India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదివారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా అక్టోబర్ 2024కి సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు, డీఎల్‌డీఓలు, ఎంపీడీఓలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 1న పెన్షన్ పంపిణీ 100 శాతం పంపిణీ చేయాలన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ఎక్సైజ్ శాఖ స్టేషన్లకు ఇన్‌స్పెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
➤ ఒంగోలు – A. లినా
➤ మార్కాపురం – వెంకటరెడ్డి
➤ చీమకుర్తి – M. సుకన్య
➤ సింగరాయకొండ – M. శివకుమారి
➤ పొదిలి – T. అరుణకుమారి
➤ దర్శి – శ్రీనివాసరావు
➤ కనిగిరి – R. విజయభాస్కరరావు
➤ గిద్దలూరు – M. జయరావు
➤ కంభం – కొండారెడ్డి
➤ యర్రగొండపాలెం – CH శ్రీనివాసులు
➤ కందుకూరు – వెంకటరావు
ప్రకాశం జిల్లా వైసీపీ నూతన అధ్యక్షులుగా నియమితులైన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్టోబర్ 4 ఉదయం 10 గంటలకు, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రకాశం జిల్లాలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైసీపీ కార్యాలయ ప్రతినిధులు ఆదివారం తెలిపారు.
పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే తమ ధ్యేయమని ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్స్ సహకారంతో శనివారం జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో పోలీసు అధికారులకు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లచే 474 మందికి పలు వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స చేసి ఉచితంగా మందులు అందించారు.
వచ్చే నెల 1వ తేదీన ఉదయం 5 గంటల నుంచే ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీపై డీఎల్‌డీఓలు, అన్ని మండలాల ఎంపీడీవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబరు 2వ తేదీ మహాత్మా గాంధీజీ జయంతి ప్రభుత్వ సెలవు దినము కావున 1వతేదీనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మార్కాపురంలో ఈ నెల 25న జరిగిన నియోజకవర్గం స్థాయి స్కూల్ గేమ్స్‌లో పొదిలి విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. వాలీబాల్ అండర్ -17, అండర్-14 విభాగంలో విజయం సాధించి జిల్లా వాలీబాల్ టీంకి అండర్ -17లో పి. చరణ్, డి. హర్షవర్ధన్ పి. బ్రహ్మ చరణ్, అండర్ -14 విభాగంలో ఏ.సాత్విక్, వ. జీవన్ చందులు ఎంపికైనట్లు ఆ పాఠశాల పీడీ కె. స్టీఫెన్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
రాబోవు దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని, పోలీసు అధికారులను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అనధికారికంగా బాణసంచా తయారీ, నిల్వలు, రవాణా వంటి వాటిని నియంత్రించి ముందస్తు ప్రమాదాలను నిలువరించే దిశగా వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణ కోసం జిల్లాలో కేంద్రాలను ఎంపిక చేసినట్లు DEO సుభద్ర పేర్కొన్నారు. అక్టోబర్ 3&21 వరకు ఉదయం 9.30 నుంచి, మధ్యాహ్నం 2.30 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. (1)పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులోని కృష్ణచైతన్య విద్యాసంస్థ, (2) మార్కాపురం మండలం దరిమడుగులోని జార్జి కళాశాల, (3) ఒంగోలులో నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చి సంస్థ, బ్రిలియంట్స్‌లో పరీక్షలు జరుగుతాయన్నారు.
ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్ కింద కౌలు రైతులకు 45వేల కార్డులను జారీ చేసేందుకు లక్ష్యంగా ఉంచుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలో 42,033 కార్డులను జారీ చేయడం జరిగిందని, కౌలు రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగిందన్నారు.
ప్రకాశం జిల్లా అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన బాలుడి హత్య కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించి, ప్రస్తుతం పామూరు సీఐ భీమా నాయక్, అప్పటి అర్థవీడు ఎస్సై రవీంద్రనాథ్ రెడ్డి, కోర్టు లైజన్ కానిస్టేబుల్ వరదయ్యలను ఎస్పీ ఏర్ దామోదర్ శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పోలీసు అధికారులకు ఎస్పీ ఆఫీసులో ప్రశంశా పత్రాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి గుర్తింపు లభిస్తుందన్నారు.
Sorry, no posts matched your criteria.