Prakasam

News April 16, 2024

నేను భయం, బాధ్యతతో పనిచేస్తా: చెవిరెడ్డి

image

‘నన్ను ఆదరించి ఎంపీగా గెలిపించండి. భయంతో, బాధ్యతతో పని చేస్తాను’ అని ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. కొమరోలులో సోమవారం రాత్రి వైసీపీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ ఎన్నికల్లో పోటీ చేయటానికి సింగిల్‌గా సింహంలా వస్తున్నాడని, చంద్రబాబు పొత్తు పెట్టుకుని వస్తున్నాడని చెప్పుకొచ్చారు.

News April 16, 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలే లక్ష్యం: కలెక్టర్, SP

image

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తో కలిసి గిద్దలూరు ఎంఆర్వో ఆఫీసు విజిట్ చేశారు. ఈసందర్భంగా ఆర్వో నాగజ్యోతి ద్వారా ఎన్నికల పర్యవేక్షణపై చేపట్టిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

News April 15, 2024

పర్చూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

పర్చూరులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పర్చూరు నుంచి పెద్దివారిపాలెం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న రావి విజయ భాస్కర్‌ని ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన ఇరువురిని 108లో గుంటూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో విజయ భాస్కర్‌ మృతి చెందగా, మరొక వ్యక్తి చికిత్స పొందుతున్నారు.

News April 15, 2024

ఒంగోలులో బైక్ దొంగలు అరెస్టు

image

బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ (క్రైమ్) శ్రీధర్ రావు సోమవారం తెలిపారు. ఒంగోలులో గత కొన్ని రోజులుగా బైక్ దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో నిఘా ఉంచారు. సోమవారం ఒంగోలు రైల్వే స్టేషన్ పరిధిలో ఇద్దరు అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించి, వారి వద్ద నుంచి 10 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

News April 15, 2024

ప్రకాశం: ఏప్రిల్ వచ్చినా అందని మార్చి నెల జీతం

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 300 మంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎస్టీ గురుకుల పాఠశాలలో కొన్నేళ్లుగా ఉపాధ్యాయలుగా పనిచేస్తున్నారు. సమాన పనికి సమాన వేతన పద్ధతి అమలు కానప్పటికి, ఇస్తున్నటువంటి రూ.15 వేలు, నెల నెల జీతం అందడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మార్చి నెల జీతాన్ని విడుదల చేయవలసిందిగా ఉపాధ్యాయులు కోరుతున్నారు.

News April 15, 2024

ప్రకాశం: రైలు కింద పడి గుర్తుతెలియని మహిళ మృతి

image

ఉలవపాడు మండలం తెట్టు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ట్రాక్ సిబ్బంది గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆకుపచ్చ రంగు చీర ధరించినట్లు తెలిపారు.

News April 15, 2024

ప్రకాశం: లాస్ట్ ఛాన్స్.. దరఖాస్తు చేసుకోండి

image

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన చివరి అవకాశం నేటితో ముగియనుంది. ప్రకాశం జిల్లాలోని 18 సంవత్సరాల నిండిన యువతీ, యువకుల్లో ఓటర్ కార్డు లేని వారు ఆన్లైన్లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ఈ అవకాశం కోల్పోతే మళ్లీ 5 సంవత్సరాల వరకు ఆగాల్సిందేనన్నారు.

News April 15, 2024

ప్రకాశం: రేపు బాస్కెట్ బాల్ జిల్లా ఎంపిక

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ జూనియర్‌ బాలబాలికల జట్ల ఎంపిక ఈనెల 16న కందుకూరులోని టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు సోమినేని సురేష్‌ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక ప్రారంభమవుతుందన్నారు. 2006 జూన్‌ 1వ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలన్నారు.

News April 15, 2024

తర్లుపాడు: ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. ఒకరి మృతి

image

తర్లుపాడు మండలం గొల్లపల్లి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మార్కాపురం మండలం మిట్టమీదపల్లికు చెందిన వెంకటేశ్వరరెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

News April 15, 2024

కంభం:  IIITలో విద్యార్థి ఆత్మహత్య

image

ఇడుపులపాయ IIITలో చదువుతున్న కంభం మండలం జంగంగుంట్ల గ్రామానికి చెందిన విద్యార్థి హాస్టల్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారంరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుర్రి పుల్లయ్య కూతురు కుర్రి రేఖ (21) మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 4వ సంవత్సరం చదువుతోంది. ఈ విషయం కాలేజీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.