India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మర్రిపూడి మండలం పన్నూరు గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వివాహిత (33) భార్యాభర్తల వివాదాల నేపథ్యంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై శివ బసవరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎస్సై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను హత్య చేసి, ఆపై తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడో కసాయి భర్త. పోలీసుల వివరాల ప్రకారం.. కొనకమిట్ల మండలానికి చెందిన మధులత, దర్శికి చెందిన పరకాల నాగేంద్ర దంపతులు. ఈనెల 4న రాత్రి వారి మధ్య గొడవ కాగా.. నాగేంద్ర ఆవేశంలో భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. మృతదేహాన్ని ముక్కలు చేయాలనుకొని, ఆపై గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో నిజం తేలడంతో కటకటాల పాలయ్యాడు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వ్యక్తిగత విభాగం ఏర్పాటు చేసినట్లు జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి బి.జగన్నాథరావు తెలిపారు. అక్రమ తవ్వకాలు చేపడుతుంటే 6281799518 నంబరుకు ఫిర్యాదు చేయాలని ఆయన పేర్కొన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు జరిపితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
మండలంలోని ఏల్చూరులో బాల ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద గురువారం చీరకు నిప్పంటుకొని తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన అంకంశెట్టి పున్నాయమ్మ దీపారాధన చేస్తూ మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు నరసరావుపేట వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
విద్యుదాఘాతంతో 7 పాడి గేదెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు గ్రామానికి చెందిన పలువురి రైతులకు చెందిన 7 పాడి గేదెలు శుక్రవారం గ్రామ శివారులో మేత మేస్తున్నాయి. ఈ క్రమంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ గేదెల విలువ రూ.5లక్షలు ఉంటుందని రైతులు వాపోయారు.
ఆస్తి కోసం అన్నదమ్ములు ఘర్షణలో తమ్ముడు మృతి చెందిన ఘటన శింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని వెంకటేశ్వర కాలనీలో శుక్రవారం జరిగింది.స్థానికుల వివరాల ప్రకారం.. కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అన్నదమ్ముల మధ్య మాట మాట పెరిగి పరస్పర దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో తమ్ముడు చొప్పర శివశంకర్(33) మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
అద్దంకి మండలంలోని శ్రీనివాస్ నగర్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న మొక్కజొన్న లోడు ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వ్యక్తిని స్థానికులు అంబులెన్స్‌లో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్, సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆర్ఐఓ సైమన్ విక్టర్ తెలిపారు. 43 పరీక్ష కేంద్రాల్లో 22,366 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం 15,291, ద్వితీయ సంవత్సరం 7,075 మంది విద్యార్థులు ఉన్నారు. నిమిషం ఆలస్యమైన ప్రవేశం నిషిద్ధమని ఆర్ఐఓ స్పష్టం చేశారు.
ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలులోని రైజ్ కాలేజీలో జిల్లాలోని 8 నియోజకవర్గాలకు విడివిడిగా గదులు కేటాయించారు. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించిన గదిలో 28 టేబుళ్లు ఉంటాయి. 14 టేబుళ్లు అసెంబ్లీ, 14 టేబుళ్లు పార్లమెంట్ సెగ్మెంట్కు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 4 టేబుళ్లు అసెంబ్లీకి, 4 టేబుళ్లు పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఏర్పాటు చేస్తున్నారు.
కారంచేడుకు చెందిన పొత్తూరి వెంకట శివసుబ్రహ్మణ్యం భార్య రేఖ ప్రియాంక(32), పిల్లలు నిక్షిత్ (5) తేజవర్ధన్ (3)తో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరు కుమారిడి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కారులో తిరుమలకు వెళ్లారు. దైవదర్శనం అనంతరం వారు తిరిగి హైదరాబాద్‌కు బుధవారం రాత్రి బయలుదేరారు. గురువారం వేకువజామున కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రేఖ ప్రియాంక మృతిచెందగా, సుబ్రమణ్యంకు తీవ్ర గాయాలయ్యాయి.
Sorry, no posts matched your criteria.