India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో నిమ్మధరలు వారం రోజులుగా భారీగా పడిపోయాయి. కిలో రూ.60 నుంచి రూ.30లకు పడిపోయింది. దీంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. కనిగిరి కమీషన్ మార్కెట్‌కు రోజుకు 10 లారీల సరకు వచ్చేది కాగా, ఇప్పుడు 2, 3 లారీలకు పరిమితమైంది. మార్కాపురం స్థానిక మార్కెట్లకు వెళ్తున్న రెండోరకం నిమ్మకు రూ.5లకు మించి లేదు. దీంతో కోతలు ఆగిపోయాయి. అకాల వర్షంతో ధరలు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 2.14 లక్షల హెక్టార్లు కాగా.. వర్షాలు ఆశించిన స్థాయిలో పడితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు అవసరమైన 40వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 1,500 క్వింటాళ్ల కందులు, 5వేల క్వింటాళ్ల మినుములు, 1,200 క్వింటాళ్ల పెసలు ఆర్బీకేల్లో రైతులకు అందబాటులో ఉంచారు.
చీమకుర్తి మండలం రామతీర్థం జలాశయంలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తాళ్లూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన 9 మంది యువకులు జలాశయాన్ని చూడటానికి వచ్చారు. ఈ క్రమంలో యాతం మణికంఠ(22) అనే యువకుడు ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
చీరాల పట్టణ పరిధిలో పేరాలకు చెందిన వడ్డె నాగేశ్వరరావు బజారుకు చెందిన ఈశ్వరరావు తన రెండు చేతులు పోగొట్టుకున్నాడు. ర్వైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం వేకువజాము సమయంలో కారంచేడు రైలు గేటు దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రైలు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను రెండు చేతులు కోల్పోయాడు. స్థానికులు 108లో చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
అర్ధరాత్రి ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన కురిచేడు మండలం పెద్దవరం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎర్రగుంట్ల పెద్ద నాగేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తి చేతబట్టి నలుగురిపై దాడి చేశాడు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డిప్యూటేషన్ మీద వచ్చిన ఓ ఉద్యోగినిపై ఓ అధికారి కీచకుడిగా మారారు. ‘నీ డిప్యూటేషన్ రద్దు చేయించకుండా ఉండాలంటే నా కోరిక తీర్చాలి. మార్కాపురంలో నా స్నేహితుడికి లాడ్జి ఉంది. లేదంటే పొదిలికి రా.. అక్కడా కుదరకుంటే కంభం వచ్చినా సరే.. రాకుంటే నీ డిప్యుటేషన్ రద్దు చేయిస్తా’ ఇవి ఓ కామాంధ అధికారి మాటలు. ఈ మాటలు విన్న ఆ ఉద్యోగి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులకు శనివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
చీరాల ఆరబిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంపన పవన్ కుమార్ అనే ట్రిపుల్ ఐటీ విద్యార్థి శనివారం మృతి చెందాడు. ఈపూరుపాలెం నుంచి చీరాలకు పవన్ కుమార్ బైకుపై వస్తుండగా మార్గమధ్యంలో ఒక యువకుడు లిఫ్ట్ అడిగి తనను రైల్వే స్టేషన్ వద్ద దింపమని కోరాడు. అతడిని ఎక్కించుకొని ఆరబి మీద వెళుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పవన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడులో టీడీపీ నాయకుడు చిగురుపాటి శేషగిరిరావుకు చెందిన కారు దగ్ధం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రావు తెలిపారు. ఒంగోలులోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిందితులు కనసాని ఈశ్వర్ రెడ్డి, పాలెటి అభిషేక్, గోపాలుడని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకొని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతీఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన విధులను పూర్తి చేయాలని అన్నారు
చీరాల పట్టణ సమీపంలోని విజయనగర కాలనీ సమీపంలో తేళ్ల బుల్లయ్య (35) అనే వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.