India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కనిగిరి మున్సిపల్ పరిధిలోని స్థానిక మాచవరం జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మాచవరం గ్రామానికి చెందిన రమాదేవి (45)మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మాచవరం నుంచి కనిగిరికి వస్తున్న వ్యానును మరో వ్యాను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అన్నారు. క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి హైదరాబాదు నుంచి ఈనెల 23వ తేదీన ఒంగోలుకు రానున్నట్లు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. 23న ఉదయం జరిగే పలు కార్యక్రమాల్లో మాగుంట శ్రీనివాస రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాంనగర్ లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణపట్నం పోర్ట్ నుంచి పేరేచర్ల వెళుతున్న లారీ.. మేదరమెట్ల పైలాన్ రహదారి పక్కన ఆగి ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ శ్రీధర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. ఈ లోగా మంటలు చెలరేగి నెల్లూరు జిల్లా ఇనమనమడుగు గ్రామానికి చెందిన శ్రీధర్ ఆ మంటల్లో కాలిపోయారని స్థానికులు తెలిపారు.
ఎన్నికల సందర్భంగా జిల్లాలో 26 వేల మందిని ముందస్తు బైండోవర్ చేశామని ఎస్పీ సునీల్ తెలిపారు. గొడవలు సృష్టించిన 35 మంది వివరాలను జిల్లా కలెక్టర్ కు నివేదించామన్నారు. వారిపై చర్యలకు అధికారులు సమాయత్తమవుతున్నారని చెప్పారు. మారణాయుధాలతో పాటు.. విడిగా పెట్రోలు కలిగివున్నా రౌడీ షీట్ తెరుస్తామని హెచ్చరించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ కార్యక్రమాలకు అనుమతులు తీసుకొని నిర్వహించుకోవాలన్నారు.
వృద్ధురాలి హత్య కేసుకులో ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. కొత్తపట్నంలోని రెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుడిపల్లి నాగేశ్వరమ్మ(75) కల్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 18న అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రెడ్డిపాలేనికి చెందిన నాగరాజు, నాంచార్లు నిద్రిస్తున్న ఆమెను గొంతు నులిమి, ఊపిరాడకుండా చేసి హత్యకు పాల్పడ్డారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మార్కాపురం మండలంలోని నికరంపల్లి వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ – బొలెరో వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఘటనలో బొలెరో వాహనంలో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష తేదీ గడువు పొడిగించారు. జూన్ 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, బీటెక్, ఎంటెక్ కోర్సులలో చేరేందుకు ఈ పరీక్షలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అఖిల భారత అగ్నివీర్ వాయు నియామక ర్యాలీకి అర్హత, ఆసక్తి కలిగిన అవివాహిత పురుషులు, స్త్రీలు దరఖాస్తు చేసుకోవాలని బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. అగ్నివీర్ వాయు నియామక ర్యాలీ కాన్పూర్, బెంగళూరులో జరుగుతుందన్నారు. అర్హులైన వారి నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ ర్యాలీకి అర్హులైన వారంతా 22వ తేదీ నుంచి జూన్ 5 వరకు సంబంధిత వెబ్‌సైట్‌లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
పామూరు చెందిన నూకసాని హర్షిత జాతీయస్థాయి ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలలో తన ప్రతిభతో బంగారు పతకాన్ని సాధించింది. గంగాధర్ రావు, శారదల కుమార్తె హర్షిత పట్నాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో మూడో సంవత్సరం విద్యను అభ్యసిస్తుంది. అయితే ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి నైపుణ్య పోటీలలో హర్షిత తయారుచేసిన కాస్ట్యూమ్స్‌కి బంగారు పతకం వరించింది. దీంతో గ్రామస్థులు, హర్షిత తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.
వాడరేవు – రామాపురం రోడ్డులో మంగళవారం ఉదయం బైక్ అదుపుతప్పి ఊటుకూరి సుబ్బయ్య పాలెంకు చెందిన మత్స్యకారుడు బాలాజీ (55) దుర్మరణం చెందాడు. ఉదయం బైక్‌పై వేగంగా వెళుతుండగా అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఈపూరుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.