Prakasam

News April 26, 2024

కొండపి: ఒకే రోజు అటు జగన్, ఇటు బాలకృష్ణ

image

కొండపి నియోజకవర్గంలో ఒకే రోజు సీఎం జగన్, నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న మర్రిపూడిలోని బస్టాండ్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అదేరోజు కొండపిలో సీఎం జగన్ పర్యటిస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇద్దరి పర్యటనలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

News April 26, 2024

ఇన్‌ఛార్జ్ డీపీవో నన్ను బెదిరించారు: మద్దిపాడు ఈవోఆర్డీ

image

‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్‌ఛార్జ్ ‌డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో దాతల సహకారంతో గతంలో ఆర్వో ప్లాంట్ నిర్మించి పంచాయతీకి అప్పగించినా ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో మీటర్ కాలిపోయింది. దాని మరమ్మతుల కోసం ఓ మంత్రి జోక్యం చేసుకోవడం, అధికారుల మధ్య కోల్డ్ వార్ నేపథ్యంలో ప్లాంట్ వివాదం ముదిరింది.

News April 26, 2024

యర్రగొండపాలెంలో టీ కొట్టు యజమాని హత్య?

image

యర్రగొండపాలెంలో టీ కొట్టు యజమాని శ్రీను త్రిపురాంతకం రోడ్ సెంటర్‌లో హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరగ్గా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలను పరిశీస్తున్నారు. ఆ ప్రదేశంలో అచ్చు బొమ్మ ఆడుతున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 26, 2024

ప్రకాశం: ఆ మండలం నుంచి ఆరుగురు MLA అభ్యర్థులు

image

దేశంలోనే పొగాకు వ్యాపారానికి టంగుటూరు మండలం ప్రసిద్ధి. ఇక్కడి నుంచి వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు MLA అభ్యర్థులు ఉన్నారు. బాలినేని, దామచర్ల జనార్దన్ ఇద్దరిది ఈ మండలమే. వీరిద్దరూ ఒంగోలు నుంచి తలపడుతున్నారు. బుర్రా మధుది టంగుటూరులోని శివపురం. MLA డోలా వీరాంజనేయ స్వామిది తూర్పు నాయుడుపాలెం. తాటిపర్తి ఇక్కడివారే. వరికూటి అశోక్ బాబు కారుమంచిలో పుట్టి పెరిగారు. అటు గంటా శ్రీనివాసరావుది జరుగుమల్లి మం.

News April 25, 2024

ప్రకాశం జిల్లాకు సీఎం జగన్ రాక

image

సీఎం జగన్ ఈనెల 28 నుంచి రోజూ 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఆయన ఈ నెల 28న కందుకూరులో. 30న కొండపిలో పర్యటించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలకు వెంకటగిరిలో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. 30వ తేదీ ఉదయం 10:00 గంటలకు కొండపిలో పర్యటించనున్నారు. సభా ప్రాంగణాల వివరాలు తెలియాల్సి ఉంది.

News April 25, 2024

కందుకూరులో టీడీపీకి ఊహించని షాక్

image

కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ ముస్లిం మైనార్టీస్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫీ గురువారం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహార శైలితో మానసిక వేదనకు గురైన తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు.

News April 25, 2024

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు: ఆర్ఐఓ

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ విద్యామండలి శాఖ ఈనెల 30 వరకు పొడిగించినట్లు ఆర్ఐఓ సైమన్ విక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు కూడా ఈ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటివరకు ఫీజు చెల్లించని వారు ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకొని విద్యార్థుల ఫీజులు చెల్లించి, పరీక్షలకు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News April 25, 2024

రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ

image

ఈనెల 26వ తేదీన గుడ్లూరులో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని గురువారం టీడీపీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం కందుకూరు టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గుడ్లూరులో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొంటారని తెలిపారు. కావున మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

News April 25, 2024

చీమకుర్తి: భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

image

చీమకుర్తిలో ఈనెల 21న జరిగిన చోరీ కేసును చేధించినట్లు ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ తెలిపారు. ఒంగోలులో మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన పమిడి పద్మశ్రీ తన సోదరుడు మృతి చెందడంతో ఈనెల 21న బల్లికురవ వెళ్లారు. తిరిగి వచ్చే సరికి తలుపులు పగులగొట్టి దుండగులు 70 సవర్ల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరినీ అరెస్టు చేశారు.

News April 25, 2024

ఒంగోలులో కానిస్టేబుల్ రత్నబాబుపై వేటు

image

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వైసీపీ ర్యాలీలో పాల్గొన్న కానిస్టేబుల్ డి.ఎన్.బి. రత్నబాబు అలియాస్ గోపిపై వేటు పడింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ బుధవారం ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఒంగోలులో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జస్వంతరావు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రత్నబాబుపై కేసు కూడా నమోదైంది.