Prakasam

News May 20, 2024

దాడుల ఘటనలపై 72 మంది అరెస్ట్: బాపట్ల ఎస్పీ

image

చీరాల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై కేసు నమోదు చేసి పలువురి అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కూటమి అభ్యర్థి కొండయ్య వాహనంపై దాడి ఘటనపై ఆరుగురిని, మరొక ఘటనపై ఐదుగురిని, అలాగే చీరాల వేటపాలెం మండలంలో చోటు చేసుకున్న ఘటనలపై ఐదు కేసులు నమోదు చేసి 61 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విగాథం కలిగిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News May 19, 2024

ప్రకాశం: నెమలిగుండానికి చేరుకుంటున్న వరద నీరు

image

రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండానికి వరద నీరు వచ్చి చేరుతోంది. కొద్దిరోజులుగా ఎగువన ఉన్న అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నీటి గుండానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం నీటి గుండాన్ని సందర్శించేందుకు సందర్శకులు ఆలయానికి పోటెత్తారు. వేసవికాలంలో నీటి గుండానికి నీరు వచ్చి చేరుతుండడంపై సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News May 19, 2024

ప్రకాశం: రైలు పట్టాలపై మృతదేహం

image

జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం గ్రామ సమీపాన గల రైల్వే వంతెన వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. రైలు పట్టాల మధ్య సదరు వ్యక్తి పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతుడి వివరాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. రైలు కిందపడి ఆ వ్యక్తి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 19, 2024

కంభం చెరువు ప్రకృతి అందాలు చూశారా..!

image

జిల్లాలోని కంభం చెరువుకు విశిష్టత ప్రపంచంలోనే చెప్పుకోదగ్గది. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చెరువుగా కంభం చెరువుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చెరువు వద్ద ప్రకృతి అందాలు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటుంటాయి. అందుకే సెలవు దినాలు వచ్చాయంటే చాలు కంభం చెరువు వద్దకు పెద్ద సంఖ్యలో సందర్శకులు చేరుకుంటారు. అంతేకాదు మరికొందరు ఇక్కడ చేపలను సైతం వలల సహాయంతో వేట కొనసాగిస్తారు.

News May 19, 2024

ప్రకాశం: ధర తగ్గిన నిమ్మ.. దిగాలుపడిన రైతులు

image

జిల్లాలో నిమ్మ సాగు చేసిన రైతులు దిగాలు పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో 4వేల హెక్టార్లలో రైతులు నిమ్మ సాగు చేయగా, పంట దిగుబడి సైతం అధికంగా వచ్చింది. పంట దిగుబడిపై సంబరపడ్డ రైతులు, ప్రస్తుత మార్కెట్ ధర ఆశాజనకంగా లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో రూ.40 లు మాత్రమే ధర పలుకుతుండగా, పెట్టుబడి సైతం చేతికి అందే పరిస్థితి లేదని రైతులు తెలుపుతున్నారు.

News May 19, 2024

కనిగిరి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

కనిగిరి దేవాంగ నగర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఒంగోలు నుంచి కనిగిరి వైపు వస్తున్న కారు, కనిగిరి నుంచి కాశిరెడ్డి కాలనీకి వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న దేవాంగ నగర్‌కు చెందిన బత్తుల విష్ణు (57) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 19, 2024

ప్రకాశం జిల్లాలో ఎంతమంది ఓటు వేయలేదు అంటే?

image

రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో 87.21% పోలింగ్ నమోదైంది. 18,22,470 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,14,832 మంది ఓటు వేయలేదు. నియోజకవర్గాలు వారిగా చూస్తే వై.పాలెంలో 20,423, దర్శి 18,741, SN.పాడు 25,012, ఒంగోలు 32,502, కొండపి 26,919, మార్కాపురం 23,992, గిద్దలూరు 33,921 కనిగిరి 33,322 మంది ఓటు వేయలేదు. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91, గిద్దలూరులో అత్యల్పంగా 84.37% నమోదైంది.

News May 19, 2024

ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సాగుకు సన్నద్ధం

image

నైరుతీ రుతు పవనాలు ఈఏడాది ముందుగానే రావడంతో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ దఫా జిల్లా వ్యాప్తంగా 3,70,307 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారలు అంచనా వేస్తున్నారు. సాగు విస్తీర్ణం బట్టి ఇప్పటికే మండలాల వారీగా విత్తనాలు కేటాయించినట్లు జేడీఏ శ్రీనివాసరావు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News May 18, 2024

ప్రకాశం జిల్లాపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

image

ప్రజాస్వామ్యం పట్ల ఉన్న గౌరవాన్ని ప్రకాశం చాటి చెప్పిందని యావత్ భారతావని ప్రస్తుతం జిల్లా ప్రజలను ప్రశంసిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలోనే 87.09 శాతం పోలింగ్ నమోదుతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాదు జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్ నమోదు కావడంతో అత్యధికంగా పోలింగ్ నమోదైన నియోజకవర్గంగా పేరుగాంచింది. ఈ రికార్డుల పట్ల జిల్లా ప్రజలకు ప్రశంసలు కురుస్తున్నాయి.

News May 18, 2024

అప్పుడు ప్రకాశం ఎస్పీ.. ఇప్పుడు పల్నాడు ఎస్పీ

image

పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ నియమితులయ్యారు. ఆమె గతంలో కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేశారు. తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీగా రెండున్నరేళ్లకు పైగా పని చేశారు. అనంతరం తిరుపతి ఎస్పీగా పని చేశారు. మల్లికా గార్గ్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన పోలీస్ అధికారిని. కాగా ఈమె పల్నాడు జిల్లాకు వచ్చిన తొలి మహిళా ఎస్పీగా ఉన్నారు.