Prakasam

News April 20, 2024

ప్రకాశం: ‘హెచ్చరిక.. పిడుగులు పడే అవకాశం’

image

‘హెచ్చరిక… హెచ్చరిక.. హెచ్చరిక మీ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన. భవనాల్లో ఆశ్రయంపొందాలి.’ అంటూ APSDMA హెచ్చరిక చేసింది. దీంతో శనివారం ప్రకాశం జిల్లాలోని ప్రజలకు అలర్ట్ మెసేజులు రావడంతో ఒక్కసారిగా భయాందోళన చెందారు. కావున జాగ్రత్తగా ఉండండి.

News April 20, 2024

మార్కాపురం: అక్రమ సంబంధం.. ఇద్దరూ సూసైడ్

image

మార్కాపురం మండలం చింతకుంట గ్రామ శివారులో ఓ జంట పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. మృతులు పెద్దారవీడు మండలం పుచ్చకాయ పల్లి గ్రామానికి చెందిన వివాహిత విజయలక్ష్మి(40), సత్యనారాయణ రెడ్డి (30)గా స్థానికులు గుర్తించారు. ఇద్దరు అక్రమ సంబంధం కొనసాగిస్తుండటంతో ఇరు కుటుంబాలు వారు మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు.

News April 20, 2024

ప్రకాశం జిల్లాకు రానున్న షర్మిలా రెడ్డి

image

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు ఈనెల 22న వైఎస్ షర్మిల పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా 22న ఉదయం 10 గంటలకు బూదాల అజిత్ రావు ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. అదేరోజు చీరాలలో కూడా పర్యటించనున్నట్లు వెల్లడించారు. కావున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు.

News April 20, 2024

ప్రకాశం: నామినేషన్ కార్యక్రమంలో విషాదం.. ఒకరి మృతి

image

యర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు నామినేషన్ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన త్రిపురాంతకం మండలం నీళ్ళ గంగవరం గ్రామానికి చెందిన కందుల బాషయ్య (30) అనే వ్యక్తి వడదెబ్బ కారణంగా మృతి చెందాడు. విషయం తెలుసున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మృతున్ని సందర్శించి.. కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

News April 20, 2024

అద్దంకి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన కన్నడ హీరో

image

ప్రముఖ కన్నడ సినిమా ఇండస్ట్రీ హీరో, దర్శకుడు రాజా రవివీర అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హనిమిరెడ్డితో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీకి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అద్దంకి గడ్డపై హనిమిరెడ్డి ప్రభంజనాన్ని చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

News April 20, 2024

సివిల్ సర్వీస్ ర్యాంకర్‌ను అభినందించిన ప్రకాశం ఎస్పీ

image

సివిల్ సర్వీసులో ఉత్తీర్ణత సాధించిన సింగరాయకొండకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డిని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ శుక్రవారం అభినందించారు. ఇటీవల సివిల్ సర్వీసులో కృష్ణారెడ్డి ఆల్ ఇండియా 780 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉదయ్ కృష్ణారెడ్డిని శాలువతో ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.

News April 19, 2024

కనిగిరి: బైకుపై నుంచి పడి వ్యక్తి మృతి

image

కనిగిరి మండలంలోని సుల్తానపురానికి చెందిన లక్కిరెడ్డి పెద్ద అంజయ్య (56) శుక్రవారం మృతి చెందారు. మాచవరం వద్ద బైకుపై నుంచి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్నికల నిమిత్తం అటుపై వెళ్తున్న సీఐ రామనాయక్ స్పందించి పెద్ద అంజయ్యను తన వాహనంలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హాస్పిటల్ కి వచ్చిన కొద్దిసేపు తర్వాత పెద్ద అంజయ్య మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

News April 19, 2024

ప్రకాశం: నామినేషన్ వేసిన భార్యా, భర్త

image

జిల్లాలోని దర్శి YCP MLA అభ్యర్థి బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డితో పాటు ఆయన సతీమణి నందిని రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వీరిద్దరికి కలిపి రూ.29.3 కోట్ల మేర ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపర్చారు. ఇక చరాస్తుల విలువ సుమారు రూ.10.66 కోట్లు, రూ.45 లక్షలు విలువ గల బంగారం, ఒక బీఎండబ్ల్యూ, ఇన్నోవా, రూ.45 లక్షల మీని కూపర్ కారు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరిపై ఎటువంటి కేసులు లేవని వివరించారు.

News April 19, 2024

నాడు ఒంగోలు కలెక్టర్.. నేడు ఎమ్మెల్యే అభ్యర్థి

image

లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ జి.ఎస్.ఆర్.కే.ఆర్ గురువారం తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తనకు ఓటు వేయమని తిరుపతి ప్రజలను కోరారు. విజయ్ కుమార్ 2013 నుంచి 2015 వరకు ఒంగోలు జిల్లా కలెక్టర్‌గా, ప్లానింగ్ సెక్రటరీగా సేవలందించారు.

News April 19, 2024

ప్రకాశం: బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం

image

బల్లికురవ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ రెండు రోజులు క్రితం అత్యాచారం చేశాడు. ఈ విషయం బుధవారం రాత్రి బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో విచారించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.