Prakasam

News May 6, 2024

ఒంగోలు: ‘8వ తేదీలోగా పరీక్షలకు ఫీజు చెల్లించాలి’

image

D.El.Ed 4వ సెమిస్టర్ పరీక్షలకు ప్రైవేటు విద్యార్థులు ఈనెల 8వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ నెలలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా 4 సబ్జెక్టులకు రూ.250, 3 సబ్జెక్టులకు రూ.175, రెండింటికి రూ.150 ఒక సబ్జెక్టు రూ.125 చెల్లించాలన్నారు. అపరాధ రుసుము రూ.50తో ఈ నెల 15లోగా ఫీజు చెల్లించాలన్నారు.

News May 6, 2024

ఎస్సీ, ఎస్టీ ఓటర్లను అడ్డుకుంటే కేసులు పెడతాం: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక పోలింగ్లో ఎస్సీ, ఎస్టీలను ఓటు వేయకుండా అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ దినేశ్ కుమార్ హెచ్చరించారు. ఓటు వేయకుండా అవాంతరాలు కల్పించినా, తమకు చూపించి ఓటువేయాలని బెదిరించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆదివారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో దళితసంఘం నాయకులు ప్రచురించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.

News May 6, 2024

ప్రకాశం: ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తాయి?

image

ఎన్నికలు తుది అంఖానికి చేరుకున్నాయి. మరో 7 రోజుల్లో పోలీంగ్ మొదలవుతుంది. దీంతో నాయకులు పథకాలు, హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. 2014 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో YCP 6 స్థానాలు, TDP 5, ఒకరు స్వతంత్రులుగా గెలుపొందారు. 2019లో 8 స్థానాలు YCP గెలవగా, TDP 4 స్థానాలకు పరిమితమైంది. ఈసారి ప్రధాన పార్టీలైన YCP, TDP కూటమి, కాంగ్రెస్ ప్రకాశం జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు?

News May 6, 2024

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

అద్దంకి పట్టణంలో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ముండ్లమూరు మండలంలోని సింగన్నపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అతడిని చికిత్స నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 6, 2024

ప్రకాశం: వడదెబ్బతో సర్పంచ్‌ మృతి

image

తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మురారి సుబ్బమ్మ(65) ఆదివారం వడదెబ్బ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక సోమ్మసిల్లి పడిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు ఒంగోలులోని వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సర్పంచ్‌ సుబ్బమ్మ కోలుకోలేక మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News May 6, 2024

ప్రకాశం: రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

image

ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, చింతలతుమ్మల బయలు గ్రామం మధ్య ఘాట్ రోడ్‌లో ప్రమాదం జరిగింది. మూలమలుపు వద్ద మంగళగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం వెళ్తుండగా, శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మూలమలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుంటూరు డొంక రోడ్డుకు చెందిన వి.రాజారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.

News May 6, 2024

ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కందుకూరులోని‌ బాలికల హైస్కూలులో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను సబ్‌ కలెక్టర్‌ విద్యాధరితో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఓటింగ్‌ సరళిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

News May 5, 2024

బీసీల రక్షణ కోసం బీసీ చట్టం తెస్తాం: దేవినేని

image

బీసీల రక్షణ కోసం బీసీ చట్టం ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఎర్రగొండపాలెంలోనీ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు టీడీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎరిక్షన్ బాబును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

News May 5, 2024

ఒంగోలు: సంతకం చేశారు.. స్టాంప్ మరిచారు

image

ఒంగోలులో ఆర్‌ఎం స్కూల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లలో లోపాలు తలెత్తడంతో కొద్దిసేపు సందిగ్ధత నెలకొంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటు వేసే ముందు వారు సమర్పించే పత్రాల్లో గెజిటెడ్ సంతకంతో పాటు స్టాంప్‌కూడా ఉండాలి. కానీ ఆర్‌ఎం స్కూల్‌లో 16 మంది ఉద్యోగుల పత్రాలపై గెజిటెడ్ సంతకం ఉంది. కానీ స్టాంప్ లేకపోవడాన్ని గుర్తించారు. ఉద్యోగులు కొద్దిసేపు నిరసన తెలిపాక స్టాంప్ వేసి ఓటు వేయించారు.

News May 5, 2024

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

అద్దంకిలోని సింగరకొండ రోడ్డులో ఆదివారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కావలికి చెందిన రాజేష్, నెల్లూరుకి చెందిన చరణ్‌లు ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వెళుతుండగా అద్దంకి దగ్గరకు వచ్చేసరికి డివైడర్‌ను ఢీ కొట్టారు. ప్రమాదంలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా, చరణ్‌ను 108లో ఒంగోలు తీసుకు వెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.