Prakasam

News May 8, 2024

మార్కాపురంలో పిడుగుపాటుకు 100 గొర్రెల మృతి

image

మార్కాపురం మండలంలోని మాల్యవంతునిపాడు గ్రామంలో పిడుగుపాటుకు గురై గొర్రెలు మృతి చెందాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన పలువురి గొర్రెల మందపై పిడుగు పడింది. దాదాపు 100 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో సుమారు రూ.8 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.

News May 8, 2024

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మార్కాపురానికి చెందిన రామకృష్ణ, సిద్దయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 8, 2024

చీరాలలో ఆస్తిపంచలేదని తండ్రిపై కొడుకు దాడి

image

ఆస్తి పంచలేదని తండ్రిపై కుమారుడు దాడిచేసి గాయపరిచిన సంఘటన చీరాల మండలం ఈపూరుపాలెంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సీతారామపేటకు చెందిన శ్రీనివాసరావు కుమారుడు నాగచంద్ర కొంతకాలంగా తనకు రావాల్సిన ఆస్తి పంచమని కోరుతున్నారు. ఈనేపథ్యంలో తండ్రి శ్రీనివాసరావుపై కుమారుడు నాగచంద్ర సోమవారం దాడి చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 8, 2024

సంతమాగులూరు: పిడుగుపాటుకు కాపరి మృతి

image

ఎండలకు ఉపశమనంలా వచ్చిన వాన కొందరికి సంతోషం, మరికొందరిలో విషాదం నింపింది. పల్నాడు జిల్లా, కుందుర్రివారిపాలెంలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో గ్రామ సమీపంలోని పంట పొలాల్లో గొర్రెలను మేపుకుంటున్న సంతమాగులూరుకు చెందిన జమ్ముల గోపి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. బతుకుతెరువు కోసం గొర్రెలు మేపుకుంటూ వెళ్లి గోపి మృతి చెందాడు. దీంతో సంతమాగులూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 8, 2024

ప్రకాశం జిల్లాలో 80 శాతం ఓటరు స్లిప్పులు పంపిణీ

image

జిల్లాలో నేటి వరకు 80 శాతం మేర ఓటరు స్లిప్పులను పంపిణీ చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్‌ దినేష్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూములో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 18,22,470 మంది ఓటర్లు ఉండగా.. 14,46,495 మందికి ఓటరు స్లిప్పులను అందజేశామని వెల్లడించారు. రెండు రోజుల్లో వంద శాతం పంపిణీ చేస్తామన్నారు.

News May 7, 2024

కనిగిరి: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

image

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శంకవరంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు దేవరాజుగట్టు నరసింహులు(32) అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 7, 2024

ప్రకాశం: పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.299

image

జిల్లాలో కనిగిరి మినహా మిగిలిన అన్ని కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన పొగాకు వేలంలో కిలో రూ.299 చొప్పున గరిష్ఠ ధర లభించింది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 4,394 బేళ్లు రాగా.. వాటిలో 3,822, ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలో 4,604 రాగా, 3,925 బేళ్లను కొనుగులు చేశారు. వేలం గత పదిహేను రోజుల వ్యవధిలో ఊపందుకోవడం గమనార్హం.

News May 7, 2024

ప్రకాశం: అడ్డు వస్తున్నాడని హత్య.. యావజ్జీవ జైలుశిక్ష

image

భర్తను హత్య చేసిన భార్యకు, ఆమె ప్రియుడికి ఒంగోలు సెషన్స్ జడ్జి యావజ్జీవ జైలుశిక్ష విధించారు. పర్చూరు మండలం చెరుకూరుకు చెందిన బధిర యువకుడు నవాబు సురేశ్‌కు శివ అనే మహిళతో 14 ఏళ్ల కిందట వివాహమైంది. అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఆరుద్ర సాంబశివరావుతో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో సురేశ్‌ను నిందితుడు సాంబశివరావు హత్య చేశాడు.

News May 7, 2024

ప్రకాశం: ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

image

పుల్లలచెరువు మం, ఆర్.ఉమ్మడివరానికి చెందిన ప్రేమ్ కుమార్(35) భార్యా పిల్లలతో గుంటూరులో నివాసం ఉంటున్నారు. అతని భార్య సమోసాలు తయారుచేసే పనికి వెళ్తూ, షాపు యజమానికి దగ్గరైంది. ఈ క్రమంలో భర్తను అడ్డుతొలగించాలనుకొని ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ప్రియుడి తమ్ముడు, మరో వ్యక్తి ప్రేమ్‌ను కొర్నెపాడు వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి కొట్టి చంపేశారు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు కేసును ఛేదించారు.

News May 7, 2024

కందుకూరు: కొడుకు MLA అభ్యర్థి.. తండ్రి ప్రత్యర్థి పార్టీ

image

కందుకూరు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో మాజీ జేడీ లక్ష్మీనారాయణకు చెందిన జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి పొడపాటి శివకుమార్(చక్రి) సింపుల్‌గా ఒక్కడే ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే.. శివకుమార్‌కు వ్యతిరేకంగా ఆయన తండ్రి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అయిన పొడపాటి నాగేశ్వరరావు ఇటీవల టీడీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేస్తుండటం విశేషం.