Prakasam

News April 30, 2024

ప్రకాశం జిల్లా రాజకీయ వేడి పులుముకుంది

image

ప్రకాశం జిల్లాలో ఇవాళ నారా లోకేశ్ ఒంగోలు, పవన్ కళ్యాణ్ గిద్దలూరు, దర్శి, ఒంగోలు, సీఎం జగన్ కొండపి, నందమూరి బాలకృష్ణ సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీంతో అభ్యర్థులు జనసమీకరణలు చేస్తున్నారు. ఇక పోలీసులు వీరి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతను రెట్టింపు చేశారు. ఒకేసారి జిల్లాకు నలుగురు రావడంతో జిల్లాలో రాజకీయ వేడి పులుముకుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

News April 30, 2024

ప్రకాశం: బస్సు ఢీకొని విద్యార్థి మృతి

image

మానవత్వం మంటకలిసిన రోజు. ఓ క్షతగాత్రుడు రోడ్డుపై రక్తమోడుతున్నా ఎవరూ పట్టించికోలేదు. తోటి స్నేహితులు ఎంత ప్రయత్నించిన కాపాడుకోలేకపోయారు. ఒంగోలులోని ఓ కళాశాల ఎదురుగా విద్యార్థి వెంకటేశ్ రోడ్డు దాటుతూ ఉండగా ఓ కాలేజ్ బస్సు ఢీకొనడందో పక్కనే ఉన్న డివైడర్‌పై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. తోటి విద్యార్థులు అతడిని వెంటనే రిమ్స్‌కు తరలించినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు.

News April 30, 2024

ప్రకాశం: తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు

image

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా అన్నారు. తనిఖీల పేరుతో సామాన్య జనానికి ఇబ్బంది కలిగించరాదని స్పష్టం చేశారు. సోమవారం ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగేలా జిల్లా యంత్రాంగం చేపట్టినపై చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ దినేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

News April 29, 2024

గిద్దలూరు: వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి

image

కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో విషాదం నెలకొంది. ఉపాధి హామీ పనికి వెళ్లిన వృద్ధుడు బాలయ్య(73) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. నల్లగుంట్ల సమీపంలో ఉదయాన్నే ఉపాధి హామీ పనికి వెళ్లిన బాలయ్య పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు గమనించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బాలయ్యను తరలించారు. వైద్యలు పరీక్షించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 

News April 29, 2024

ప్రకాశం: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

image

పీసీపల్లి మండలం వరిమడుగుకు చెందిన కొడవటిగంటి శాంసన్(34) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వెంగళాయపల్లి-దరిమడుగు గ్రామాల మధ్యలో ఆదివారం అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ బాబు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కనిగిరి వైద్యశాలకు తరలించారు.

News April 29, 2024

అద్దంకిలో కరణం వర్గీయుల దారెటు?

image

అద్దంకి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా గట్టి పట్టు ఉన్న నేత, అన్ని మండలాలలో ఆయనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేదరమెట్ల గ్రామం లాంటి మేజర్ పంచాయతీలలో, ఆయనకు కుడి భుజంగా మెలిగే అనుచరవర్గం ఉంది. కరణం టీడీపీని వీడి వైసీపీలో కొనసాగుతూ ఉండటంతో.. అద్దంకిలో ఆయన వర్గీయులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారని నియోజకవర్గవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నెలకొంది.

News April 29, 2024

దర్శి: గొడవను అడ్డుకోబోతే హత మార్చారు

image

దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన తెలిసిందే. పోలీసులు వివరాల మేరకు ఆస్తి తగాదాలతో రాజా వెంకటేష్(32) అనే యువకుడిని చిన్నమ్మ కూతురు భర్త బంధువులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. చిన్నమ్మ కూతురుపై దాడికి యత్నించడంతో వెంకటేష్ అడ్డు రావడంతో కత్తులతో పొడిచి పరారయినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 29, 2024

ప్రకాశం: చంద్రబాబు పర్యటనలో మార్పు

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఈనెల 30న యర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు పర్యటించేలా షెడ్యూల్ ఖరారయింది. అదే రోజు లోకేశ్, బాలకృష్ణ పర్యటిస్తుండటంతో పర్యటన వాయిదా పడినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. మే 3, 4వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తున్నట్లుగా తెలిపారు. 3న మార్కాపురం, 4న దర్శిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.

News April 29, 2024

ప్రకాశం జిల్లాకు రానున్న పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మే 3వ తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇటీవల ఒంగోలు కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు చేపట్టే ప్రచారానికి రావాలని ఆహ్వానించారు.

News April 29, 2024

మండిన ప్రకాశం.. ప్రజలు బెంబేలు

image

జిల్లా ఎండ తీవ్రతతో మండిపోతోంది. ఆదివారం ఉదయం నుంచే ఎండ తీవ్రతతో పాటు వేడిగాలులతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరైంది. మార్కాపురం, కంభం, అర్దవీడులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అనేక మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమ ప్రాంత మండలాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.