Prakasam

News June 1, 2024

సింగరాయకొండ: వడదెబ్బతో వృద్ధురాలు మృతి

image

సింగరాయకొండ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా ఉన్న బస్ షెల్టర్ వద్ద ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని ఆవులవారిపాలెంకు చెందిన పోకూరి లక్ష్మమ్మ (80) కుటుంబసభ్యులు మరణించడంతో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రెండు రోజుల నుంచి ఎండలు అధికంగా ఉండడంతో ఆ ఎండల తాకిడికి తట్టుకోలేక వడదెబ్బతో మృతి చెందిందని తెలిపారు.

News June 1, 2024

చీమకుర్తి: రోడ్డు ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి

image

చీమకుర్తి మండలం పడమటి నాయుడుపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం ఐజాక్ (12) తన తండ్రి దగ్గర బైకు తీసుకొని స్నేహితులతో అధిక స్పీడుతో నడపగా, కంట్రోల్ తప్పి కరెంటు పోల్‌ను ఢీకొట్టాడు. దీంతో ఐజాక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు చిన్నారులు చందు, ఆనంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని చీమకుర్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

News June 1, 2024

కురిచేడు: బీరు సీసాతో దాడి.. వ్యక్తి మృతి

image

జూదం ఆడుతూ వివాదం చెలరేగి జరిగిన దాడిలో గాయపడిన వ్యక్తి శనివారం ఉదయం మృతి చెందాడు. కురిచేడు మండలం బోధనంపాడులో 108 వాహన డ్రైవర్ అబుదావలి, గోవింద రమేశ్, చింత పిచ్చెలు మద్యం తాగి జూదం ఆడుతున్నారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. అబుదావలి గొంతు మీద రమేశ్, పిచ్చేలు కాలు వేసి తొక్కి బీరు సీసాతో దాడి చేశారు. దీంతో అబుదావలి తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలోనే మృతి చెందాడు.

News June 1, 2024

ఒంగోలులో కౌంటింగ్.. వాటికి భలే గిరాకీ

image

ప్రస్తుత చర్చంతా ఎన్నికల ఓట్ల లెక్కింపుపైనే అందరి దృష్టి. ఎవరు గెలుస్తారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అధికారంలో ఉండేది ఎవరా అని చర్చించుకుంటున్నారు. ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో 4న ఓట్ల లెక్కింపు చేపట్టనుండటంతో చుట్టు పక్కల లాడ్జీలకు గిరాకీ పెరిగింది. ఒంగోలు సమీపంలో సమారు 50 వరకు హోటళ్లు, లాడ్జిలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న జిల్లా వాసులు ఇప్పటికే ఒంగోలుకు చేరుకున్నారు.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. ప్రకాశం జిల్లాలో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం ప్రకాశం జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. దీంతో సీట్లపై కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

News June 1, 2024

మార్కాపురంలో రూ.34 లక్షల ఘరానా మోసం

image

టెక్నాలజీ పుణ్యమా అంటూ అమాయకులను బుట్టలో వేసుకొని నిండా ముంచుతున్నారు సైబర్ నేరగాళ్లు. మార్కాపురం పట్టణంలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాడు సోషల్ మీడియాలో వచ్చిన లింకును ఓపెన్ చేస్తే షేర్ మార్కెట్లో లాభాలు వస్తాయని బ్యాంకు ఉద్యోగికి టోకరా వేసి, ఓ ఉద్యోగి నుంచి రూ.34 లక్షలు కాజేశాడు. రోజులు గడుస్తున్నా డబ్బుల విషయంలో స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 31, 2024

కారంచేడు: లిఫ్ట్ అడిగాడు.. ఫోన్ కొట్టేశాడు

image

చీరాలలో ఓ వ్యక్తి పర్చూరు వరకు లిఫ్ట్ కావాలని లారీని ఆపాడు. లారీ డ్రైవర్ మానవతా దృక్పథంతో అతడిని ఎక్కించుకున్నాడు. కారంచేడు కాలువ సెంటర్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్ మంచినీటి కోసం కిందకి దిగాడు. అదే అదునుగా భావించి లారీలో ఉన్న డ్రైవర్ ఫోన్ తీసుకొని పరారయ్యాడు. ఆ వ్యక్తిని వెతుకుతుండగా కొద్ది దూరంలో ఫోన్ పడేసి పరారయ్యాడు.

News May 31, 2024

కందుకూరు: పోలీస్ స్టేషన్‌కు చేరిన సచివాలయం ప్రేమ

image

కందుకూరు 8 వార్డు సచివాలయంలో పనిచేస్తున్న తనను అదే సచివాలయంలో విధులు నిర్వహించే అడ్మిన్ నమ్మించి మోసం చేశాడని మహిళా ఉద్యోగి పోలీసులను ఆశ్రయించింది. ఆ వ్యక్తి ఆమెతో రెండు ఏళ్ళ పాటు ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లి చేసుకోమని అడిగితే మాట దాటేస్తూ..  పెళ్లి చేసుకునేది లేదంటూ చెప్పడంతో చేసేది లేక పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు.

News May 31, 2024

పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన ఏల్చూరు యువతి

image

మంగళగిరిలో ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు 11వ ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ & బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఈ పోటీలలో సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన పరుచూరి కుమారి నంద పాల్గొని సత్తా చాటింది. సీనియర్ మహిళల 76 కేజీల పవర్ లిప్టింగ్ విభాగంలో, అలాగే బెంచ్ ప్రైస్ ఛాంపియన్ షిప్ పోటీలో పాల్గొని రెండు సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో ఆమెను గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.

News May 31, 2024

ప్రకాశం: మద్యం మత్తులో ఘర్షణ.. బీరు సీసాతో దాడి

image

కురిచేడు మండలంలోని బోధనంపాడులో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 108 అంబులెన్స్ డ్రైవర్ అబుదావలిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బీరు సీసాతో దాడి చేశాడు. మద్యం మత్తులో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణ వల్లే ఈ దాడి జరిగినట్లుగా స్థానిక ప్రజలు తెలిపారు. అబుదావలి పరిస్థితి విషమంగా ఉండటంతో దర్శి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.