీకర్‌తో బాపట్ల ఎంపీ భేటీ

image

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను న్యూఢిల్లీలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్ను శాలువాతో ఎంపీ కృష్ణ ప్రసాద్ సత్కరించి అభినందనలు తెలిపారు. తన పార్లమెంట్ పరిధిలోని అద్దంకి, పర్చూరు, చీరాల, బాపట్ల, సంత నూతలపాడు, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో నెలకొన్న పలు సమస్యలను ఆయనతో చర్చించారు.

News October 12, 2024

కొండపి పొగాకు బోర్డులో ముగిసిన కొనుగోళ్లు

image

శుక్రవారం రోజుతో కొండపి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 2023-24కు సంబందించి పొగాకు కొనుగోళ్లు ముగిశాయని వేలం కేంద్రం నిర్వహణ అధికారి సునిల్ కుమార్ తెలిపారు. కొనుగోళ్లు 154 రోజుల పాటు నిర్వహించామని, వేలంలో 50 కంపినీలు పాల్గొన్నాయన్నారు. రూ.467కోట్ల కొనుగోళ్లు జరిగాయని ఆయన వెల్లడించారు. రోజుకు సగటున 873 బేళ్ళ అమ్మకాలు జరిగాయన్నారు.

News October 11, 2024

మార్కాపురం: డ్రైనేజీలో పసికందు

image

మార్కాపురంలో మానవత్వం మంట కలిసింది. పట్టణంలోని కంభం సెంటర్ సమీపంలో ఉన్న డ్రైనేజీ కాలువలో అప్పుడే పుట్టిన శిశువును డ్రైనేజీ కాలవలు శుభ్రం చేస్తుండగా కాలువలో మున్సిపల్ కార్మికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత పసికందును పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా ఎవరో కాలువలో పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News October 11, 2024

సింగరాయకొండ: ‘నా బిడ్డ చావుకు నా భర్తే కారణం’

image

సింగరాయకొండ డ్రైవర్ పేటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సీఐ హజరత్తయ్య వివరాల ప్రకారం.. సందాని, రషీదా దంపతులకు రెండో సంతానంలోనూ ఆడపిల్ల ఏడో నెలలో అనారోగ్యంతో పుట్టింది. తన భర్త సరైన వైద్యం చేయించకపోవడంతో బిడ్డ చనిపోయిందని తల్లి రషీదా ఆరోపించింది. దీంతో భర్త సందాని, అత్త మామలే చిన్నారి మరణానికి కారణమని సింగరాయకొండ పోలిసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

News October 11, 2024

ప్రకాశం: మద్యం దరఖాస్తులు అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ

image

ప్రకాశం జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు అధికార వెబ్‌సైట్ ప్రకారం.. కనిగిరి రూరల్‌లోని షాప్ నంబర్ 123కు అత్యల్పంగా 4 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా చీమకుర్తి రూరల్‌లోని షాప్ నంబర్ 58కి 43మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆ షాపునకు రూ.కోటీ 16 లక్షలు ఫీజు రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇవాళ చివరి రోజు కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

News October 11, 2024

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో గొట్టిపాటి లక్ష్మీ భేటీ

image

రాష్ట్ర ట్రాన్స్ పోర్టు & స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని దర్శి TDP ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శిలోని మినీ స్టేడియం ఇతరత్రా అంశాలపై మంత్రికి ఆమె వివరించారు. దర్శికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రిని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం మంత్రికి గౌతమ బుద్ధుడి ప్రతిమ బహూకరించారు.